Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి

June 24, 2026 by M S R

.

తమిళనాడు పాలిటిక్స్, సంస్కారరాహిత్యాలు ఏపీ పాలిటిక్స్‌కన్నా ఓ ఆకు ఎక్కువే… స్టాలిన్ కొడుకు ఉదయనిధి అనే ప్రబుద్ధుడు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాక మరింత కాలుష్యం, జాడ్యం పెరిగింది… ఈసారి ఎన్నికల్లో గెలవగానే తను సీఎం అయిపోవాలనీ, నాన్నను కేంద్ర రాజకీయాల్లోకి పంపించేయాలని అనుకున్న ఈ సనాతన ద్వేషికి విధి ఎదురుతన్నింది.

ఆ ఫ్రస్ట్రేషన్ అంతా సీఎం జోసెఫ్ విజయ్ మీద చూపిస్తున్నాడు. ఆల్రెడీ సనాతనం మీద వైరస్ అని ద్వేష వ్యాఖ్యలు చేసిన నైజం తెలుసు కదా, ఇప్పుడు విజయ్ వ్యక్తిగత జీవితాంశాలను అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చాడు. తనను జస్ట్ ఓ సినిమా నటుడిగా తీసిపారేశాడు కదా స్టాలిన్ అంటూ విజయ్, స్టాలిన్‌ను మిమిక్ చేస్తూ విమర్శించాడు.

Ads

అసలే ఉదయనిధి కదా, ఎక్కడో మండింది. విజయ్ విడాకుల అంశాన్ని ప్రస్తావించాడు. కోర్టులో భర్త కోసం వెతుక్కుంటున్న భార్య కథ అందరికీ తెలిసిందేనంటూ ఘాటుగా దాడికి దిగాడు. పక్కాగా ఇది పర్సనల్ అటాక్, ఉదయనిధి నుంచి ఇంతకుమించి పరిణతి ఆశించడం వృథా…

(నిజంగానే విజయ్ పాలన మీద, ప్రభుత్వం మీద అంత అక్కసు ఉంటే… మీ కూటమికే చెందిన పార్టీలతో మద్దతు ఉపసంహరించపజేయొచ్చుగా… అది మాత్రం చేయడు, ఎందుకంటే, వెంటనే అన్నాడీఎంకే విజయ్‌తో జతకట్టి కుర్చీ ఎక్కుతుందని భయం…)

మరో ఇంపార్టెంట్ విషయానికి వస్తే… విజయ్ ఏమంటాడంటే..? ‘‘ద్రవిడ రాజకీయాలకు ప్రధానసూత్రంగా ఉండే పెరియార్ భావజాలాన్ని గౌరవిస్తాం, కానీ నాస్తికత్వం, మతవిశ్వాసాలపై ఆయన ధోరణికి భిన్నంగా ఉంటాం. ఎందుకంటే మేం దేవుడిని నమ్ముతాం, విశ్వాసులం. అలాగే అంబేడ్కర్, కామరాజ్ చూపిన బాటల్లో నడుస్తాం. ఎంజీఆర్, అన్నాదురై ప్రభుత్వాల బాటే మా బాట’’

  • తమిళనాడు రాజకీయాల్లో పెరియార్ మార్క్ నాస్తికత్వం మాకు అక్కర్లేదు అని శాసనసభలోనే చెప్పిన తొలి ముఖ్యమంత్రి కావచ్చు విజయ్ బహుశా… సాహసి… (ఒకవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, అలాగే నాస్తిక పార్టీలు వీసీకే, లెఫ్ట్ సపోర్టుతో ఉండీ విజయ్ నా బాట నాది అని చెప్పడం విశేషమే)

ఇలాంటి భావజాలం, ప్రకటనకు సంబంధించి మాజీ అన్నాడీఎంకే నేత, ప్రస్తుతం విజయ్ కేబినెట్ మంత్రి, టీవీకే ముఖ్య సమన్వయకర్త కేఏ సెంగోట్టయాన్ ప్రభావం, మార్గదర్శనం ఉండొచ్చు. అంతేకాదు, టీవీకే ప్రధాన రాజకీయ సలహాదారు జాన్ అరోకియాసామి (Jhon Arokiasamy) పాత్ర కూడా ఉండొచ్చు.

ఎస్, జోసెఫ్ విజయ్ పుట్టుకతో క్రిస్టియన్, ఇప్పటికీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, అధికారంలోకి రాగానే కర్నాటకలోని ఉడుపి జిల్లా, కొల్లూరులోని మూకాంబిక గుడికి వెళ్లి, 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని సమర్పించుకున్నాడు. అది సౌత్ పొలిటిషియన్లు బాగా నమ్మే గుడి… ఇటు క్రిస్టియానిటీ- అటు హిందూ ఆధ్యాత్మికత మీద బ్యాలెన్స్ చేస్తున్నాడు సరే… కానీ ఓ పరీక్ష ఉంది తనకు. (జగన్ గుర్తొస్తున్నాడా?)

తిరుప్పరంకుండ్రం కొండపైని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి (మురుగన్) గుహాలయం దగ్గర కార్తీకదీపం వివాదం. చెన్నై హైకోర్టు అనుమతించాల్సిందే అని ఆదేశించింది… స్టాలిన్ పట్టించుకోకుండా ఏకంగా ఆ తీర్పు చెప్పిన జడ్జినే అభిశంసించే దురాలోచనకు దిగాడు. (ఇండి కూటమి మద్దతు పలికింది) తను నాస్తికుడైతే ప్రజలందరూ తనలాగే ఉండాలా, అదీ కేవలం హిందువులు మాత్రమే తమ మతవిశ్వాసాలకు దూరంగా ఉండాలా?

ఆమధ్య విజయ్ అధిాకారంలోకి వచ్చాక హైకోర్టు ఈ తీర్పు అమలుపై మీ స్టాండ్ ఏమిటని ప్రశ్నించింది. చూడాలిక, నాస్తిక ధోరణులకు దూరంగా, దేవుడిని నమ్ముతాను అంటున్న విజయ్ ఏం స్టాండ్ తీసుకుంటాడో!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?
  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?
  • ఇళయరాజాతో ఏదో తేడా కొట్టింది! వంశీ హార్మోనియం అందుకున్నాడు!!
  • రోత ఆహార్యం! – ఒక సీఎం భార్యకే ఇలా డ్రెస్ సోయి లేకపోతే ఎలా?
  • భేష్ శ్రీచరణి! ఐసీసీ నంబర్ వన్ ర్యాంకింగ్- ఆషామాషీ కాదు!
  • ‘మెట్రోపై ముందడుగు’ – ప్రస్తుతానికి ఓ పే-ద్ద భేతాళ ప్రశ్న!
  • 00.00 – హేపీ బర్త్ డే డియర్ సీఎం… త్రిష చాలా తెలివైంది సుమీ!
  • రోజులు బాగాలేవు..! పెళ్లాల్నే కాదు, కాబోయే పెళ్లాలతోనూ బహుపరాక్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions