Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?

April 10, 2026 by M S R

.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రీల్‌లో… ఒక ప్రభుత్వ పాఠశాలలో… మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అందరూ రకరకాల కూరలు, పప్పులు తెచ్చుకోగా, ఒక పేద విద్యార్థి మాత్రం తన బాక్స్‌లో కేవలం రొట్టె, పంచదార మాత్రమే తెచ్చుకున్నాడు.

తన స్నేహితుల ముందు ఆ ఆహారాన్ని తీయడానికి ఆ బాలుడు సంకోచిస్తూ, తల దించుకుని కూర్చున్నాడు. ఆ చిన్నారి తన బాక్స్‌ చూసి కొంత ఇబ్బందిగా, తక్కువగా ఫీల్ అవుతున్నట్టుగా కనిపించింది. ఆ చిన్నారి ముఖంలోని బాధను, ఆత్మన్యూనతను గమనించిన ఉపాధ్యాయురాలు, నిశ్శబ్దంగా తన దగ్గరకు వెళ్లారు. ఆమె ఆ బాలుడిని మందలించడమో లేదా జాలి చూపడమో చేయకుండా, అరె.. రొట్టె- పంచదార తెచ్చుకున్నావా? నాకు ఇది అంటే చాలా ఇష్టం! మనం ఇద్దరం కలిసి తిందామా? అని అడిగారు.

Ads

roti

ఆమె తన దగ్గర ఉన్న కూరలను ఆ బాలుడికి ఇచ్చి, అతని దగ్గర ఉన్న రొట్టెను ఆమె తిన్నారు. ఆ చిన్నారితో ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఆ బాక్స్‌లో ఉన్నది సాధారణ ఆహారం కాదని, అది చాలా రుచికరమైనదని (Classic combination) పాపతో చెప్పారు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు అని ఆమెను ఉత్సాహపరిచారు. టీచర్ మాటలతో ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు విరిసింది. ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నప్పుడు మాటలతో కాకుండా చేతలతో ఎలా ధైర్యం చెప్పాలో ఆమె నిరూపించారు.



View this post on Instagram



ఈ చిన్న సంఘటన ద్వారా ఆ ఉపాధ్యాయురాలు సమాజానికి రెండు ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. ఒకటి ఆహారాన్ని గౌరవించడం. ఇంట్లో ఏది ఉంటే అది తెచ్చుకున్న పాపను ప్రోత్సహించడం ద్వారా ఆహారం విలువను చాటి చెప్పారు. మరొకటి పిల్లల్లో సామాజిక స్పృహను కలిగించటం. ఆర్థిక వ్యత్యాసాల వల్ల పిల్లల మనసు గాయపడకుండా చూడటం ఎంత ముఖ్యమో ఆమె నిరూపించారు.

ఈ వీడియో చూసిన లక్షలాది మంది నెటిజన్లు సదరు ఉపాధ్యాయురాలిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. నిజమైన విద్య అంటే అక్షరాలు నేర్పడం మాత్రమే కాదు, ఇతరుల పట్ల దయగా ఉండటం నేర్పడం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి స్కూల్లోనూ ఇలాంటి టీచర్లు ఉండాలి, చిన్నారి ఆత్మగౌరవాన్ని కాపాడారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఒక చిన్న ప్రోత్సాహం ఒకరి జీవితంలో ఎంతటి సానుకూల మార్పును తెస్తుందో చెప్పడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. భౌతికమైన వస్తువుల కంటే మానవత్వం, ప్రేమ గొప్పవని ఈ టీచర్ చాటిచెప్పారు….



ఆ వీడియో వైరల్ సరే, దాని గురించి, ఆ టీచర్ సద్భావన గురించి చాలామంది పైన స్టోరీ హైలైట్ చేస్తున్నారు… కానీ ఆ వీడియోలో టీచర్ పిల్లాడిని అనునయించడం, తన రొట్టె తను తినడం, తన లంచ్ బాక్స్ కూర పిల్లాడికి ఇవ్వడం ఏమీ లేవు… నిజానికి చాలామంది పిల్లలు కూరలతో గాకుండా చక్కెరతో తినడానికి ఇష్టపడతారు… తల్లులు కూడా అలాగే లంచ్ బాక్సులో పెట్టిస్తారు…



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ క్షణం ఒక యుగం! 𝐓𝐡𝐞𝐒𝐩𝐥𝐚𝐬𝐡𝐃𝐨𝐰𝐧… భూమి ఎదురుచూస్తోంది..!
  • రొట్టె- చక్కెర … వైరల్ వీడియోపై బోలెడు పోస్టులు… కానీ..?
  • రాజీనామా చేశాడట… బారా ఖూన్ మాఫ్… వాటీజ్ దిస్ మోడీ…
  • పిల్లి కళ్ల పిల్ల మోనాలిసా ప్రేమపెళ్లి కథలో ట్విస్ట్… మొగుడిపై పోక్సో…
  • రేపు పోలింగ్ అనగా… ఓ ఉపఎన్నిక రద్దు… ఓ చిత్రమైన కేసు…
  • కొత్త కొత్త నాయికలతో రాజేంద్ర ప్రసాద్ రొమాన్స్… ఈమె ఎవరో తెలుసా…
  • ధ్వజమెత్తిన సందీప్ వంగా… ‘ధురంధర్ 2’ విమర్శకులకు చెంపపెట్టు…!
  • గులాబీ బాస్ ‘మౌన’ ముద్ర… తమ్ముళ్లలోనూ అదే ‘నిద్ర’…!
  • అడివి శేషుకు దీటుగా… అక్కడక్కడా దాటేసి… మెప్పించిన మృణాల్…
  • ఐపీఎల్ 2026… పదునైన ఆట మాత్రమే కాదు… అనేక ఎమోషన్స్ కూడా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions