Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏ ఉగాండాలోనో, ఏ బర్మాలోనో… ఒక్క నిష్పాక్షిక వార్త రాయండి చూద్దాం…

May 22, 2026 by M S R

.
Bp Padala ….. భారతీయ ప్రజాస్వామ్యానికి మద్దతుగా! ……… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వేలో జరిపిన అత్యంత విజయవంతమైన పర్యటనలో ఒక చిన్న సంఘటన అది. ఒక నార్వేజియన్ జర్నలిస్ట్, ప్రధానమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి, అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. భారతీయ ప్రజాస్వామ్యం అధ్వాన్న స్థితిలో ఉందని ఆమె పేర్కొంటున్నది…

బహుశా మనం కాసేపు ఆగి ఆలోచించుకోవాలేమో? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పట్ల కాస్త ఉత్సుకత (కుతూహలం) చూపించాల్సిన, సరైన విశ్లేషణ చేసుకోవల్సిస సమయం వచ్చిందేమో?

రెండు వారాల క్రితం భారతదేశంలోని ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికలు జరిగాయి. హోరాహోరీ పోరు జరిగిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓటింగ్ శాతం 94% గా నమోదైంది. నార్వేలో జరిగిన గత స్థానిక ఎన్నికల్లో ఇది 62% మాత్రమే, అనేక యూరోపియన్ స్థానిక ఎన్నికలలో ఓటింగ్ శాతం 50% కంటే తక్కువగా ఉంటుంది. ఇంత భారీ సంఖ్యలో ఓట్లు వేయడం అనేది భారతీయులు తమ ప్రజాస్వామ్య ప్రక్రియను నమ్ముతున్నారనేదానికి సంకేతం కాదా?

Ads

అదే ఎన్నికల్లో బీజేపీ అసోం, పశ్చిమ బెంగాల్‌లలో పెద్ద విజయాన్ని సాధించింది. కానీ కేరళ, తమిళనాడులలో అంతకంటే ఘోరంగా ఓడిపోయింది. ఈ వైవిధ్యం భారతీయ ప్రజాస్వామ్యం ప్రజల అభీష్ట వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోందనడానికి సంకేతం కాదా?

ప్రపంచంలో భారతదేశాన్ని 157వ స్థానంలో ఉంచిన ఒక అప్రజాస్వామ్య, అతి చెత్త ర్యాంకింగ్‌ను ఆ జర్నలిస్ట్ ప్రస్తావించింది, ఇది అనేక నియంతృత్వ దేశాలు, తీవ్రమైన సమస్యల్లో ఉన్న దేశాల కంటే కూడా వెనుకబడి ఉంది. ఒక ర్యాంకింగ్ సామాన్య జ్ఞానానికి (common sense) ఇంత స్పష్టంగా విరుద్ధంగా ఉన్నప్పుడు, ఆ ర్యాంకింగ్‌ను రూపొందించే వారిని విమర్శనాత్మక ప్రశ్నలు అడగాలి గానీ, ఇలాంటి అర్ధం లేని విషయాలపై నాయకులు వ్యాఖ్యానించాలని డిమాండ్ చేయడం ఎందుకు?

నేను సాల్వటోర్ బాబోనెస్ రాసిన “ధర్మ డెమోక్రసీ” (Dharma democracy) పుస్తకాన్ని సిఫార్సు చేస్తున్నాను. ఈ పుస్తకం ఆయా ర్యాంకింగ్‌ల లోపభూయిష్టమైన పద్ధతులను (methodology) నమ్మశక్యంగా బట్టబయలు చేసింది.

భారతదేశంలో జర్నలిస్టుగా ఉండటం చాలా ప్రమాదకరమని పేర్కొనే ఒక ర్యాంకింగ్‌ను కూడా ప్రస్తావించింది ఆ లేడీ కేరక్టర్…. కానీ వాస్తవం ఏమిటంటే, అమెరికాలో జర్నలిస్టుగా ఉండటం మరింత ప్రమాదకరం, ప్రపంచంలోని అత్యధిక ఇతర దేశాలలో ఇది ఇంకా చాలా ప్రమాదకరం.

మనం వాస్తవికంగా ఉందాం. భారతదేశం పరిపూర్ణమైనదేమీ కాదు. కచ్చితంగా అక్కడక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగుతుంటాయి. భారతదేశం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్ దేశాల మొత్తం జనాభాతో సమానమైన జనాభాను కలిగి ఉంది. కానీ భారతదేశం యూరప్ లేదా అమెరికా దేశాల కంటే చాలా ప్రశాంతంగా ఉంది. భారతదేశంలో ఉన్న జాతి, భాషా, మతపరమైన వైవిధ్యం, అనేక అభివృద్ధి సవాళ్లను పరిగణనలోకి తీసుకుంటే ఇది నిజంగా విశేషమైనది.

ప్రజాస్వామ్యం అనేది కేవలం కొన్ని చిన్న, ప్రశాంతమైన, ఒకే రకమైన సంస్కృతి కలిగిన పశ్చిమ యూరప్ దేశాలకు మాత్రమే సరిపోయే ప్రభుత్వ రూపం అని మనం భావించకపోతే, బహుశా మనం భారతీయ ప్రజాస్వామ్యాన్ని అభినందించాలేమో?

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య దేశంగా మారి, ఇప్పటికీ ప్రజాస్వామ్యంగానే కొనసాగుతున్న ఏకైక పెద్ద మాజీ బ్రిటిష్ వలస దేశం భారతదేశం మాత్రమే. బ్రిటీష్ వారే భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని నేర్పించారని కొన్నిసార్లు వాదిస్తుంటారు. అదే నిజమైతే మయన్మార్, పాకిస్తాన్ లేదా గల్ఫ్ రాజ్యాలు ఎందుకు ప్రజాస్వామ్య దేశాలు కాలేదు? వాస్తవం ఏమిటంటే, భారతీయ ప్రజాస్వామ్యం స్వదేశీయుల ఆలోచనల నుండి పుట్టింది (homegrown), అసాధారణమైన విజయాన్ని సాధించింది…. — – ఎరిక్ సోల్హైమ్, నార్వే గ్రీన్ పొలిటిషియన్, యాక్టివస్ట్, దౌత్యవేత్త…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సోషల్ కాక్రోచ్ వింగ్స్..! సొంత పార్టీలనే బలితీసుకుంటయ్… బహుపరాక్..!!
  • ఓ వారసంత నుంచి… ఆ గ్లోబల్ మార్కెట్ దాకా… మన మహిళలు..!!
  • ఏ ఉగాండాలోనో, ఏ బర్మాలోనో… ఒక్క నిష్పాక్షిక వార్త రాయండి చూద్దాం…
  • అగరుపొగలా, అత్తరులా… ఊహూఁ… ఆ శోభన తాంబూలంలోనే ఏదో వెలితి…
  • మండు వేసవి- మల్లె పూలు- తెల్ల చీరెలు… సినీ కవుల పరిమళాలు…
  • రాజీవ్ హత్యకు 35 ఏళ్లు… హత్య, దర్యాప్తు రెండూ సంచలనమే…
  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • దృశ్యం-3 … వెంకీ మామ లక్కీ… భలే తప్పించుకున్నాడు రీమేక్ నుంచి…
  • పురూలియా…! అదొక పెద్ద మిస్టరీ… జవాబుల్లేవు… ఆశించడమూ వేస్ట్..!!
  • పక్కా కాలక్షేపం పల్లీ బఠానీ… జంధ్యాల, ఈవీవీ, రేలంగి… సేమ్ సేమ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions