.
విస్కీ (Whisky) ప్రపంచంలో చాలా రకాల గందరగోళాలు ఉంటాయి. ముఖ్యంగా ‘Whisky’ అని రాయాలా లేక ‘Whiskey’ అని రాయాలా అనేదే మొదటి సందేహం. సాధారణంగా స్కాట్లాండ్ నుండి వచ్చే వాటిని ‘Whisky’ అని, ఐర్లాండ్ లేదా అమెరికాలో తయారయ్యే వాటిని ‘Whiskey’ అని పిలుస్తారు.
సేమ్, ఇలాంటి సందేహాలే సింగిల్ మాల్ట్ స్కాచ్, బ్లెండెడ్ స్కాచ్ నడుమ ఉంటాయి. ఈ స్కాచ్ విస్కీల మధ్య అసలు తేడాలేంటో చాలామందికి తెలియదు కూడా… ఒకటి క్లాస్ అనీ, మరొకటి తక్కువ రకం అనీ అభిప్రాయాలున్నాయి, కానీ అవన్నీ నిజాలు కావు.
Ads
1. సింగిల్ మాల్ట్ స్కాచ్ (Single Malt Scotch) చాలామంది సింగిల్ మాల్ట్ అంటే అది ఇంకేమీ కలపనిది (Blend కానిది) అనుకుంటారు, కానీ అది నిజం కాదు.
ఇది ఒకే డిస్టిలరీలో, 100% బార్లీని ఉపయోగించి, రాగి పాత్రల్లో ద్వారా తయారు చేసి, కనీసం 3 ఏళ్లు నిల్వ (Age) చేసి ఉండాలి. ఒకే డిస్టిలరీకి చెందిన వేర్వేరు వయస్సున్న Casks కలిపి ఈ విస్కీని తయారు చేస్తారు. అందుకే దీన్ని కూడా ఒక రకమైన బ్లెండ్ అని చెప్పవచ్చు.
ఇది చాలా క్లిష్టమైన రుచిని కలిగి ఉంటుంది. ఏ ప్రాంతంలో తయారయ్యాయో ఆ ప్రాంతపు రుచి, వాసన ఇందులో స్పష్టంగా తెలుస్తాయి.
2. బ్లెండెడ్ స్కాచ్ (Blended Scotch) ఇది వేర్వేరు డిస్టిలరీలకు చెందిన సింగిల్ మాల్ట్, సింగిల్ గ్రెయిన్ విస్కీలను కలిపి తయారు చేస్తారు. వీటిని తయారు చేసేటప్పుడు రుచి ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్త పడతారు, అందుకే ఇవి ఎక్కువ మందికి నచ్చుతాయి (ఉదాహరణకు: Johnnie Walker Black Label, Dewar’s 15 Year Old).
3. సింగిల్ గ్రెయిన్ విస్కీ (Single Grain Whisky) ఇది సింగిల్ మాల్ట్ లాంటిదే, కానీ ఇందులో బార్లీతో పాటు మొక్కజొన్న (Corn) లేదా రై (Rye) వంటి ఇతర ధాన్యాలను కూడా వాడవచ్చు. ఇవి ఎక్కువగా ‘బ్లెండెడ్ స్కాచ్’ తయారీలో ఉపయోగిస్తారు.
సింగిల్ మాల్ట్ అంటేనే ఎప్పుడూ “బెస్ట్” అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బ్లెండెడ్ స్కాచ్లలో కూడా అద్భుతమైన రుచి, నాణ్యత గల బాటిల్స్ చాలా ఉన్నాయి.
బ్లెండెడ్ విస్కీ (Blended Whiskey) – తేడా: అమెరికా వంటి దేశాల్లో ‘బ్లెండెడ్ విస్కీ’ అని వేరేగా ఉంటుంది. అందులో కొన్నిసార్లు తక్కువ నాణ్యత గల స్పిరిట్స్ కలపవచ్చు. కానీ స్కాచ్ విస్కీకి మాత్రం చాలా కఠినమైన ప్రభుత్వ నిబంధనలు ఉంటాయి, కాబట్టి బ్లెండెడ్ స్కాచ్ చాలా నమ్మదగినది.
మీరు స్కాచ్ విస్కీ కొనేటప్పుడు కేవలం “సింగిల్ మాల్ట్” అనే పేరుకే పరిమితం అవ్వకుండా, బ్లెండెడ్ స్కాచ్లను కూడా ప్రయత్నించండి. మీరు ఆశ్చర్యపోయేలా మంచి రుచిని అందించే బాటిల్స్ అందులోనూ ఉంటాయి! ( Credit :: Chowhound )
Share this Article
