Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మద్దతు ధర మోదీ బాధ్యత..! బీఆర్ఎస్‌కు నోరు పెగలదు..! భయం..!!

June 19, 2026 by M S R

.

ఫాఫం, రాను రాను హరీష్ రావు కేటీయార్‌కన్నా నాసిరకం విమర్శకుడు అయిపోతున్నట్టు కనిపిస్తోంది… అఫ్‌కోర్స్ దాసోజు శ్రావణ్‌కన్నా కూడా..! నిన్న రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులతో భేటీ అయి కొన్ని నిర్ణయాలు ప్రకటించాడు… వెంటనే హరీష్ నవ్వుతోపాటు జాలి పుట్టించే కొన్ని డిమాండ్లు చెప్పేశాడు…

కనీసం తనేం డిమాండ్ చేస్తున్నాడో తనకైనా తెలుస్తోందానేది డౌట్… చివరకు కేటీయార్ నయం అనిపించేట్టుగా..! అఫ్‌కోర్స్ రోజూ రెండుమూడు ఇష్యూస్ మీద కేటీయార్, హరీష్‌రావులకు దీటుగా మాట్లాడే దాసోజు నయం అనిపించేలా..!!

Ads

పంటలు మద్దతు ధరలు, రేవంత్ రెడ్డి నిర్ణయం, కేంద్రం బాధ్యతలు- నిర్లక్ష్యం గురించీ వివరంగా చెప్పుకుందాం గానీ… హరీష్ రావు ఏమంటాడంటే..? ‘‘ఆయ్ఁ ఎల్‌నినో ప్రభావం నీకు ముందుగా తెలియదా, ఏం ముందస్తు చర్యలు తీసుకున్నావు మరి, వరి వద్దంటావేం’’ అన్నట్టుగా ఓ విమర్శ… అవును, రేవంత్ రెడ్డి కూడా అర్జెంటుగా ఏదైనా ఫామ్ హౌజ్ వెతుక్కుని అయుత చండీయాగమో, ప్రయుత చండీయాగమో, అధిక వర్ష సంప్రాప్తి యోగమో చేయాల్సి ఉండిందా..?

ఎల్‌నినో ఈ రాష్ట్ర సమస్య కాదు, ప్రపంచం సమస్య… హరీష్ రావుకు అర్థం కానివి, మరిచిపోయినవీ. ఈమధ్య అదుపు తప్పుతున్నవీ మరిన్ని అంశాలూ చెప్పుకుందాం… ఏడు సన్న రకాలకే బోనస్ ఇవ్వడం తప్పట, వరి బదులు వర్షాభావ పంటలు వేసుకొండి అని చెప్పడం తప్పట… అంతేకాదు, కేంద్రం చెప్పిన కోటా మేరకే కొంటాం అనడం తప్పట… (మద్దతు ధరకు కొనడం కేంద్రం బాధ్యత, అదెవరూ ప్రశ్నించరేం..?)

హరీష్ రావుకు కనీసం బియ్యం మార్కెట్ మీద అవగాహన లేనట్టుంది, లేదా అన్నీ తెలిసీ ఈరోజుకు ఏదో రాజకీయ గాయిగత్తరే ప్రధానం అయిపోనట్టుంది… మా బియ్యం ఎందుకు కొనవు అని బీజేపీ మోడీని అడిగే దమ్ము లేదు తనకు… తనకు తెలుసో లేదో గానీ, ఓసారి కేంద్రం బాధ్యత ఏమిటో, మద్దతు ధర ఏమిటో ఓసారి చెబుదాం…



మొత్తం 22 ప్రధాన పంటలను మూడు రకాలుగా విభజించవచ్చు…

  • ఖరీఫ్ పంటలు (14)…: వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు, నైజర్ సీడ్స్, పత్తి.

