Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రంకు మొగుడు అంటే మాస్ ముతక… రంజు మొగుడు అంటే పాలిష్డ్…

May 19, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. ప్రియా ప్రియతమా రాగాలు – సఖీ కుశలమా అందాలు . కిల్లర్ సినిమా అనగానే గుర్తొచ్చే most melodious iconic song ఇది . ఈ పాట ఒక్కటే కాదు . మిగిలిన అయిదు పాటలు కూడా హిట్ సాంగ్సే . ఇళయరాజా మేజిక్ మ్యూజిక్కులో వేటూరి వారి పాటలకు బాలసుబ్రమణ్యం , జానకమ్మ , చిత్ర , మనో , యల్ వి కృష్ణ మధుర గాత్రంలో పాటలన్నీ మధురంగానే ఉంటాయి .

ప్రముఖ మళయాళ దర్శకుడు ఫాజల్ దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు సినిమా ఈ కిల్లర్ . మోహన్ లాల్ని మనసులో పెట్టుకుని ఈ కధను తయారు చేసుకున్నారట ఆయన . మోహన్ లాల్ కాదనటంతో వి బి రాజేంద్రప్రసాద్ గారి చేతిలో పడి నాగార్జునకు హిట్ దక్కింది .

Ads

చాలా చిక్కటి కధ , బిర్రయిన స్క్రీన్ ప్లే . అందుకు తగ్గట్లు జంధ్యాల డైలాగ్స్ . చాలా పదునుగా ఉంటాయి . ఈ సినిమా కధ కూడా టూకీగా కూడా చెప్పవలసిన అవసరం లేదు . సినీ ప్రియులకు బాగా గుర్తున్న కధే . తరచూ ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . నటనపరంగా నాగార్జునకు మంచి అవకాశం వచ్చింది . సద్వినియోగం చేసుకున్నాడు కూడా .

అతని తర్వాత చెప్పుకోవలసింది శారద , విజయకుమార్ల పాత్రలు . ఇద్దరూ తల పండిన వారే . అద్భుతంగా నటించారు . ఇంక నగ్మా . గ్లామర్ డాల్ గా రొమాంటిగ్గా అందంగా నటించింది . బేబీ షాలిని బాగా నటించింది . లాడ్జి ఓనరుగా రమాప్రభ వయ్యారాలు ప్రేక్షకులను అలరిస్తాయి .

ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణమ్మ , జ్యోతి , బ్రహ్మానందం , రమాప్రభ , సుత్తి వేలు , బెనర్జీ , తులసి , నిర్మలమ్మ , అల్లు రామలింగయ్య , గిరిబాబు , నారాయణరావు , ఆహుతి ప్రసాద్ , నార్సింగ్  తదితరులు నటించారు .

ఈ సినిమా విజయానికి ఇళయరాజా సంగీతం చాలా దోహదపడింది . బేక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంటుంది . రంభలకే రంజు మొగుడ్ని . అసలా వేటూరి వారికి ఈ పదద్వయం ఎలా తట్టాయో ! రంకు మొగుడు సాధారణంగా ముతకోళ్ళు ఉపయోగించే పదం . బహుశా ఆ ముతక మాట ఉపయోగించటం ఇష్టం లేక రంజు మొగుడ్ని ఉపయోగించారేమో ! నాగార్జున , లాడ్జిలో డ్రామా ట్రూప్ కలిసి పాడే అల్లరి పాట ఇది .

ఇంక డ్యూయెట్లు . పిలిచే కుహూ కుహూ వయసే పలికే తహ తహ మనసే , ఓరబ్బి ఏందబ్బ కందిపోయే అందమంతా వయ్యారి ఒళ్ళు కాస్త తుళ్ళిపడ్డ కౌగిలింత అంటూ సాగే రెండు డ్యూయెట్లు చాలా రొమాంటిగ్గా ఉంటాయి . పిక్నిక్కులో పాడే ఉక్కిరిబిక్కిరి చక్కిలిగింత కిల్లర్ కూడా బాగుంటుంది . నాగార్జున పాడే విషాద గీతం సింధూరపు పూదోటలో ఓ చిన్నారి పాప ఏ పాపమో ఆ తోటలో వేసింది పాగ బాగుంటుంది .

నాగార్జున , నగ్మాల డ్యూయెట్లకు సుందరం మాస్టారు డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు . ఓరబ్బీ ఏందబ్బ పాటను రాజు కంపోజ్ చేసారు . ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్ బేనరుపై నిర్మితమయింది ఈ సినిమా . సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉన్నా చూడతగ్గ ఎంటర్టయినరే .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రంకు మొగుడు అంటే మాస్ ముతక… రంజు మొగుడు అంటే పాలిష్డ్…
  • ఇడ్లీని చక్కెరపాకంలో ముంచితే రసగుల్లా అట…! ఎవడా ఇడ్లీ ద్రోహి..?!
  • ఈ కేసులో అమ్మాయి మేజర్ కాబట్టి సరిపోయింది..!!
  • కన్నీటి అబద్ధాలకంటే… కాలర్‌ ఎగరేసే నిజాలే ఎప్పుడూ గొప్పవి!
  • సొంత ప్రధానినే ఆక్షేపిస్తే… సోయిలేని ‘పత్తాలాట మాటలు’ అంటారు..!!
  • బెంగాల్‌లో ఏం జరుగుతోంది..? మాయ రోగాలకు ‘కాయకల్ప చికిత్స’..!!
  • రక్తికట్టిన ఐపీఎల్… నాలుగో బెర్త్ కోసం ఐదు జట్ల సమరం…
  • నాటి స్టార్ హీరోయిన్ మాలశ్రీ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తున్నదంటే…?
  • అమెరికాలో అదానీ కేసు వింత ‘సెటిల్మెంట్’ కథ ఇదీ…
  • అధికారమే పరమావధి… ఓ జర్నలిస్టుకు అనుభవంతో తత్వబోధ

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions