.
అందుకే సాక్షిలో పనిచేయడానికి చాలా మంది రిపోర్టర్లకు ఇష్టం… ఇక్కడ ఎవరూ ఏదీ పట్టించుకోరు… సబ్ చల్తా. అంత బ్రహ్మాండంగా ఆ సిస్టమ్ తీర్చిదిద్దిన మహానుభావులు ఎందరో, అందరికీ తెలుగు పాత్రికేయం అద్భుతంగా రుణపడి ఉంటుంది పాపం.
విషయం ఏమిటంటే..? నా దృష్టికి ఓ విషయం వచ్చింది, నిజానికి ఇందులో ఏముందిలే అనిపించింది చూడగానే… కానీ తరచి చూస్తే ఏడాది క్రితం నాటి ఓ పాత కథనాన్ని యథాతథంగా అవే ఫోటోలు, అవే ఓపీనియన్స్, అదే టెక్స్ట్ తో పంపించినా సరే, సాక్షి అచ్చేస్తుంది, కళ్లకద్దుకుని.
Ads
గతంలో ఈనాడులో క్వాలిటీ సెల్ అని ఓ విభాగం ఉండేది, ఆంధ్రజ్యోతిలో ఉందో లేదో తెలియదు గానీ, పాపం సాక్షిలోనూ గతంలో ఒకటి ఉండేది, ఇప్పుడుందో లేదో తెలియదు, కనీసం నామ్‌కేవాస్తే కొనసాగిస్తున్నారో లేదో కూడా తెలియదు.
నిజానికి పత్రిక ఇజ్జత్ పోవద్దూ అంటే, ఓ క్వాలిటీ సెల్ ఉండాలి, అందులో ఉండేవాళ్లకు పాత్రికేయ స్పృహ కూడా ఉండాలి, యాజమాన్యానికి పత్రికలో లోటుపాట్లను చెబుతూ ఉండాలి, అఫ్‌కోర్స్, మేనేజ్‌మెంటే అలా ఏడిస్తే ఎవరూ ఏమీ చేయలేరు, అది వేరే విషయం.
ఈ సందేహం ఎందుకు వచ్చిందీ అంటే, ఈ రెండు వార్తలు చూడండి.

ఇది మే 13, 2025 నాడు పబ్లిష్ చేశారు. ఇదుగో ఈ క్లిప్పింగ్ చూడండి.

నిజామాబాద్ జిల్లా, మోర్తాడ్ (బాల్కొండ) నుంచి జనరేటైన వార్త. అప్పుడూ ఇప్పుడూ నవీన్ యాదవ్ అనే బాధిత రైతే కనిపిస్తాడు కథనాల్లో. అదే కంటెంటు దాదాపుగా ఆ కథనంలో, ఈ కథనంలో. అదే ఇష్యూ.
సో, అందుకే చెప్పింది, సాక్షిలో పనిచేయడం ఈజీ. ఏదో ఒకటి రాసేస్తే సరి, పేజీ నిండిందా లేదాని డెస్కు చూసుకుంటుంది. సిస్టం చూసుకోవాల్సిన బాధ్యులు ఎవరి పర్సనల్ యవ్వారాల్లో వాళ్లు బిజీగా ఉంటారు. శుభం. ఏమిటిలా అని అడిగేవారు ఉండరు, అసలు వాళ్లకు తెలిస్తే కదా. ముందే చెప్పుకున్నాం కదా, సాక్షిలో సబ్ చల్తా… జగన్ సర్, మీరు గ్రేట్ సర్..!!
Share this Article