.
చార్మినార్… హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న చారిత్రిక కట్టడం… దాని దిగువన భాగ్యలక్ష్మి గుడి… భక్తులు వస్తుంటారు, పోతుంటారు, ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి… రెండు మతాల ప్రజలు సంయమనం పాటిస్తారు… సరే, ఓసారి తమిళనాడు వెళ్దాం… తిరుప్పరంకుండ్రం కార్తీకదీపం కథ మనం నిన్న చెప్పుకున్నాం కదా…
సాక్షాత్తూ హైకోర్టు అక్కడ హిందూ భక్తులు కార్తీకదీపం వెలిగించుకోవచ్చునని చెప్పినా సరే… అధికార యంత్రంగం వినలేదు, కారణం, అరివీర భీకర హిందూ వ్యతిరేకి స్టాలిన్ వల్ల… చివరకు ఆ తీర్పు చెప్పిన జడ్జినే అభిశంసన ద్వారా తొలగించాలని ప్రయత్నించాడు… దానికి ఇండికూటమి సమర్థన… పక్కా హిందూ వ్యతిరేక కూటమి… చివరకు స్టాలిన్ గతి..? శబరిమలపై విషాన్ని కక్కిన, రుతుమహిళల్ని ప్రవేశపెట్టిన పక్కా హిందూ వ్యతిరేకి పినరై విజయన్ గతి ఏమైంది..? ధ్వజస్థంభం బంగారం కాజేసిన ఫలితం ఏమైంది..?
Ads
సరే, బెంగాల్‌లో ఇలాంటిదే ఓ కేసు చెప్పుకుందాం… దుర్గామాత ఆలయం… అసలు బెంగాల్ ఆధ్యాత్మిక కల్చర్ అంటేనే శక్తి పూజ… కలకత్తా కాళి కావచ్చు, దుర్గ కావచ్చు… పశ్చిమ బర్ధమాన్ (West Bardhaman) జిల్లాలో ఉన్న ఆసన్సోల్ (Asansol) నగరంలో ఉంది… ఆసన్సోల్‌లోని బస్తీ బజార్ (కొన్ని చోట్ల బస్తిన్ బజార్ అని కూడా పిలుస్తారు) ప్రాంతంలో ఈ ఆలయం ఉంది…
మమత బెనర్జీ పాలన రాగానే… ఆమెది పక్కా ముస్లిం సంతుష్టీకరణ పాలసీలే కదా… పక్కా హిందూ వ్యతిరేకి… ఈ గుడి మీద ఆ ప్రాంతంలో బలంగా ఉన్న ముస్లింలు కంప్లయింట్స్ చేయగానే మమత గుడిని మూసేయించింది… ఉత్సవాల సమయంలో ఉద్రిక్తతలు ప్రబలుతాయనే సాకు చూపించింది… గుడి చుట్టూ కంచెలు వేశారు, భక్తులకు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు… విగ్రహాన్ని బయటకు కనిపించకుండా ముసుగు…
ఈ వివాదం కోర్టుకు వెళ్ళినప్పుడు, హిందూ సమాజానికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి… ఆలయంలో పూజలు నిర్వహించుకునే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక పోలీసులు దానిని అమలు చేయడంలో “శాంతి భద్రతల సమస్య” (Law and Order issues) నెపాన్ని చూపారు… (సేమ్, తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం)… కోర్టు చెప్పినా మమత వినలేదు, వినదు, ఆమె నెత్తురే హిందూవ్యతిరేకం…
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతం (Asansol North) నుండి బిజెపి అభ్యర్థి కృష్ణేందు ముఖర్జీ విజయం సాధించాడు.., తన ప్రధాన ఎన్నికల హామీ ఈ ఆలయాన్ని తెరిపిస్తామని..! ఫలితాలు వెలువడగానే భక్తులు దశాబ్దాలుగా మూసిన ఆ కంచెలను పడగొట్టేశారు, ముసుగు తీశారు విగ్రహానికి… పూజలు ప్రారంభించారు… జై శ్రీరామ్”, “జై దుర్గా” నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది…
ఒక స్టాలిన్, ఒక పినరై విజయన్, ఒక మమత బెనర్జీ… ముగ్గురూ ఒకరిని మించి మరొకరు హిందూ ద్వేషులు… ముగ్గురూ మట్టిగరిచారు… కాకపోతే కాస్త ఆలస్యంగా..! ఒక్కసారి ఆలోచిద్దాం… కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో గుళ్లను కూలుస్తున్నారు, హిందువులను నిలువునా కాల్చేస్తున్నారు… అవును, బెంగాల్‌లో కూడా అదే దుర్గతి కదా ఇన్నాళ్లుగా… ఇదంతా రియాలిటీ… రాహుల్, ఖర్గే… ఓసారి పునరాలోచించుకోవాలి…!!
Share this Article