Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Ira Aery… ఓ ఫిమేల్ వైభవ్ ..! హఠాత్తుగా క్రికెట్ క్రష్ అయిపోయింది..!!

June 19, 2026 by M S R

.

కొందరు హఠాత్తుగా పాపులర్ అయిపోతారు… క్రష్ అనిపించుకుంటారు… సోషల్ మీడియో హోరెత్తిపోతుంది… ఎప్పుడూ సోషల్ మీడియాకు, మీడియాకు ఓ కేరక్టర్ కావాలి హల్‌చల్ చేయడానికి..! ఇప్పుడు ఆస్ట్రేలియన్ అండర్-19 వుమెన్ క్రికెటర్ దొరికింది… పేరు ఇరా ఏరీ (Ira Aery)… వయస్సు 17 ఏళ్లు… ఇప్పుడామె క్రికెట్ క్రష్…

ఇండియన్ రూట్స్ అని ఆమె ప్రొఫైల్ చెప్పడంతో ఇక ఇండియన్ మీడియా కూడా తెగ మోస్తోంది ఇప్పుడు… కారణాలు సింపుల్… 1) ఆమె ఇండియన్ రూట్స్ అమ్మాయి, ఆ ఎమోషనల్ కనెక్షన్ 2) చక్కని అందం 3) సూపర్ లుక్ 4) బెటర్ ఫిట్‌నెస్ 5) ఇటీవల ఆస్ట్రేలియా- ఇంగ్లండ్- శ్రీలంక సీరీస్‌లో అందరికన్నా ఎక్కువగా 13 వికెట్లు తీసి భేష్ అనిపించుకుంది…

Ads

ఇరా

పేరుకు ఆమె భారత సంతతి అని చెబుతున్నా… ఎక్కడా ఆమె తల్లిదండ్రుల పేర్లు గానీ, వాళ్ల వృత్తుల వివరాలు గానీ, పూర్వీకుల స్వస్థలాల వివరాలు గానీ లేవు… ఆమె వాటిని గోప్యంగానే ఉంచుతోంది… కానీ చాలామంది సందేహం ఏమిటంటే..? పేరుకు భారత సంతతి గానీ ఆమె పేరు మాత్రం (ఇరా ఏరి) పక్కాగా ఆస్ట్రేలియన్ పేరు… (కాదు, ఇర అంటే సంస్కృతంలో భూమి అనే అర్థం, ఏరి అనేది పంజాబ్‌లో కొందరి ఇంటి పేరు అనీ చెబుతున్నారు కొందరు)

2009 విక్టోరియా, హైడల్‌బర్గ్‌లో పుట్టిన ఈమె త్వరలోనే ఆస్ట్రేలియన్ మెయిన్ వుమెన్ జట్టులో స్థానం సంపాదిస్తుందనీ… మనకు బ్యాటింగులో వైభవ్ సూర్యవంశీ ఎలాగో, ఆమె బౌలింగులో లేడీ వైభవ్ అనీ ప్రశంసలు కురిపిస్తున్నారు… కానీ…

Ira Aery

2025 శ్రీలంక జట్టుతో జరిగిన అండర్ -19 మ్యాచుల్లో గానీ… మొన్నటి ఫిబ్రవరిలో లోకల్ మ్యాచుల్లో గానీ (ఈమె విక్టోరియా తరఫున ఆడుతుంది) ఆమె ఒక్క వికెట్ కూడా తీయలేదని Espn Cricinfo చెబుతోంది… హఠాత్తుగా ఇప్పుడు పుంజుకుని తాజా ట్రైసీరీస్‌లో మాత్రం నిలకడగా ఆడుతూ 13 వికెట్లు తీసింది…

ఐనా మనవాళ్లకు గతం, పాత గణాంకాలు, ఎక్కాలు, లెక్కలు అక్కర్లేదుగా, వర్తమానం ఎంత బ్రైట్‌గా ఉందనేదే ముఖ్యం… పైగా బ్రైట్ అందగత్తె… ఇంకేం..? క్రికెట్ క్రష్ అయిపోయింది… సో, ప్రస్తుతానికి ఆమె లేడీ వైభవం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూట్యూబ్ స్టార్ నాగదుర్గ- మూవీల్లో క్లిక్కయితే మరో సాయిపల్లవి…
  • Ira Aery… ఓ ఫిమేల్ వైభవ్ ..! హఠాత్తుగా క్రికెట్ క్రష్ అయిపోయింది..!!
  • సింగిల్ మాల్ట్ Vs బ్లెండెడ్… స్కాచ్ రకాలపై అపోహలు- నిజాలు
  • సాక్షాత్తూ ప్రభుత్వం పేరుతోనే — బరితెగించిన స్కామ్ యాడ్స్
  • పెద్ది… నిర్మాత చేతులు కాలాయా..? ఏది నిజం..? ఏది అబద్ధం..?
  • మద్దతు ధర మోదీ బాధ్యత..! బీఆర్ఎస్‌కు నోరు పెగలదు..! భయం..!!
  • మహా సంక్లిష్టుడు – ఈ కోటికోట్ల కుబేరుడు విలాసాల్లోనూ స్పేస్‌ఎక్స్ రేంజ్
  • ధర్మస్థల కుట్రలో ప్రకాష్‌రాజ్ – తనే బయటపడిపోయాడు!
  • The Duet of Silence – ఓ నిశ్శబ్ద యుగళగీతం ‘కూలిపోయింది’
  • ఇద్దరు సన్నకారు దళిత రైతులు… మోస్ట్ పాపులర్ సన్నాల్ని డెవలప్ చేశారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions