Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శ్రీలీలకు అవమానం లేదు – అమృత ఫడ్నవీస్ అమర్యాద అసలే లేదు

June 23, 2026 by M S R

.

ముందుగా ఓ చిన్న వార్త… ఇలా… ‘‘టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీలకు ఘోర అవమానం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో దివ్యాజ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ వేడుకలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత, ఆమె కుమార్తె దివిజ కూడా పాల్గొన్నారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా ఓ ఊహించని ఘటన జరిగింది. మొదట ముగ్గురూ కలిసి ఫోజులిచ్చినప్పటికీ.. ఆ తర్వాత జర్నలిస్టులు అమృతా ఫడ్నవీస్, ఆమె కుమార్తెను మాత్రమే విడిగా ఫొటో ఇవ్వాలని కోరారు. దాంతో అమృతా పక్కనే ఉన్న శ్రీలీలను ఉద్దేశించి చాలా అగౌరవంగా చేతి వేలితో సైగ చేస్తూ పక్కకు వెళ్లాలని చెప్పారు.

Ads

ఈ ప్రవర్తనతో శ్రీలీల ఒక్కసారిగా షాక్‌కు గురైనప్పటికీ, ఏమాత్రం అసహనం చూపించకుండా చాలా హుందాగా అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఒక స్టార్ హీరోయిన్‌ను అంత పెద్ద వేదికపై అలా అవమానించడం దారుణమంటూ శ్రీలీల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…’’

…… రిపోర్టింగులో ‘అతి’ చూపించకపోతే అదే పాత్రికేయ పరిణతి అనుకోవాల్సిన రోజులు ఇవి… నిజంగా అమృత అంత అమర్యాదకరంగా వ్యవహరించిందా అని సదరు వీడియో చూస్తే, ఈ వార్తకు పూర్తి భిన్నమైన చిత్రం కనిపించింది. (దిగువన ఆ లింక్ ఉంది)

ఎస్, పబ్లిక్ ఫంక్షన్లు, ఇతరత్రా తన యాక్టివిటీల్లో అమృత ధోరణి బాగుండదు. వెగటు, చెత్తా వేషధారణతో ఆమె బోలెడు విమర్శలు ఎదుర్కుంది గతంలో కూడా… ఈ సందర్భంలోనూ ఆమె డ్రెస్సింగ్ సందర్భానికి తగినట్టు లేదు, ఆమెకూ తగినట్టు లేదు, తన మొగుడికి అస్సలే తగినట్టు లేదు. ఫడ్నవీస్ ఈ దేశంలోని ప్రముఖ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజాజీవితంలో ఉన్నవారి లుక్, బిహేవియర్ ప్రజల నిరంతర పరిశీలనలో ఉంటాయి, ఫడ్నవీస్ మాటతీరు బాగుంటుంది.

పైగా విధి అనుకూలిస్తే ఈ దేశానికి ప్రధాని అయ్యేవారి జాబితాలో ఫడ్నవీస్ ఉంటాడు. సో, ఆయన భార్య సొసైటీలో మెదిలే విధానం కూడా హుందాగా ఉండాలని కోరుకుంటారు, కానీ ఇక్కడ శ్రీలీల విషయంలో మాత్రం మీడియా ఆమెను తప్పుపట్టాల్సింది ఏమీ లేదు…

ఫోటోలు దిగడానికి వచ్చాక కూడా అమృత, శ్రీలీల నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు, బిడ్డను ఆమెకు పరిచయం చేసింది, తరువాత ఫోటోగ్రాఫర్లకు తల్లీబిడ్డల ఫోటోలు విడిగా కావాలని అడిగారు, సో, అటు పక్కన కూర్చో అన్నట్టుగా శ్రీలీలకు అటువైపు చూపించింది. అంతే తప్ప అందులో అమర్యాదకరమైన బిహేవియర్ ఏమీ కనిపించలేదు.

ఆమె సోషల్ యాక్టివిటీ ఎక్కువ, ప్రముఖ బ్యాంకర్, మంచి పోస్టులో ఉంది, ఎవరితో ఎలా మెదలాలో తెలిసిన వ్యక్తే. ఆ తరువాత ఫోటోగ్రాఫర్లు కేవలం తన ఫోటోలే అడిగితే బిడ్డను కూడా పక్కకు వెళ్లమని చెప్పి తనొక్కతే ఫోటోలకు ఫోజులిచ్చింది. సో, ఇక్కడ అమృతను నిందించడానికి ఏమీ లేదు, శ్రీలీలకు షాక్ లేదు, ఆమె ఖిన్నురాలేమీ కాలేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోహ్లీ, రోహిత్, బుమ్రా… తోడుగా గిల్, శ్రేయాస్… జట్టు మేలైన కూర్పు…
  • శ్రీలీలకు అవమానం లేదు – అమృత ఫడ్నవీస్ అమర్యాద అసలే లేదు
  • ముంబై గోల్డ్ సిండికేట్‌పై దెబ్బ! – కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం!
  • మన కాకినాడ ప్రజావైద్యుడికి మరో అంతర్జాతీయ గుర్తింపు!
  • అందుకే సాక్షిలో పనిచేయడానికి చాలా మంది రిపోర్టర్లకు ఇష్టం…
  • ఓహ్, ఈమె నాగశౌర్య సొంత మేనత్త? ఒకప్పటి స్టార్ సిస్టర్! కానీ…
  • ఈ భార్య సంగతి సరే- కానీ ముసలి పేద తల్లిదండ్రుల గతేమిటి?
  • ఈమె ఓ ఫైర్ బ్రాండ్..! ప్చ్, మగపెత్తనాలు రాజీనామా చేయించాయి..!!
  • కలిసి నడుస్తారా? కైలాట్కమా? – కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ!
  • ఆ బుజ్జి ఉడుత కథ పెద్దదే – పర్ణశాల నుంచి రామేశ్వరం దాకా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions