.
ఎన్నికలు, విపత్తులు, ప్రమాదాలు, వైపరీత్యాలకు సంబంధించి… చాలామంది జ్యోతిష్కులు తాము ముందే చెప్పామని క్లెయిమ్ చేసుకుంటుంటారు… జ్యోతిష్కులకు స్ట్రయిక్ రేట్ ప్రధానం… తాము ఏ తేదీల్లో ఏం జోస్యం చెప్పామో, అదెలా నిజమైందో చెప్పుకుంటుంటారు… కొందరు పాత వీడియోలు, ట్వీట్లను కూడా ఉదహరిస్తారు…
బెంగాల్ ఎన్నికల ఫలితం గురించి ప్రముఖ జ్యోతిష్కురాలు శర్మిష్ఠ 2024లోనే చెప్పింది… ఆ ట్వీట్ కూడా పదిలంగానే ఉంది… బెంగాల్‌లో ఎస్ఐఆర్ (SIR), కేంద్ర బలగాలు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు ఎవరూ లేనప్పుడే బెంగాల్ భవిష్యవాణి చెప్పింది ఆమె…
Ads
ఏ పరిస్థితిలోనూ మమత మళ్లీ గెలిచే సవాలే లేదని 2024 ఆగస్టులో చెప్పింది… ‘ఇది చాలామంది నమ్మలేదు అప్పట్లో… కొందరు ముస్లింలు నన్ను తిట్టిపోశారు…’ అంటూ తాజాగా ఓ ట్వీట్ పెట్టింది… ఇలా…

… ఇంతకీ ఎవరు ఈ ఆస్ట్రో శర్మిష్ట… ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబై (జుహు ప్రాంతం) కేంద్రంగా పనిచేస్తుంది…
-
నేపథ్యం…: ఆమె వృత్తిరీత్యా ఏరోనాటికల్ ఇంజనీర్ (Aeronautical Engineer)… అయితే జ్యోతిష్యంపై ఉన్న ఆసక్తితో ముంబైలోని ‘భారతీయ విద్యా భవన్’లో జ్యోతిర్విద్ పూర్తి చేసి పూర్తిస్థాయి జ్యోతిష్కురాలిగా మారింది…
-
ప్రజాదరణ…: ఆమె జాతీయ స్థాయి వార్తా ఛానెళ్లలో (ముఖ్యంగా హిందీ మీడియా) తరచుగా కనిపిస్తుంది… రాజకీయ నాయకులు, బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆమె కన్సల్టేషన్లు ఇస్తుంటుంది.,. మన తెలుగు వేణుస్వామిలాగా సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్టు…
-
నివాసం…: ఆమెకు ముంబైలో ఆఫీసు ఉంది, అక్కడి నుండే తన సామాజిక మాధ్యమాలు మరియు వెబ్‌సైట్ ద్వారా సేవలు అందిస్తుంది…
ఆమె గతంలో షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులు, కొన్ని అంతర్జాతీయ పరిణామాల గురించి చేసిన అంచనాలు నిజమవ్వడంతో ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది… ముఖ్యంగా హిందీ డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆమె అంచనాలకు మంచి క్రేజ్ ఉంది…
ఖచ్చితత్వం…: జ్యోతిష్య అంచనాలు రాజకీయాల్లో ఎప్పుడూ 100% ఖచ్చితంగా ఉండవు… ఆమె ఒక “బోల్డ్ ప్రిడిక్టర్” గా గుర్తింపు పొందింది…
2027 ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక మలుపు అని, యుద్ధ వాతావరణం నెలకొంటుందని కూడా ఆమె పేర్కొంది… ఇరాన్- అమెరికా- ఇజ్రాయిల్ యుద్దం అనుకోవాలేమో… ఆమె తన అంచనాలను కేవలం జ్యోతిష్యంగా కాకుండా జియో-పొలిటికల్ ఆస్ట్రాలజీ (భౌగోళిక రాజకీయ జ్యోతిష్యం)గా పేర్కొంటూ ఉంటుంది…
ఈమె చెప్పిన వాటిల్లో కొన్ని నిజమయ్యాయి… ఉదాహరణకు… 1) బీహార్ లో నితీష్ మళ్ళీ గెలుస్తారు, కానీ కొన్నాళ్లకు బీజేపీ సీఎం వస్తాడు…
2) బెంగాల్ లో బీజేపీ ఘన విజయం సాధిస్తుంది…
3) 2025, 2026 లో వైమానిక ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి…
అసలు కథ ముందుంది… ఆమె ప్రిడిక్షన్లలో మరో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి…
1) అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ట్రంప్ చివరి అధ్యక్షుడు…. అమెరికా 2027 చివరికి చీలిపోయి, ఒకటీ రెండు రాష్ట్రాలు వేరు కుంపటి పెట్టుకుంటాయి…
2) పాకిస్థాన్ 4 భాగాలుగా చీలిపోతుంది… POK 2027 చివరికల్లా భారత్ వశం అవుతుంది… శుభం…
Share this Article