.
కోట్ల రూపాయల అక్రమ వసూళ్లు, బెదిరింపులకు సంబంధించి సింగర్ మంగ్లి మీద కేసు నమోదైంది కదా పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో… ఆ వివరాలు కనుక్కుంటుంటే… అసలు ఈమె కేడీ, ది డెవిల్ సినిమాలోని రోత పాటపై నేషనల్ వుమెన్ కమిషన్ విచారణ జరుపుతోంది కదా, ఎక్కడివరకూ వచ్చిందనే ప్రశ్న తలెత్తింది… ఆ విచారణ కాస్త ఆసక్తికరంగా, సీరియస్‌గానే సాగుతోంది…
ఈ పాటకు బాధ్యులందరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది… వ్యక్తిగతంగా హాజరు కావాలని సంబంధిత బాధ్యులందరినీ ఆదేశించింది… మొదట్లో ‘అబ్బే, ఆ పాటను అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారాల నుంచి తీసేశాం’ అని తప్పించుకోచూసింది ఈ సినిమా టీమ్… కానీ కమిషన్ వదల్లేదు… దీంతో దర్శకుడు ప్రేమ్, పాట రచయిత రకీబ్ ఆలం, కేవీఎన్ ప్రొడక్షన్స్ (నిర్మాణ సంస్థ) ప్రతినిధులు వ్యక్తిగతంగా హాజరయ్యారు…
Ads
తనకు హిందీ పదాల అర్థాలు సరిగ్గా తెలియవని దర్శకుడు ఏదో బుకాయించడానికి ప్రయత్నించాడు… రచయిత, నిర్మాణ సంస్థ ప్రతినిధులు లిఖితపూర్వక క్షమాపణ సమర్పించారు… ‘సారీ కాదు, మూడు నెలలపాటు మహిళా సాధికారత, గౌరవానికి సంబంధించిన ప్రోగ్రామ్స్‌లో పాల్గొని, ఆ నివేదిక సమర్పించండి’ అని కమిషన్ సూచించింది… పాన్ ఇండియా సినిమా తీస్తూ, అన్ని వెర్షన్లకు సంబంధించిన ప్రతి అంశానికీ దర్శకుడు, నిర్మాత బాధ్యులే కదా… హిందీ రాదని ఓ విఫల సమర్థన దేనికి..?

ఆ పాటలో నర్తించిన ఐటమ్ లేడీ నోరా ఫతేహి స్వయంగా హాజరు కాకపోవడంతో, కమిషన్ చివరి నోటీసు జారీచేసింది… ఏప్రిల్ 27న తప్పకుండా హాజరు కావాలంది… సంజయ్ దత్ కూడా రాకపోవడంతో తనకూ నోటీసు జారీ చేస్తే, వచ్చి, తనకు పాట సాహిత్యంతో సంబంధం లేదన్నాడు… మంగ్లికి నోటీసుల విషయం, ఆమె వివరణ ఏమిటో సరిగ్గా తెలియదు…
- కానీ ఒకరు భాష తెలియదంటారు, మరొకరు పాట కంటెంటుతో సంబంధం లేదంటారు, ఇంకొకరు జస్ట్, నేను డాన్స్ చేశాను, నటించాను అంటారు… అందరూ శుద్దపూసలే… కానీ ఓ రోత పాటను మాత్రం వదిలి, అందరూ ఏవో సాకులతో జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించారు… మరో రెండు సందర్భాలు చెప్పుకుందాం…
2005లో కావచ్చు, మన్మథరావుల కోసం అనే ఆల్బమ్… నా పెట్టె తాళం తెరిచి చాలాకాలం అనే సేమ్ బూతు, రోత పాట ఒకటి ఫేమస్ సింగర్ ఉషా ఉతుప్ పాడింది… దాని మీద విమర్శలు జోరుగా సాగేసరికి లెంపలేసుకుని సారీ చెప్పింది, నాకు తెలుగు భాష రాదు అనేసింది… కానీ ఆమెకు తెలుగు అర్థమవుతుంది… ఏదో ఓ సాకు…
తరువాత దీన్నే నితిన్, శ్రీలీల ఆమధ్య నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ అనే ఓ డిజాస్టర్ సినిమాలో కూడా ఈ పాట వాడారు… పోలీస్ స్టేషన్‌లో ఆడ పోలీసులుగా నటించిన టీవీ ఆర్టిస్టులు సత్యశ్రీ, సోనియా సింగ్ మీద ఈ పాట సాహిత్యానికి సంబంధించి తీవ్రంగా నెటిజనం విరుచుకుపడ్డారు… నితిన్‌తో కూడా స్టెప్పులు వేయించారు…
అందరూ అందరే… ‘నాకు ముందుగా ఆ పాట గురించి తెలియదు, తీరా షూటింగ్ స్టార్ట్ చేశాక ఆ పాట బూతులకు భయపడితే, దర్శకుడు వక్కంతం వంశీ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పర్లేదు అని ధైర్యం చెబితే చేశానని సత్యశ్రీ ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది… తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు ప్రసిద్ధి, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ ఈ పాట రాశాడని రికార్డయి ఉంది… శ్యామ్, శేఖర్ మాస్టర్, నితిన్… వీళ్లు కూడా చివరకు..?!
రణబీర్ సింగ్ నయం… ఏదో వేదిక మీద కాంతారాలోని దేవతను అనుకరిస్తూ, దెయ్యం అని అర్థమొచ్చేలా మాట్లాడాడు… (కించపరిచే ఉద్దేశం కాదు)… కానీ విమర్శలు వచ్చేసరికి లిఖితపూర్వక క్షమాపణ సమర్పించాడు కోర్టుకు… స్వయంగా ఆ దేవత గుళ్లకు వెళ్లి శరణు వేడుకున్నాడు…!! ఆమధ్య రవితేజ నీయమ్మని, నీయక్కని ఓ చెత్తా పాటకు డాన్సాడి, పైగా దాన్ని సమర్థించుకున్నాడు… ఖర్మ..!!
Share this Article