.
చాలామంది రాస్తున్నారు… బెంగాల్ ఫాల్తా నియోజకవర్గంలో బీజేపీకి లక్ష వోట్ల మెజారిటీ, టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు జస్ట్ 7 వేల వోట్లు అని… అతి తక్కువ కాలంలో ఒక రాజకీయ నాయకుడు ఇంత దారుణంగా పతనం అవ్వడం బహుశా ఇదే మొదటిసారి అనుకుంటాం! అహంకారంతో వీరవిహారం చేసిన ఒక నాయకుడికి, ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రజలు కలిసి నేర్పిన గుణపాఠంగా విశ్లేషిస్తున్నారు…
కానీ నాణేన్ని మరోవైపు నుంచి చూడాలి… జహంగీర్ ఖాన్ ఇన్నాళ్లూ ఎలా గెలిచాడు..? తన బాస్, మహారాజశ్రీ తాటకి గారి మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గారు ఎలా గెలుస్తూ వస్తున్నారు..? లోకల్ అధికారులు, పోలీసులను బెదిరించి, ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా వోట్లు వేయించారు గనుక… మొన్న చూశాం కదా, కమలం గుర్తు మీద ఏకంగా టేప్ అతికించాడు…
Ads
వాడికి అలవాటే… టీఎంసీ గుర్తు మీద సెంట్ పూయడం, బయటికి వచ్చిన వోటరు వేళ్ల వద్ద ఆ వాసన వస్తుందా చూడటం, లేకపోతే తన్నడం… అసలు ఇది ఫాల్తా ఎన్నిక యవ్వారమే కాదు.,. ఇన్నేళ్లూ తాటకి అనుచరగణం, అభ్యర్థిగణం, అంటే అనేక జహంగీర్ ఖాన్‌లు చేసింది అదే… ఎప్పుడైతే రాష్ట్రంలో తాటకి రాజ్యం కుప్పకూలి, బీజేపీ గెలిచిందో జహంగీర్ ఖాన్‌కు భయం పట్టుకుంది… ఎందుకంటే..?
లోకల్ పోలీసులు, అధికారులు తోక జాడించారు… మరోవైపు తుపాకీ ట్రిగ్గర్ మీద వేలు పెట్టి మరీ యూపీ అజయ్ పాల్ శర్మ కన్నేశాడు… దీంతో నేను ఈ ఎన్నిక నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించాడు, గాయబ్… వోటేయడానికి కూడా రాలేదు… ఈ ఒక్కడు చాలు కదా తాటకి పార్టీవాళ్లు ఎలాంటివాళ్లో చెప్పటానికి..!
నిజానికి అజయ్ పాల్ శర్మ రాగానే తెలుసుకున్నాడు… అత్యంత సమస్యాత్మకులు ఎవరు అని… ఫాల్తా వెళ్లాడు… స్ట్రెయిట్ హెచ్చరిక జారీ చేశాడు… ‘నాతో గోక్కోకు, ఇంటికొచ్చి ఏడవాల్సి ఉంటుంది’ అని… కానీ ఇన్నేళ్లుగా అనుభవించిన అధికారమదం, మళ్లీ గెలుస్తామనే భ్రమ కలిపి జహంగీర్ ఖాన్… ‘నువ్వు సింగం అయితే నేను పుష్ప… పుష్ప ఎప్పటికీ తలవంచడు’ అని కామెంట్లు చేశాడు… తనను ఇంటికొచ్చి మరీ బెదిరించిన పోలీసు తుపాకీని చూడలేదు కదా… ఎక్కడో మండింది… అదీ ఆ బలుపు వ్యాఖ్యలకు కారణం…
వాడు అంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం… అజయ్ పాల్ శర్మ నిఘా… పాత ఆటలు సాగవని అర్థమై జహంగీర్ తోకముడిచాడు… సో, ఆ 7 వేల తక్కువ వోట్లకు అదీ కారణం… ప్రజలు కూడా బీజేపీ ప్రభుత్వం రాగానే, పాత భయాలన్నీ విడిచి, వీడి మీద కోపాన్ని వోట్లుగా చూపించారు… అదీ బీజేపీ అభ్యర్థి ఘన విజయానికి కారణం…
ఇంకా వివరంగా చెప్పాలంటే… బెంగాల్‌లో ఓ కొత్త మార్పు కనిపిస్తోంది, భయం నీడన బతికిన జనం టీఎంసీల గుండాల పాత చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటున్నారు… నిజానికి బెంగాల్‌లో గుండారాజ్యం ప్రజలకు కొత్తేమీ కాదు… సీపీఎం వ్యవస్థీకృతంగా సాగించేది… మమత దాన్ని వేయి రెట్లు పెంచి, అచ్చంగా పిశాచరాజ్యం చేసింది…
ఎస్, జవహర్‌నగర్ డంపింగ్ యార్డుగా మార్చబడిన బెంగాల్‌ను చక్కదిద్దడానికి సువేందు అధికారికి ఈ అయిదేళ్లు సరిపోదు… తను ఆ పిశాచ శిబిరం నుంచి వచ్చినవాడే కాబట్టి ఎవడేమిటో తనకు తెలుసు.,. కానీ ఈ టెంపో మరింత పెరగకపోతే… టీఎంసీని మూలాల నుంచి దెబ్బతీయకపోతే… రాబోయే రోజుల్లో మమత ఊపిరి పీల్చుకోగలిగితే… బలాలు కూడగట్టుకోగలిగితే… మన బెంగాల్ మరో బంగ్లాదేశ్ కావడం ఖాయం..!!
Share this Article