Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పెద్ది..! ఇది మరో కోణం… డిఫరెంట్ రివ్యూ… దారితప్పిన దర్శకుడిపై…

June 5, 2026 by M S R

.

ఏమాటకామాట… పెద్ది సినిమా చూశాక, రాంచరణ్ తనను తాను కథకు అనుగుణంగా ఫిజికల్‌గా మోల్డ్ చేసుకుని, నటనపరంగా కూడా కాస్త ఇంప్రూవ్ అయి బెటర్ పర్‌ఫార్మర్ అనిపించుకున్నాడు… మార్కెట్‌లో పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబట్టి ఈ సినిమాకు ఢోకా లేదు, నిర్మాతలకు డబ్బులొస్తాయి, క్లైమాక్స్ గనుక కనెక్టయితే సూపర్ హిట్ అనుకున్నాం…

గంటకు 40 వేల టికెట్లు, భారీ రికార్డు స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు అంటూ పాజిటివ్ ప్రచారం జరుగుతూ ఉన్నా సరే… మరోవైపు అదే స్థాయిలో నెగెటివ్ సోషల్ మీడియా రియాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి… సరే, ఇప్పుడు నాణేనికి మరోవైపు సినిమా మీద విమర్శలూ చూద్దాం…

Ads

తీరా చూస్తే… ఏ క్లైమాక్స్ బలం అనుకున్నామో దానికి జనం ఆ క్లైమాక్స్ సెషన్‌కు అంతగా కనెక్ట్ కావడంలేదు… ఉప్పెన సినిమాలో హీరో పురుషాంగం బలి ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు, ఇందులో కాలిని బలి ఇచ్చాడు… రాబోయే జూనియర్ సినిమాలో ఇంకేం బలి ఇస్తాడో అనే మీమ్స్ పేలుతున్నాయి సోషల్ మీడియాలో…

ఒకటి మాత్రం నిజం… ఒంటి కాలితో పరుగుపందెంకు అర్హుడెలా అయ్యాడు..? ఆ కాలును బలి ఇవ్వడానికి సహేతుకంగా ఎస్టాబ్లిష్ చేసిందెక్కడ..? పాపం, రాంచరణ్ ఈ దర్శకుడిని గుడ్డిగా నమ్మి కష్టపడ్డాడా..? ఇదే కాదు…

పెద్ది డైరెక్టర్ అక్కడితో ఆపాడు, సంతోషించకుండా ఏమిటీ విమర్శలు అంటారా..? హీరో క్రికెట్ ఆడతాడు… వైభవ్ సూర్యవంశీ తాతలాగా ఆడుతుంటాడు, అసలు ఆ షాట్లు అపూర్వం, అద్భుతం,, మునుపెన్నడూ క్రికెట్ ప్రపంచమే చూడనివి, అవును మరి, పాన్ ఇండియా తెలుగు హీరో అంటే మజాకా… చివరకు సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్‌కు చేతకాని యాంగిల్స్… అది అయిపోయిందా..?
.
వెంటనే కుస్తీకి ఛేంజ్… కోడి రామ్మూర్తి నాయుడు బతికి ఉంటే మహా సంతోషించేవాడో, మహాశ్చర్యపోయేవాడో… కుస్తీ పోటీలు ఇలా ఉంటాయా అని… ఇలా ఉండాలా అని… వెంటనే రన్నింగ్… ఉసేన్ బోల్ట్… దర్శకుడు బతికించాడు, తమిళ జల్లికట్టు, కన్నడ కంబాలా, తెలుగు కబడ్డీ ప్రవేశపెట్టలేదు… పాన్ ఇండియా సినిమా కదా…

.

హేమిటో… హీరోను లోకల్ ఐపీఎల్ టీమ్స్ ఎగబడి, పోటీలుపడి కొనేందుకు ప్రయత్నించడం ఏమిటో… తరువాత కుస్తీ పోటీలకు వెళ్లడం ఏమిటో… వెంటనే ఒంటికాలితో పరుగు పందెం ఏమిటో… నీకో నమస్తేరా బుచ్చిబాబూ అని సెటైర్స్ బాగా పేలుతున్నాయి సోషల్ మీడియాలో…

అంతటి హీరో ఎవడో జొన్న చేలో కొడుతుంటే, కాలు విరస్తుంటే కనీస ప్రతిఘటన ఉండదు, ఐనా కాలువిరిగినోడిని కుస్తీ పోటీలో ఎలా పాల్గొననిస్తారు..? అదయిపోయిందా..? వెళ్లి ఢిల్లీలో చెరుకు బండి పెట్టుకుంటాడు ఈ ఛాంపియన్… మళ్లీ తనే నాకు ఈ పని కూడా వద్దని, ఆ చెరుకు బండి వదిలేసి, కాలు నొప్పిగా ఉందని పనిగట్టుకుని, తన కాలు తనే విరగ్గొట్టుకుని, ఒంటి కాలితో రన్నింగ్ రేసుకు వెళ్తాడు…

అంతర్జాతీయ రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్ విన్నర్ గురించి సెలక్షన్ కమిటీ మెంబర్ బొమన్ ఇరానీకి తెలియకపోవడం ఏమిటనే విమర్శ వస్తోంది… ఏమాటకామాట రాంచరణ్ కఠోరశ్రమ మాత్రం అభినందనీయం… ఎటొచ్చీ దర్శకుడే దారితప్పాడు… హిందీలో, ఇతర సౌత్ భాషల్లో వసూళ్లు కష్టం, తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులే గట్టెక్కించాలి ఇక..! ఇదీ రాంచరణ్ సినిమా పెద్దికి మరో పార్శ్యం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ పూసల ప్రేమ – రెండు రాష్ట్రాల నడుమ న్యాయపోరాటం ఐపోయింది…
  • సినిమాల్లో జియో అంబానీకి అదృష్టలక్ష్మి..! జ్యోతి దేశ్‌పాండే…!
  • పెద్ది..! ఇది మరో కోణం… డిఫరెంట్ రివ్యూ… దారితప్పిన దర్శకుడిపై…
  • ఒకరకంగా నెహ్రూకన్నా మోడీయే డిస్టింక్షన్ పాస్… ఎందుకంటే..?
  • ఈ అమర గాయకుడు సుస్వర దర్శకుడు కూడా..! ప్రతి పాటా ముత్యమే..!
  • కార్తీకదీపం కథ మళ్లీ మొదటికి..! సీఎం జోసెఫ్ విజయ్‌కు తొలి పరీక్ష..!!
  • ఆ గోల్డ్ కంపెనీ కథేంటి..? KTR తో ఒప్పందమేంటి..? ఏం జరుగుతోంది..?
  • సూర్య కుమార్ ఔట్..! క్రికెట్ అన్ని పాఠాలూ నేర్పించే ఓ గురువు..!!
  • నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా… కానీ చనిపోయేది గంగాధరం కదా..?”
  • శ్రీయుత గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions