.
మలయాళ సూపర్‌స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్… వృత్తిపరమైన పోటీ ఎంత ఉన్నా సరే… కలిసి నటించిన సినిమాలు బోలెడు… ఫ్యాన్స్ మధ్య అనవసర వైరాలకు చాన్స్ ఇవ్వరు… ఒకరినొకరు గౌరవించుకుంటారు… మితృత్వం కనిపిస్తుంది… అంతేకాదు, భిన్న పాత్రల్ని ఇష్టపడి, వీలైనంతగా పర్‌ఫామ్ చేస్తారు… ఇండియన్ సినిమాలో పెద్ద పెద్ద తోపులు, ప్రత్యేకించి సౌత్ అగ్రనటులు కేవలం డబ్బు కక్కుర్తితో ఇంకా ఇంకా పిచ్చిపిచ్చి కమర్షియల్ పాత్రల్ని చేస్తుంటే, ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మాత్రం తమలోని నిజమైన నటుల్ని ఆవిష్కరించడానికి, భిన్నమైన ఉద్వేగాల్ని ప్రదర్శించడానికి తపనపడతారు…
మరి ఈ ఇద్దరూ 18 ఏళ్ల తరువాత కలిసి నటిస్తే… అందులో ఫహాద్ ఫాజిల్, నయనతార, రేవతి కూడా ఉంటే…? సినిమా కథ, ట్రీట్‌మెంట్ ఎలా ఉండాలి..? ఓ రేంజులో ఉండాలని సినిమా ప్రేమికులు ఆశిస్తారు… ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆశిస్తారు… కానీ దర్శకుడు దీన్ని ఏదో అల్లాటప్పా సాధారణ సినిమాలాగా చుట్టిపారేశాడు… కానీ ఇద్దరు అగ్రనటులను అనుకున్నట్టుగా తెరమీద ఆవిష్కరించలేకపోయాడు…
Ads
వరల్డ్ వసూళ్లు 60 కోట్లు, అదీ ఇదీ అని ఊదరగొడుతున్నారు… వాళ్ల ఇద్దరి ఇమేజ్‌తో సహజంగానే కొంత వసూళ్లలో జోష్ కనిపించవచ్చుగాక… కానీ సినిమా మాత్రం అంత థ్రిల్లింగుగా ఏమీ లేదు… మిక్స్‌డ్ టాక్ వస్తోంది… ప్రత్యేకించి మమ్ముట్టి ఇందులో హీరో పాత్ర… మోహన్‌లాల్‌ది కాస్త పొడిగించబడిన అతిథి పాత్ర… అక్కడ దెబ్బతిన్నది సినిమా… ఈ సినిమా ‘గ్రేట్ కంటెంట్’ కంటే ‘గ్రేట్ కాంబినేషన్’ మీదనే ఎక్కువగా ఆధారపడింది…
ఆ ఇద్దరి నటుల నడుమ సమస్థాయిలో ఘర్షణ ఉండి ఉంటే.., రొటీన్ కమర్షియల్- యాక్షన్ సీన్స్ గాకుండా భిన్నమైన ట్రీట్‌మెంట్ గనుక ఉండి ఉంటే ఈ సినిమా ఓ రేంజులో ఉండేది… మమ్ముట్టి ఫుల్ లెంగ్త్ రోల్, మోహన్‌లాల్ అతిథి పాత్ర కావడం వల్ల ఆ ఇద్దరి మధ్య ఉండాల్సిన ‘స్క్రీన్ ప్రెజెన్స్ కాన్ఫ్లిక్ట్’ (Screen Presence Conflict) మిస్ అయ్యింది… డైలాగుల్లో కూడా పంచ్ లేదు…
కథేమిటంటే..? కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగి డేనియల్ జేమ్స్ (మమ్ముట్టి), దేశంలో జరుగుతున్న డిజిటల్ నిఘా (Digital Mass Surveillance) కు సంబంధించిన ఒక అక్రమ వ్యవస్థను కనిపెడతాడు… దీని వెనుక కేంద్ర మంత్రి జె.పి. సుందరం (రాజీవ్ మీనన్), ఆయన కుమారుడు శక్తి (ఫహాద్ ఫాజిల్) ఉంటారు… నిజం వెలికితీసే క్రమంలో డేనియల్ ఎదుర్కొన్న సవాళ్లే ఈ సినిమా కథ…
మహేష్ నారాయణన్ డిజిటల్ నిఘా, వ్యక్తిగత గోప్యత వంటి సంక్లిష్టమైన అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా తెరకెక్కించడానికి ప్రయత్నించాడు గానీ పూర్తిగా సక్సెస్ కాలేదు… రేవతి, నయనతారలు ఉన్నారంటే ఉన్నారు… కథ ప్రిడక్టబులిటీ కూడా సినిమా మిక్స్‌డ్ టాక్‌కు మరో కారణం…

సినిమాలో హైలైట్ మాత్రం మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి చేసిన ఒక భారీ కారు చేజ్ సీక్వెన్స్… సీన్ ఎలా ఉంటుందంటే… ఈ సన్నివేశంలో కారును యంగ్ హీరో కుంచాకో బోబన్ డ్రైవ్ చేస్తుండగా… కారు పైభాగంలో ఉండి మోహన్ లాల్ గన్‌తో షూట్ చేస్తుంటాడు… అదే సమయంలో కారు లోపల ఉండి మమ్ముట్టి తన వైపు నుండి శత్రువులపై ఎదురుదాడి చేస్తుంటాడు… ఈ సీన్ కోసం మాత్రం హాలీవుడ్ స్థాయి మేకింగ్ స్టాండర్డ్స్ వాడారు…!!
Share this Article