.
కోటికోట్లు..! అంటే, ప్రపంచ కుబేరుడు… కాకలుతీరిన కరెన్సీరాయుళ్లు కూడా కలలు గనే సంఖ్య… అంత సంపద ఎలన్ మస్క్ సొంతం… ఇంకా వచ్చిపడుతూనే ఉంది డబ్బు… నిన్నామొన్నా తన గురించి ఓ వాక్యం… స్పేస్‌ఎక్స్ ఐపీవో ద్వారా ఒక్కరోజు మస్క్‌కు వచ్చిన రెవిన్యూ అంబానీ సంపదకు దాదాపు రెట్టింపు అట…
ఐతే ఓ సగటు మార్వాడీ సేటులాగా… ఇల్లు వంటివి కొనకుండా, తక్కువ ఖర్చులో బతికేస్తూ, మొత్తం సంపదను- ఆదాయాన్ని మళ్లీ ఇంకెక్కడో పెట్టుబడి పెడుతుంటాడు మస్క అని బోలెడు విశ్లేషణలు కనిపించాయి… ప్రపంచ కుబేరుడు బతికేది జస్ట్ 450 అడుగుల ఫ్లాటులో అని చెప్పుకొచ్చాయి అవి… కానీ..?
Ads
వార్తల్లో చెప్పేదంతా నిజం కాదు… కొన్ని నిజాలు చెప్పుకోవాలి… నిజమే, అంబానీ ఆస్తి 8 లక్షల కోట్లు, కానీ మస్క్ ఆస్తి కోటి కోట్లు… దాదాపు 1.2 కోట్ల కోట్లు… మస్క్ నివసించే ఫ్లాటులో ఒక పడగ్గది, హాల్, కిచెన్, ఒక బాత్‌రూమ్ మాత్రమే ఉంటాయి… విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన గృహాలను ఆస్తులుగా కంటే ఖర్చుగా చూస్తాడు…
కానీ మస్క్ అసలు విలాసాలకే ఖర్చు పెట్టడా అంటే… భారీగా పెడతాడు… ఆడంబరం అంటే మస్క్… తనకు నలుగురు భార్యలు, 14 మంది పిల్లలు… వాళ్ల కోసం ఆస్టిన్‌లో ఓ పెద్ద మాన్షన్ కొన్నాడు, దాని విలువ 330 కోట్లు… తన ప్రయాణాలకు రెండు సొంత జెట్ విమానాలు… ఒక్కొక్కటి 14 మిలియన్ డాలర్లు, అంటే 130 కోట్లు… 6 వేల మైళ్ల దూరం ఆగకుండా వెళ్లగలవు అవి…
1977లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా The Spy who loved me గుర్తుందా..? అందులో ఒక కారు ఫేమస్… నీళ్లలోకి పోగానే సబ్‌మెరైన్ అయిపోతుంది… ఆ పాత కారును 10 కోట్లతో కొన్నాడు మస్క్… టెస్లా సైబర్ ట్రక్ లుక్ అదే… ఇదేకాదు, మస్క్ దగ్గర బోలెడు కార్లు… 1967 నాటి జాగ్వార్ టైప్ నుంచి ఆధునాత కార్ల దాకా…
ఆయన కార్ల కలెక్షన్‌లో మెక్‌లారెన్ ఎఫ్1, క్లాసిక్ పోర్ష 911 లాంటి అధునాతన కార్లు.. 1920నాటి ఫోర్డ్ మోడల్ టి, 1967 నాటి జాగ్వార్ ఈ టైప్ వంటి వింటేజ్ కార్లు.. ఇలా చాలానే ఉన్నాయి. మస్క్ దగ్గర కూడా అత్యంత ఖరీదైన చేతిగడియారాల కలెక్షన్ కూడా ఉంది. చాలామంది ధనికులకు వాచీల పిచ్చి తెలిసిందే కదా. మస్క్ ధరించే టెస్లా అక్షరాల ఉంగరం విలువ 35 వేల డాలర్లు…
మస్క్ అపార సంపదకు కారణాలు… తన స్పేస్‌ఎక్స్, టెస్లా, ఎక్స్‌ఏఐ, న్యూరాలింక్‌లాంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు… పనిరాక్షసుడి వంటి ధోరణి… తన కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల పనివిధానం, క్రమశిక్షణ వేరే లెవల్ ఉంటాయి… ఉండకపోతే ఆ కంపెనీల్లో ఆ ఉద్యోగి ఉండడు…
పెళ్లాలు, పిల్లల దగ్గరకు వద్దాం… తన వంటి తెలివైన పిల్లలు చాలామంది పిల్లల్ని కనాలనేది తన భావన… మొత్తం 14 మంది పిల్లలు… అనధికారికంగా మరొకరు… మొత్తం 15… లెక్కకు రాని పిల్లల సంఖ్య ఇక్కడ అప్రస్తుతం… ఈ మనిషి రసికచక్రవర్తే అంటారు… రోమన్, గ్రీకు దేవతల పేర్ల నుంచి ఆల్జీబ్రాలో వాడే ఎక్స్ దాకా రకరకాల పేర్లు తనే పెట్టాడు అందరికీ…
పిల్లల్లో పెద్ద పెళ్లానికి 2004లో కవలలు, 2006లో ట్రిప్లెట్స్ (ముగ్గురు)… ఎక్కువ మంది పిల్లలు అని తన మనసులో తిరిగే ఆలోచనలకు తగ్గట్టు జననాలు… మరో జీవిత భాగస్వామి శివోన్‌కు కూడా కవలలు… టెక్నాలజీని పిచ్చి పిచ్చిగా ప్రేమించి, తన వ్యాపారాలకు అత్యంతాధునిక టెక్నాలజీని ఆధారం చేసుకునే మస్క్‌కు ఎఐ అంటే మాత్రం వ్యతిరేకత…
‘మన అదుపులో ఉండని దెయ్యాన్ని మనమే ఆహ్వానించుకున్నట్టు’ అంటాడాయన… ఐనా సరే, తనూ ఓపెన్ఎఐ కంపెనీ పెట్టేశాడు… (కాకపోతే వేర్వేరు కారణాలతో దాన్నుంచి బయటికి వచ్చాడు… తరువాత గ్రోక్…) చెప్పేది వేరు, చేసేది వేరు కల్చర్‌లో ట్రంపుకి తాత ఈయన… సో, జస్ట్ 450 అడుగుల ఫ్లాటులో జీవనం అనే దగ్గర ఆగకూడదు… మస్క్ జీవితం చదవాలంటే చాలా అధ్యయనం, అన్ని కోణాల పరిశీలన- అవగాహన అవసరం…
Share this Article