  • రబీ పంటలు (6)…: గోధుమలు, బార్లీ, శనగలు, మసూర్ (పప్పుధాన్యం), ఆవాలు/రాప్ సీడ్, కుసుమలు.

  • వాణిజ్య పంటలు (2)..: కొప్రా (కొబ్బరి), జనపనార (Jute)…

2. పంటల కొనుగోలు చేసే ప్రధాన సంస్థలు (Procurement Agencies)… 

ప్రభుత్వం ప్రకటించే MSPకి అనుగుణంగా పంటలను సేకరించడానికి నిర్దేశిత నోడల్ ఏజెన్సీలు ఉంటాయి…

– వరి, గోధుమలకు ఎఫ్సీఐ.., పత్తికి సీసీఐ.., పప్పుధాన్యాలు, నూనెగింజలు, కొబ్బరికి నాఫెడ్… జూట్‌కు జేసీఐ… ఇలా…



  • మద్దతు ధర ప్రకటించడమే కాదు, మార్కెట్‌లో ఆ ధర దొరక్కపోతే, తనే ఆ మద్దతు ధరలకు కొనుగోలు చేయడం కేంద్రం అధికారిక, నైతిక, పరిపాలన బాధ్యత… అది జాతీయ ఆహారభద్రతలో కూడా ఓ భాగం… కానీ మోడీ ప్రభుత్వం నార్తరన్ స్టేట్స్ నుంచి ఎక్కువ కొంటుంది కానీ సౌత్ స్టేట్స్ నుంచి కొనడం లేదు, అది ఫ్యాక్ట్… దాని మీద రాష్ట్రం ఉమ్మడిగా పోరాడాలి, అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి..! బీజేపీకి ఎలాగూ అంత సీన్ ఉండదుగా…


కానీ ఏం జరుగుతోంది..? గతంలో సీఎంఆర్ కుంభకోణం కోసం, ఎడాపెడా రైతుల నుంచి కొనుగోళ్లు చేసిన పాపం కేసీయార్‌ది… అచ్చం కాళేశ్వరంలాగే..! కొన్ని వేల కోట్ల ధాన్యం గాయబ్… బడా మిల్లర్లు, బీఆర్ఎస్ మిల్లర్ల ధాటికి వ్యవసాయ మార్కెట్లలోని అడితీదార్లు, ధాన్యం కొనుగోలుదార్లు ఘోరంగా దెబ్బతిన్నారు, మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు సంప్రదాయ సిస్టం బాగా దెబ్బతిన్నది…

  • నిజమే, రేవంత్ రెడ్డి బహుముఖ కౌంటర్లు స్టార్ట్ చేశాడు… నువ్వెందుకు కొనవు, నువ్వు చెప్పిన కోటా ప్రకారమే నేను కొంటాను అని కేంద్రాన్ని కౌంటర్ చేయడంతోపాటు…, మోడీ కొనడం లేదు, మరి నన్నేం చేయమంటారు అని రైతులకే చెబుతాను అనేది రేవంత్ తాజా పాలసీ… మళ్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్నర్ అవుతున్నాడు… మెట్రో- ట్రిపుల్ ఆర్- మూసీ ఎట్సెట్రా ఇష్యూల్లో ఫుల్ డిఫెన్సులో పడిపోయిన కిషన్ రెడ్డి అండ్ కో ఈ ధాన్యం కొనుగోళ్లపైనా మాట ఉండదు, పలుకు ఉండదు…

 

  • అదేసమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని వరి వేసుకుని నష్టపోవద్దని చెబుతోంది… రియాలిటీ చెబుతోంది… అసలే ఎల్‌నినో, ఆపై కేంద్ర కొనుగోళ్లు నోనో… ఇంకా కొనీ కొనీ గోదాముల్లో ముక్కబెట్టే బదులు, పంటల మార్పిడి వైపు రైతుల్ని మరల్చడం ఓ మంచి దిశ… కానీ ఇదే సమయంలో ‘వరి వేస్తే ఉరే’ అని కేసీయార్ గతంలో చేసిన భీషణ ప్రకటనల్ని పాపం హరీష్ రావు మరిచిపోయినట్టున్నాడు…


మోడీని ప్రశ్నించాల్సిన హరీష్‌రావు అండ్ కో కేవలం రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేయడం ఏమిటి..?  బహుశా కేటీయార్‌కు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదో, హరీష్ రావును బీట్ చేయలేకపోతున్నాడో గానీ కేటీయార్ నుంచి పెద్దగా విమర్శల్లేవు పాపం… అఫ్‌కోర్స్, హరీష్ రావులాగా మాట్లాడటంకన్నా కేటీయార్‌లాగా తెలియనప్పుడు ఏమీ మాట్లాడకపోవడం బెటరే…

  • సీరియస్‌గానే ఓ విషయం… హరీష్ రావు గతంలో వేరు, ఇప్పుడు విషం తప్ప విషయం లేదు… ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు… మీరు వరి వేయండి, రేవంత్ రెడ్డి ఎలా కొనడో చూద్దాం అనే అర్థమొచ్చే ప్రకటనలు, డిమాండ్లు ఈ రాష్ట్ర రైతును నష్టం చేసేవి… అదేనా హరీష్ రావు కోరుకుంటున్నది..!!

చివరగా… రేవంత్ రెడ్డి పాలనలోని పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ గోదాముల్లో ముక్కిపోతున్న బియ్యాన్ని ఏం చేయాలో, ఎలా డిస్పోజ్ చేయాలో తెలియక… మంచి ప్రణాళికలు, ఆచరణ లేక కునారిల్లుతోందనేది మరో చేదు నిజం..!! అఫ్‌కోర్స్, కేంద్రమూ అదే స్థితిలో ఉంది… పప్పులు, నూనె పంటల వైపు మళ్లించడమే మార్గం… కానీ ఎలా..? అదనపు బియ్యం మొత్తాన్ని ఇథనాల్ తయారీకో, బీరు తయారీకో అడ్డికిపావుశేరు ధరలతో అమ్మేయడమా..?

అవునూ... హరీష్ రావుకు బీజేపీ మీద, మోడీ మీద విమర్శలు చేయడానికి జంకు దేనికి..? లేక ప్రేమా..? రేప్పొద్దున అవకాశాలకు ద్వారాలు తెరిచి ఉంచడానికా..?! తనకు తానే తక్కువ చేసుకుంటున్నాడు అనిపిస్తోంది...

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మద్దతు ధర మోదీ బాధ్యత..! బీఆర్ఎస్‌కు నోరు పెగలదు..! భయం..!!
  • మహా సంక్లిష్టుడు – ఈ కోటికోట్ల కుబేరుడు విలాసాల్లోనూ స్పేస్‌ఎక్స్ రేంజ్
  • ధర్మస్థల కుట్రలో ప్రకాష్‌రాజ్ – తనే బయటపడిపోయాడు!
  • The Duet of Silence – ఓ నిశ్శబ్ద యుగళగీతం ‘కూలిపోయింది’
  • ఇద్దరు సన్నకారు దళిత రైతులు… మోస్ట్ పాపులర్ సన్నాల్ని డెవలప్ చేశారు…
  • సన్నబియ్యం..! బీఆర్ఎస్ గాయిగత్తరకు బుర్ర లేదు- అర్థం లేదు…
  • Smriti Mandhana … ఎందుకు ఈమె అంత స్పెషల్?
  • ఓహ్, అది మీ కారా? ఎక్కడో కనిపిస్తే బాగుందని మనోళ్లే తెచ్చేశారు!
  • శ్రీదేవికి దీటుగా వెండితెర ఏలాల్సిన నటి… కానీ ఏం లాభం..?
  • దురంధర్ – వెలుతురు, నీడలు కూడా ప్రధాన పాత్రధారులు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions