Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహ్… ఆషురెడ్డి కథ- వ్యథ ఇదా..? లండన్ సాఫ్ట్‌వేరుడే అసలు దోషి..!!

May 1, 2026 by M S R

.

ఆషురెడ్డి బాధితురాలా..? నిందితురాలా..? దాదాపుగా మీడియా మొత్తం ఆమెను ఓ కళంకితలాగా చిత్రీకరిస్తోంది… 10 కోట్లను లండన్ సాఫ్ట్‌వేర్ దగ్గర కొట్టేసిన దొంగగా చూస్తోంది… ఉల్టా వాడినే బెదిరిస్తున్న బరితెగింపు కేరక్టర్‌గా రాస్తోంది, చూపిస్తోంది… ఇందులో నిజాలెన్ని అని ‘ముచ్చట’ ఆరా తీస్తే… అసలు వాడే పెద్ద నొటోరియస్ కేరక్టర్ అనీ, ఆషురెడ్డీ అన్నీ కోల్పోయిన అసలు బాధితురాలని అర్థమవుతోంది…

కాస్త ఓ క్రమపద్ధతిలో చూద్దాం… ధర్మేంద్ర అనేవాడికి ఏడెనిమిదేళ్లుగా ఆషురెడ్డి పరిచయం… వాడిని నమ్మింది, సర్వస్వం అప్పగించింది… పిలిచిన ప్రతిసారీ లండన్ వెళ్లింది… ఎంజాయ్ చేశాడు… (ఇప్పుడు ఆమె రాకపోకల ఖర్చులను కూడా ఆమె ఖాతాలో వేస్తున్నాడట వాడు…)

Ads

తను హైదరాబాద్ వస్తే తిరగడానికి రెండు కార్లు కొన్నాడు వాడు… ఒకటి బెంజ్, మరొకటి రేంజ్ రోవర్… వాటి ఖర్చూ ఆమె ఖాతాలోనే వేశాడు… ఇక్కడ ఉండటానికి ఓ ఫ్లాట్ కొన్నాడు, అదీ ఆమె ఖాతాలోనే వేశాడు… అన్నీ వాడి ఖర్చులే… ఆమె తన కోసం కొనిపించింది కిలో బంగారం, తీసుకున్నది ఓ సొంత ఫ్లాట్ కొనడానికి 1.5 కోట్లు… దానికీ నేపథ్యం ఉంది… దాని వెనుక ఆమె బాధ ఉంది… కక్కుర్తి కాదు…

నిజానికి ఆమె వాడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది… వేణుస్వామి దగ్గరకు వెళ్లి చూపించింది జాతకాలు… వద్దమ్మా, మీకు శృతి కలవదు, పెంటపెంట అయిపోతుంది అన్నాడు ఆయన… కానీ వాడు అంగీకరించలేదు… ఈలోపు ఆమెకు బ్రెయిన్ ట్యూమర్… అవును, నిజమే… షాక్ తిన్నదామె… విషయం చెప్పింది…

వేణుస్వామి ఆమె పేరిట కామాఖ్యలో ఏకంగా ‘పంచబలి’ (వెరీ పవర్‌ఫుల్, ఎక్స్‌పెన్సివ్) చేయించాడు ఫ్రీగా… చికిత్సకు మాటసాయం కూడా చేశాడు… ఆమెకు భరోసాగా ఉన్నాడు తప్ప తనకు ఇంకేం పాపం లేదు… ఆమె సోదరికి కూడా ఆరోగ్యం బాగుండదు, ఆమెకూ సాయంగా ఉన్నాడు… మరి ఈ ప్రవీణ ఎవరు..?

ఇదీ ఇంట్రస్టింగు… ఈటీవీలో ప్రోగ్రామ్స్ అంటేనే మల్లెమాల కదా… వాళ్లకు దీటుగా, కాదు, అంతకుమించి… జ్ఞాపిక ఎంటర్‌టెయిన్‌మెంట్స్… ఆమె ఆ వ్యవహారాలు చూస్తుంది… ఎప్పుడైనా మంచి పాత్ర దొరికితే ఒకటీ అరా సినిమాల్లో నటిస్తుంది, కానీ రెగ్యులర్ నటి కాదు… భర్త అనిల్ టీవీ నిర్మాత ప్లస్ టీవీ ఈవెంట్ల నిర్వహణలో పాపులర్… క్యాష్, ఫ్యామిలీ స్టార్, పాడుతా తీయగా వంటి ప్రోగ్రాములన్నీ వాళ్లవే…

ఆషురెడ్డి అనారోగ్యం, ఆమె ప్రేమకథ అన్నీ ఆమెకు తెలుసు… సానుభూతితో  వ్యవహరించింది… సర్జరీ అయిపోయాక ఆర్థిక భరోసా ఉంటుందని ఓ ఫ్లాట్ కొనిపించింది… అదుగో దానికి ఇచ్చిన సొమ్మే ఈ కోటిన్నర… వాడేమో ఈమెను సినిమాల్లో చేయనివ్వడు.., డబ్బుల్లేవు, అనారోగ్యం… ఇంట్లో తల్లీదండ్రుల మధ్య గొడవలు… ఐనా నిలబడింది…



చివరకు వర్మ గాడు చేసిన వెగటు వీడియో కూడా తన జీవితానికి పెద్ద సమస్య అయిపోయిందని బాధపడింది ఆమె… సదరు ధర్మేంద్ర దగ్గరకు వద్దాం… తను సాఫ్ట్ వేర్ ఏమీ కాదు… జాబ్ లేదు… తన బావ దగ్గర పనిచేస్తాడు… డ్రగిస్ట్… పైలట్ రోహిత్ రెడ్డికి కూడా 50 లక్షలు ఇచ్చాడట… హవాలా వంటి ఆరోపణలూ ఉన్నాయట..

తనకు గతంలోనే విడాకులు, సైకో… అన్ని కథలూ ఉన్నాయి… ఎప్పుడైతే ఈమె సదరు ధర్మేంద్ర అనేవాడు తనకు జీవితంలో ఏరకంగానూ భరోసా కాదు, భాగస్వామిగానూ సూట్ కాడు అని తీర్మానించుకుని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది… దాంతో వాడు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశాడు… ఓసారి ఏదో రూట్ వెతికి ఏకంగా సీఎం ఆఫీసు దాకా వెళ్లాడు, వీడి గురించి తెలిసి వాళ్లు తిట్టి వెళ్లగొట్టారట… (తోట త్రిమూర్తులకు మనమడు అట..)



ఈ స్థితిలో ప్రవీణ దగ్గర ఓ సెటిల్మెంట్… తనకు ఇచ్చిన కోటిన్నర ప్లస్ కిలో బంగారం ఇవ్వడానికి ఒప్పుకుంది ఆమె… అదీ గ్రేట్… కాకపోతే ఆమె తీసుకున్నప్పుడు బంగారం ధర వేరు, ఇప్పుడు వేరు, అందుకనే నేను నాలుగు డబ్బులు సంపాదించాక ఇస్తాను, కోటిన్నర మాత్రం వచ్చే నెలలో ఇచ్చేస్తాను అని చెప్పింది… నిన్నటి ఆడియోలో ఉన్నదీ అదే…

అసలు వాడికే డబ్బుల్లేవు… ఆర్థికంగా దివాలా ఇప్పుడు… ఇక బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశాడు… ఆషు అక్క అమెరికాలో ఉంటే ఆమెనూ లాగుతున్నాడు… దీంతో ఆషురెడ్డి ఎహెపోరా అనేసింది… తెగించింది… నిజంగా హైదరాబాద్ పోలీసులు గనుక నిజాయితీగా తవ్వితే సైకో, కాల్‌మనీ వ్యవహారాలు కూడా బయటపడతాయని చెబుతున్నారు… ఇదండీ కథ… హైదరాబాద్ పోలీసుల కోసమే…



దాదాపు 33 ప్రముఖ మీడియాల పేర్లు ప్రస్తావించి మరీ... ఇంకెవరూ తన పరువు తీసే కథనాలు రాయకుండా, ప్రసారం చేయకుండా హైకోర్టు నుంచి గాగ్ ఆర్డర్ తెచ్చుకుంది ఆమె తాజాగా... నువ్వు సూపర్ ఆషూ...!!



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓహ్… ఆషురెడ్డి కథ- వ్యథ ఇదా..? లండన్ సాఫ్ట్‌వేరుడే అసలు దోషి..!!
  • హన్మంతన్నా… అంతా నిమ్మళమేనా… మంచి గుర్తింపు ఇచ్చిండు సీఎం…
  • ఒకరు ఐపీఎస్… మరొకరు ఐఐటీ… కొత్త డీజీపీ కుటుంబ నేపథ్యం…
  • హహహ…! బిడ్డింటికి దారేది..? స్పూఫ్… నవ్వు ఆపుకుంటున్నవ్ కదరా..!!
  • గెలిచిన గుజరాత్ పైకి ఎక్కలేదు… ఓడిన బెంగుళూరు దిగిపోలేదు…
  • హిమాలయాల నిశ్శబ్దంలో ఓ అద్భుతం… అలీనా వెట్రోవా ‘పునర్జన్మ’ కథ…!
  • కోర్టు వర్చువల్ విచారణ సందర్భంగా అశ్లీల వీడియోల ప్రదర్శన
  • టీఆర్ఎస్… పార్టీ పేరు, అనుమతి… బభ్రాజమానం- భజగోవిందం…
  • చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
  • ‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions