.
“కేడీ: ది డెవిల్” – వివాదాల హైప్ తప్ప… నిజంగా డెవిలిష్ మ్యాజిక్ ఉందా?! … కన్నడ స్టార్ ధృవ సర్జా నటించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా KD: The Devil రిలీజ్‌కు ముందే ఎంత హడావుడి చేసిందో తెలిసిందే… ముఖ్యంగా నోరా ఫతేహి, సంజయ్ దత్ కనిపించిన “Sarke Chunar” పాట దేశవ్యాప్తంగా వివాదానికి దారి తీసింది… మహిళా కమిషన్ ఎదుట సినిమా టీమ్ క్షమాపణలు, లెంపలేసుకోవడాలు ఎట్సెట్రా కూడా… ఆ హైప్‌తో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుడికి సినిమా నిజంగా ఏం ఇచ్చింది అన్నదే ఇప్పుడు ప్రశ్న…
దర్శకుడు ప్రేమ్ స్టైలిష్ మాస్ యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నాడు… కానీ కథనం మాత్రం పాతగా, పలుచగా… నాట్ ఇంప్రెసివ్… భారీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, రక్తపాతం, స్లోమోషన్ ఎంట్రీలు, అరుపులు… ఇవే ఎక్కువగా కనిపిస్తాయి… కథలో కొత్తదనం లేదా భావోద్వేగ బలం తక్కువగా ఉంది… అంటే కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ అన్నమాట…
Ads
కథానాయిక రేష్మాకు పెద్ద స్క్రీన్ స్పేస్ దొరకలేదు… అంతా ధృవ చుట్టే తిరుగుతంది కథ… సినిమాలో ప్రధాన ఆకర్షణల్లో ఒకటి బాలీవుడ్ నటులు Sanjay Dutt, Shilpa Shetty… Sanjay Dutt ఈ సినిమాలో పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్/డాన్ తరహా పాత్రలో కనిపిస్తాడు… అతని స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, భారీ లుక్ సినిమాకు కొంత వెయిట్ తీసుకొచ్చాయి… ముఖ్యంగా పాతకాలపు (1970) అండర్‌వరల్డ్ ఫీల్ ఇవ్వడంలో అతని పాత్ర ఉపయోగపడింది… కానీ పాత్రను ఇంకా బలంగా రాసి ఉంటే ప్రభావం ఎక్కువగా ఉండేది…
ఇక Shilpa Shetty పాత్రకు సినిమాలో గ్లామర్, క్లాస్ టచ్ ఇచ్చేలా ప్రెజెంట్ చేశారు… చాలా కాలం తర్వాత ఆమెను ఇలాంటి మాస్ కమర్షియల్ సెటప్‌లో చూడటం కొత్తగా అనిపించింది… అయితే ఆమె పాత్ర కూడా కథలో పెద్దగా మార్పు తీసుకురాలేదు… కాకపోతే 1970 కాలాన్ని బాగానే ప్రజెంట్ చేశాడు దర్శకుడు…
1970ల బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో ధృవ సర్జా “కేడీ” అనే రౌడీ/గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తాడు. చిన్న స్థాయి గ్యాంగ్ వార్‌ల నుంచి మొదలైన అతని ప్రయాణం… తర్వాత అండర్‌వరల్డ్, రాజకీయాలు, ప్రతీకారం, ద్రోహాల చుట్టూ తిరుగుతుంది… తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోణం కూడా కథలో కలిపారు…
సినిమా మొత్తం హీరో ఎలివేషన్ సీన్లు, భారీ ఫైట్లు, మాస్ డైలాగులు, రక్తపాతం చుట్టూనే ఎక్కువగా నడుస్తుంది… మధ్య మధ్యలో ప్రేమకథ, ఎమోషనల్ ఫ్యామిలీ ట్రాక్ కూడా పెట్టినా… అవి అంతగా ప్రభావం చూపలేదు…
కథలో కొత్తదనం తక్కువగా ఉండటమే కాదు.., KGF, కబ్జా, సలార్ తరహా మాస్ గ్యాంగ్‌స్టర్ సినిమాల మిక్స్‌లా అనిపిస్తుంది… హీరోని “డెవిల్”లా చూపించే ప్రయత్నం ఎక్కువై… కథ, పాత్రల లోతు మాత్రం వెనకబడిపోయింది…
అయితే పూర్తిగా తీసిపారేయలేని అంశం ఏమిటంటే… ధృవ సర్జా స్క్రీన్ ప్రెజెన్స్… (అర్జున్ మేనల్లుడు)… మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా అతను ఎనర్జీతో కనిపించాడు… ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్‌కు సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు మొదట్లో… కానీ “ఓవర్ ది టాప్”, “లౌడ్”, “అతి నాటకీయత” …
ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు పాట వివాదాన్ని తప్పించలేం… “Sarke Chunar Teri Sarke” అనే హిందీ వెర్షన్ విడుదలైన వెంటనే దాని లిరిక్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి… సోషల్ మీడియాలో చాలామంది దాన్ని “వల్గర్”, “సజెస్టివ్” అంటూ విమర్శించారు… చివరకు పాటను యూట్యూబ్ నుంచి తొలగించాల్సి వచ్చింది… అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ పాటపై ఆంక్షలు విధించింది…
వివాదం అంత పెద్దది కావడంతో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ జోక్యం చేసుకుని దర్శకుడు ప్రేమ్, నిర్మాతల నుంచి వివరణ తీసుకుంది… తర్వాత టీమ్ క్షమాపణలు చెబుతూ… లిరిక్స్ మార్చుతామని ప్రకటించింది… ఏవేవో మార్పులు చేసేసరికి అది ఎటో ఎటో వెళ్లిపోయి, ఎటూ గాకుండా తయారైంది పాపం…
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ వివాదం తర్వాతే సినిమాపై దేశవ్యాప్తంగా మరింత దృష్టి పడింది… కొందరు ఇది “పబ్లిసిటీ స్టంట్” అని అనుకోగా, మరికొందరు మాత్రం “సినిమా కంటే పాటే ఎక్కువ చర్చకు వచ్చింది” అంటున్నారు… Reddit వంటి వేదికల్లో కూడా “హైప్ మొత్తం పాట వల్లే వచ్చింది” అనే కామెంట్లు కనిపించాయి…
మొత్తానికి KD: The Devil ఒక పక్క కొందరు మాస్ యాక్షన్ అభిమానులకు థియేటర్ ఫీల్ ఇవ్వొచ్చునేమో… కానీ బలమైన కథ, కొత్తదనం, భావోద్వేగం ఆశించే ప్రేక్షకుడికి మాత్రం ఇది మరో సాదాసీదా సాధారణ గ్యాంగ్‌స్టర్ డ్రామాలానే అనిపిస్తుంది… హింస, నెత్తుటి ధారలు సినిమాను నిలబెట్టలేవోయ్ హీరో…!!
Share this Article