.
ఎవరు నారాజ్ అవుతారనేది వదిలేయండి… రేవంత్ రెడ్డి అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటి తన ప్రచార విభాగం..! తన ప్రబల ప్రత్యర్థి (పింక్ క్యాంప్) 100 రూపాయల పని చేస్తుంటే, చివరకు పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికి దుబయ్ క్యాంపులు కూడా నడుపుతూ… తెలంగాణ సమాజం నుంచి దోచుకున్న కోట్లకుకోట్లు వెచ్చిస్తుంటే… రేవంత్ రెడ్డి నయాపైసా మందం చేతకావడం లేదు…
గతంలో, కేసీయార్ మెప్పు కోసం ప్రతి ప్రభుత్వ శాఖ ఉరుకులు పరుగులతో… పనిచేతగాకపోయినా ప్రచారాన్ని హోరెత్తించేది… పింక్ జర్నలిస్టుల యాడ్ ఏజెన్సీలు దండుకునేవి… ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖతోపాటు ప్రతి మంత్రిత్వ శాఖ ఓ డిజాస్టర్ సినిమాను తలపిస్తున్నాయి…
Ads
- ప్రతి మంత్రికీ ఓ పీఆర్వో, ఒకాయనకు సీఎంను మించిన సెటప్… సమాచార శాఖకూ ఓ మంత్రి, ఓ కమిషనర్, పీఆర్వో సిస్టం… అందరినీ కోఆర్డినేట్ చేసే సిస్టం లేదు, ఎవరి షో వాళ్లదే… ఇదంతా ఎందుకులే గానీ… ఓ దారుణ వైఫల్యం కథ చెప్పుకుందాం…
మొన్నటి ఇంటర్ రిజల్ట్స్… అద్భుతమైన ఫలితాలు సాధించాయి గురుకులాలు… కేసీయార్ తెలంగాణ జాతికి ఎన్ని ద్రోహాలు చేసినా సరే, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పుణ్యమాని ఈ గురుకులాల పేరిట ఎంతో కొంత న్యాయం చేసినట్టే..! స్వేరో బాపతు కథలు తరువాత…! కానీ తను వెళ్లిపోయాడు… ఇప్పుడు అదే ప్రవీణ్ ఎడాపెడా, చెడామడా కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తాడు, తను గడీలో మనిషి… అది వదిలేస్తే…
- మరి అద్బుతమైన రిజల్ట్స్ సాధించిన పిల్లల తాలూకు ప్రచారం ఏది..? కనీసం మొత్తం వివరాలను క్రోడీకరించిన మీడియాకు ఇచ్చిన అధికారి అంటూ లేకుండా పోయాడు… (సమాచార శాఖకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట కదా మంత్రి..? అసలే అక్రెడిటేషన్ల విధానంలో అడ్డగోలుగా బదనాం అయిపోయిన శాఖ… ఈరోజుకూ ఆ అక్రెడిటేషన్లు ఓ కొలిక్కిరాలేదు, ఆ లోపాలు దిద్దబడలేదు… అది వేరే ట్రాజెడీ…)
సరే, గురుకులాల సంగతికొద్దాం… రూరల్ బ్యాక్ గ్రౌండ్, పూర్ బ్యాక్ గ్రౌండ్, సోషల్లీ బ్యాక్ గ్రౌండ్ పిల్లలే కదా… మరి వాళ్లు అద్భుతాలు సాధిస్తుంటే చెప్పుకోవడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు చేతకాలేదు..? ఇది సొసైటీకి కూడా ఎంత మంచి సంకేతం..?
కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకు ఈ సిగ్గులేనితనం..! (ఏమాటకామాట, ఫలితాలు వెల్లడైన రెండు గంటల్లో ఏపీ ప్రభుత్వం మొత్తం రిజల్ట్స్ కంపేల్ చేసి, తమ గురుకుల పిల్లల్ని ఫోకస్ చేస్తూ, ఓన్ చేసుకుంటూ ఎక్సలెంట్‌గా ప్రచారం చేసుకుంది… మరి 2 రోజులు గడిచినా రేవంత్ రెడ్డి సర్కారుకు ఎందుకు చేతకాలేదు..? నిజానికి తెలంగాణ గురుకుల పిల్లల విజయాలతో పోలిస్తే ఏపీ గురుకుల పిల్లల మార్కులు, ర్యాంకులు చాలా పేలవం…)
- 1) గ్రామీణ నేపథ్యం ప్రతిభకు అడ్డుకాదు… 2) పేదరికం ప్రతిభకు అసలే అడ్డుకాదు… 3) ప్రతిభ ఏ అగ్రవర్ణం సొత్తు కాదు… 4) సరైన మౌలిక వసతులు, బోధన సౌకర్యాలు ఉంటే నిమ్నవర్గాలూ అద్భుతాలు చేస్తాయి… 5) గ్రామీణ పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అసలు సమస్యే కాదు… ఇదుగో ఈ కోణాల్లో కదా తెలంగాణ గురుకుల పిల్లల విజయాల్ని ఓన్ చేసుకోవాలి, ప్రొజెక్ట్ చేసుకోవాలి… సిగ్గూశరం లేదు రేవంత్ రెడ్డి సమాచార మంత్రిత్వ శాఖకు..!
రాజకీయ కోణం చూద్దాం… రేవంత్ రెడ్డి మహాశయా… ఇది నీ కోసమే…!
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు… మరణాలు… అసౌకర్యాలు… మన్నూమశానం అని బీఆర్ఎస్ రెండేళ్లుగా నానా చెత్తా ప్రచారం చేస్తోంది… అది ఫేక్ అని అందరికీ తెలుసు, కానీ కౌంటర్ చేసేవాడేడీ..? సీఎస్ దగ్గర నుంచి ఏ శాఖ సెక్రెటరీ కూడా పట్టించుకుంటే కదా…! కీలకమైన ఐఏఎస్ ఆఫీసర్లు సైతం మళ్లీ మా కేటీయార్ సర్కారు వస్తుంది అనే భ్రమల్లో ఉన్నారా..? సీఎస్‌కు ఎక్స్‌టెన్షన్ కూడా ఇచ్చాడు పాపం రేవంత్ రెడ్డి…
ఈ అద్భుతమైన గురుకుల ఫలితాలు బీఆర్ఎస్ బ్యాడ్ ప్రాపగాండాకు ఎంత మంచి కౌంటర్ అయి ఉండేవి… ఒరే, మీ పాలనకన్నా మేం ఆ పిల్లల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నాంరా అని చెప్పే ఉదాహరణలు అయి ఉండేవి… కానీ ఆ ఫలితాలను క్రోడీకరించిన వాడేడీ..? అన్నట్టు ఓ ఉదాహరణ చెబుతాను అన్నాను కదా… నా ఆసక్తి కొద్దీ మెయిన్ పత్రికల ఉమ్మడి పాలమూరు జిల్లా స్పెషల్ ఎడిషన్లు చదువుతుంటే కనిపించినవి జడ్చర్ల గురుకులం ఫలితాలు… ఇలా…

2nd MPC…
Yellamma 995/1000
Rani 993/1000
Geeta 993/1000
Anusha 990/1000.
2nd BPC
1.Jhansi 990/1000
2.Chaitra 987/1000
3.Vijayalaxmi 984/1000
4.Jeenat 984/ 1000
- గ్రామీణ నేపథ్యం, తెలుగు మాధ్యమం, పేదరికం, అణగారిన వర్గాల పట్ల వివక్ష… కానీ ఆ పేద తల్లిదండ్రుల ఆశలకు పట్టం కడుతున్నారు ఈ పిల్లలు…. కాస్త గమనించండర్రా… ఎంత మంచి సామాజిక మార్పో చూడండర్రా…
I MPC ,Sowmya 468/470
I MPC, Mahalaxmi 467/470
I MPC Rajitha 467/470
I MPC B.Harica 467/470
I BPC.
Umasri 438/440
B.Lavanya 437/440
K.Akshya 436/440
G.Anjali 435/440
470 మార్కులకు మహాలక్ష్మికి 467 మార్కులు…. నారాయణ కాదు, చైతన్య కాదు… సోకాల్డ్ లక్షలకు లక్షలు దోచుకునే రుద్దుడు బాపతు కార్పొరేట్ విద్యార్థులు కాదురా నాయనా… ప్యూర్ రూరల్ పూర్ పెరల్స్… వాళ్ల నేపథ్యాలు పరిశీలిస్తే, వాళ్ల విజయాలే అద్భుతం… అది ఓన్ చేసుకుని, సమాజానికి చెప్పలేని, చాటలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది… తన ప్రభుత్వ స్థూల ఫిలాసఫీని కూడా ప్రచారం చేసుకోలేని వైఫల్యం..!!

- నిజానికి ఫస్ట్ సంక్షేమశాఖ గురుకులాలకు కార్యదర్శి అలుగు వర్షిణి… పిల్లలు బోళ్లు తోమితే, బట్టలు ఉతికితే తప్పేముంది వంటి చిల్లర వ్యాఖ్యలు చేసి మస్తు బదనాం అయిపోయింది… బోలెడు విమర్శలు… ఆమె చివరకు కేంద్ర సర్వీసుకు పారిపోయింది… తరువాత ఇంటర్ కార్యదర్శి కృష్ట ఆదిత్య ఇన్‌చార్జి, తనేమీ పట్టించుకోలేదు… తరువాత విజయేంద్ర బోయను తీసుకొచ్చారు… బోయ భీమన్న మనమరాలు… ఆమె పర్సనల్ రీజన్స్‌తో వదిలేసింది… చివరకు సంక్షేమ గురుకులాలు ఎవరికీ పట్టని అనాథలు… ఐనా ఎంత అద్భుతమైన ప్రతిభ కనబరిచారో కదా… మీరు సూపర్‌రా పిల్లలూ..!!
Share this Article