Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

… ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?

April 19, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ఒంగోలులో 1985 ప్రాంతంలో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా పరుచూరి గోపాలకృష్ణ అసంభవామి యుగే యుగే అనే పేరుతో ఉదయంలో ధారావాహికగా ప్రచురించారు . ఆ ధారావాహికనే సర్పయాగం అనే టైటిలుతో సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో ఈ సినిమాగా తీయబడింది . 1991 నవంబర్లో విడుదలయింది . ఇంతకీ ఆ సంఘటన ఏమిటంటే :

ఒంగోలులో టిప్ టాప్ డ్రై క్లీనింగ్ షాప్ అని ఉండేది . దాని ఓనర్ పేరు కోదండరామిరెడ్డి . ఆయన కూతురు మంచి టెన్నిస్ ప్లేయర్ . ఒంగోలులోని హైదరీ క్లబ్బులో ఆ అమ్మాయి టెన్నిస్ అడుతుండేది . టెన్నిస్ కోచ్ , స్థానిక RTC డిపో మేనేజర్ కొడుకు , ఓ రాజకీయ నాయకుడి కొడుకు బీచ్ వద్దకు తీసుకుని పోయి అత్యాచారం చేసారు .

Ads

ఆ అమ్మాయి మూడు నాలుగు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది . చనిపోయే ముందు ఆ ముగ్గురినీ చంపేయాలని తండ్రిని కోరింది . తండ్రి ఇద్దరు ప్రొఫెషనల్సుని హైర్ చేసి ఇద్దరిని లేపేస్తాడు . మూడో వాడిని కూడా లేపేసే ప్రయత్నం చేస్తున్న టైంలో పోలీసులు అరెస్టు చేసారు . అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది .

ఆ కధ ఆధారంగా ధారావాహిక , ఆ తర్వాత ఈ సినిమా ఉద్భవించాయి . సినిమాలో కధ ఏంటంటే శోభన్ బాబు భార్య రేఖ (సుమతి జోసెఫిన్), కూతురితో సిన్సియర్ డాక్టరుగా నివసిస్తుంటాడు . భార్య చావు బతుకుల మధ్య ఉన్నా ఓ పేషంట్ డెలివరీకి అటెండయి పేషంటుని ప్రసవం చేపిస్తాడు . ఇంతలో డాక్టర్ భార్య చనిపోతుంది .
తల్లి లేని బిడ్డని గారాబంగా పెంచుతాడు . ఓ ఆవారా గ్యాంగ్ , అందులో ఒకడు వల వేసి పట్టుకుని ఆ అమ్మాయి రోజా మీద సామూహిక అత్యాచారం చేస్తారు . ఆత్మహత్య చేసుకుని చనిపోయే ముందు ఆ అయిదుగురి గురించి వ్రాసి వాళ్ళను చంపేయమని కోరుతుంది .

డాక్టర్ స్థానికంగా ఉన్న ఓ గ్యాంగ్ సహాయంతో నలుగురిని చంపేస్తారు . ఆ గ్యాంగులో ముఖ్యులు వాణీ విశ్వనాథ్ , సాయికుమార్ . అయిదో వాడిని చంపే లోపు పోలీసులు శోభన్ బాబుని అరెస్ట్ చేస్తారు . కోర్టులో తానే చంపేసానని , అవకాశం ఇస్తే ఆ అయిదో వాడిని కూడా చంపుతానని జడ్జికి చెపుతాడు .

  • ఈ కోర్ట్ సీన్ అద్భుతంగా తీసారు . శోభన్ బాబు డైలాగులలోనే అసంభవామి యుగే యుగే అనే పలుకులు వస్తాయి . గొప్ప మలుపు ఏంటంటే ఎవరి జన్మ కొరకు భార్యను పోగొట్టుకుంటాడో వాడే పెద్దయ్యాక ఆ డాక్టర్ కూతురిని మోసం చేసి మరణానికి కూడా కారణం అవుతాడు . ఆ ప్రబుధ్ధుని తల్లి శివపార్వతి ఈ విషయాన్ని కోర్టుకు చెప్పి ఆ ప్రబుధ్ధుని వలన ఆ డాక్టర్ భార్యను , కూతురిని , ఇప్పుడు తననే కోల్పోతున్నాడని చెపుతుంది . కోర్ట్ శోభన్ బాబుకి ఉరిశిక్ష విధిస్తుంది .

ఆఖరి కోరికగా ఖైదీలకు అన్నదానం చేయాలని ఉందని చెప్పి అదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆ ప్రబుధ్ధుని చంపే ప్రయత్నం చేస్తాడు . ఆ ప్రబుధ్ధుడు గాయపడి హాస్పిటలుకు షిఫ్ట్ చేయబడే క్రమంలో సాయికుమార్ గ్యాంగ్ చంపేసి సర్పయాగాన్ని పూర్తి చేస్తారు . ఉరిశిక్ష అమలవుతుంది . సినిమా దుఃఖాంతం అవుతుంది .

ఈ సినిమాలో ఓ గొప్ప పాత్ర నూతన్ ప్రసాద్ ఒరిజనల్ పాత్ర . కళాకారుడిగా కాళ్ళు పోగొట్టుకొని మంచాన పడటం ఎంత బాధాకరమో ప్రేక్షకులకు చెప్పుకుంటాడు నూతన్ ప్రసాద్ . కళ్ళు చెమ్మగిల్లుతాయి మనసున్న ప్రేక్షకులకు . ప్రేక్షకుల హృదయాలను కదిలించే పాత్ర . ఈ పాత్రను సినిమాలో జొప్పించేందుకు అంగీకరించిన నూతన్ ప్రసాదుకు కళాభివందనం .

శోభన్ బాబు నటించిన మంచి సినిమాలలో అద్భుతంగా నటించిన సినిమా ఈ సర్పయాగం . హేట్సాఫ్ టు శోభన్ బాబు . రోజాకు రెండో సినిమా . మంచి గుర్తింపే వచ్చింది . వాణీ విశ్వనాథ్ , సాయికుమార్ పాత్రలు ప్రాధాన్యత కలిగిన పాత్రలు . బాగా నటించారు . శివపార్వతి పాత్ర కూడా బాగా మలచబడింది . బాగా నటించింది కూడా .

ఇతర ప్రధాన పాత్రల్లో నగేష్ , సుత్తి వేలు , బ్రహ్మానందం , మా నరసరావుపేట వాడు ఫణి , రఘురామిరెడ్డి , మా గుంటూరు జయలలిత , జయశీల , రజిత , పరుచూరి గోపాలకృష్ణ , రాజా రవీంద్ర , బ్రహ్మాజీ , కిన్నెర , పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్ కళాకారులు , తదితరులు నటించారు . ఎప్పటిలాగే రామానాయుడు జైలర్ పాత్రలో తళుక్కుమంటారు .

విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సి నారాయణరెడ్డి గారే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , చిత్ర చాలా శ్రావ్యంగా పాడారు . హిట్టయ్యాయి కూడా . ముఖ్యంగా చుక్కా చుక్కా కన్నీటి చుక్క చెక్కిట జారొద్దు రిపీట్ సాంగ్ .

కాలేజీలో ప్రదర్శించబడే నృత్య బాలేలో వచ్చే పాట , బృంద నృత్యం చలి రాగం చెలి కోరే చిత్రీకరణ చాలా బాగుంటుంది . రోజా , ఆమెను ప్రేమ నెపంతో మోసం చేసే పాత్రధారి , నూతన పరిచయం శ్రీనివాస వర్మల మీద ఎ బి సి డి గుండెలో ఏదో వేడి డ్యూయెట్టుని పరుచూరి బ్రదర్స్ రాఘవేంద్రరావు మోడల్లో చిత్రీకరించారు .

మరో హాట్ సాంగ్ వాణీ విశ్వనాథ్ , రాజా రవీంద్రల మీద ఉంటుంది . దిగు దిగు నాగ అంటూ సాగుతుంది . ఈమధ్య ఇలాంటి లిరిక్స్ మీద ఏదో రాధ్ధాంతం జరిగింది . బ్రహ్మానందం , జయలలిత మీద సాగే పాట కూడా హాటుగానే ఉంటుంది . శుభ్రం చేయనా నీ గది శుభ్రం చేయనా అంటూ సాగుతుంది .

ఈ సినిమా కధ , డైలాగులు , దర్శకత్వం పరుచూరి బ్రదర్స్ వహించారు . రోజాకు ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా లభించింది . డాన్సుల్ని సుందరం మాస్టారు కంపోజ్ చేసారు . సినిమా బాగా హిట్టయింది కూడా . బిర్రయిన స్క్రీన్ ప్లేతో గబగబా లాక్కెళుతుంది ప్రేక్షకులను . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . మంచి ఎమోషనల్ , సెంటిమెంటల్ , ఏక్షన్ సినిమా …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … ఇంతకీ హీరో శోభన్ బాబు చేసింది నేరమా..? న్యాయమా..?
  • సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ… బ్యాడ్ బాయ్ నాగశౌర్య…
  • పాపం ప్రతాప్… పాపం ప్రేక్షకుడు… టైటిల్ జస్టిఫికేషన్ ఎవరికి..?!
  • రాహుల్ గాంధీ పోటీ చేయలేడా ఇక…? పౌరసత్వానికే ముప్పుందా..?
  • ఈ ఇద్దరు… మొన్న బ్లాక్ బస్టర్స్… నిన్న ఫ్లాప్ షో…
  • ఐపీఎల్ 2026 : పాత దోస్తులు – కొత్త శత్రువులు… పంత్ & శ్రేయాస్…
  • వైఎస్ మార్క్ లిబరల్..! కొత్త రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు ఈమధ్య..!!
  • ఇప్పుడైతే శోభన మోహన్‌బాబును మూడు చెరువుల నీళ్లు తాగించేది..!!
  • ది మిస్ ఫిట్..! ఆంటోనీ రాజు మంత్రి పదవి ఊడబీకిన ‘అండర్ వేర్’…
  • బీహార్ ‘సామ్రాట్’ చౌదరి – అబ్బో, నువ్వు మామూలోడివి కాదు బాసూ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions