.
Prabhakar Jaini …. తెలుగు సినిమా రంగం మీద నిందలు వేయడం, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళకు బాలీవుడ్ లో అవకాశాలు లేనప్పుడు లేదా అక్కడ నటించిన చిన్న సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు, తిండికి, సోకులకు డబ్బులు లేక సౌత్ ఇండస్ట్రీ స్వర్గంలా కనిపిస్తుంది.
దానికి తోడు మనవాళ్ళకున్న తెల్ల తోలు పిచ్చి వల్ల, వాళ్ళకు, ఉత్తరాదిలో ఫెయిలయిన అమ్మాయిలకు, రెడ్ కార్పెట్ పరిచి, అవకాశం ఇస్తారు. మన తెలుగు హీరోయిన్లకు ఇవ్వని ఫైవ్ స్టార్ హోటళ్ళు, ఓ పది మంది చెలికత్తెలకు విమానం టిక్కెట్లు, రోల్స్ రాయిస్ కార్లు, క్యారవాన్లు పెడ్తారు. పారితోషికం కోట్లలో ఉంటుంది.
Ads

అలా ఓ పది సినిమాలు చేసేసరికి, వీళ్ళు గొప్ప హీరోయిన్లు అయినట్టుగా భావిస్తుంటారు. దాంతో కళ్ళు నెత్తికెక్కుతాయి. అప్పటి నుండి తమ డబ్బులన్నీ బొంబాయి, ఢిల్లీల్లో పెట్టుబడులు పెట్టి హోటళ్ళు, జ్యువెలర్స్, రియల్ ఎస్టేట్, ఫామ్ హౌజెస్ లో వ్యాపారం చేస్తుంటారు. ఈ లోపల వయసు ముప్ఫై దాటుతుంది.
పెళ్ళి చేసుకోవాలి కాబట్టి, మొగుళ్ళ వేటలో బొంబాయి చేరుకుంటారు. సినిమాల్లో అవకాశాల కోసం వాడి కాళ్ళు వీడి కాళ్ళు పట్టుకుంటారు. తాము కూడా ఇక్కడి వాళ్ళమే అని చెప్పుకోవడానికి, అవసరంలో ఆదుకున్న టాలీవుడ్, కోలీవుడ్ మీద చెత్త విమర్శలు గుప్పిస్తుంటారు. వీరు మలయాళం, కన్నడ సినిమాలు చేయరు. ఎందుకంటే అక్కడ డైలాగులు సొంతంగా చెప్పుకోవాలి, పారితోషికం డబ్బులు కొన్ని లక్షల్లోనే ఉంటాయి.
కానీ, ఒకటి మాత్రం నిజం. వీరిని గ్లామర్ గానే చూపిస్తారు. అసలు వీళ్ళను తీసుకున్నదే గ్లామర్ కోసం కదా? వీళ్ళ ముఖాలకు నటించడం రాదు కదా?
గ్లామర్ గా చూపిస్తారని అనే వీళ్ళ నిజజీవిత వస్త్రధారణ ఎంత దరిద్రంగా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం కదా? రాధికా ఆప్టే, ఎంత చక్కగా హిందీ సినిమాల్లో బరిబాతల నటిస్తుందో? అది ఇబ్బంది కాదా? ఎన్నో నీతులు, కండీషన్లు పెట్టి, ‘స్పిరిట్’, కల్కి 2 సినిమాల నుండి గెంటి వేయబడిన, దీపికా పడుకోన్ షారూఖ్ ఖాన్ సినిమాల్లో ఎంత పద్ధతిగా బట్టలు విప్పి, కట్ డ్రాయర్ మీద ఎరోటిక్ ఫోజులతో డ్యాన్సు చేసిందో? తమన్నా మూడేళ్ళు ‘విజయ్ వర్మ’తో సహజీవనం చేసి, ‘తూచ్’ అని బయటకొచ్చి ఇప్పుడు నీతులు బోధిస్తుందో?
టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఎన్ని అవకతవకలున్నా, పని విషయంలో క్రమశిక్షణ పాటిస్తారు. అవసరమయితే రెండు మూడు గంటలు ఎక్కువ పనిచేయిస్తారు. మొదట్లో టాలీవుడ్ అంతా బావుందని అనిపించిన ఉత్తరాది వాళ్ళకు తర్వాత నచ్చకపోవడానికి ముఖ్య కారణం ఇదే.
అంతే కాకుండా ఇక్కడ విచ్చలవిడి జీవితం కుదరదు. డ్రగ్స్ పార్టీలు ఈజీ కాదు. క్రమశిక్షణ ఎక్కువ. అందుకే డిస్కంఫర్ట్ గా ఫీలవుతారు. మరి, దక్షిణాది మీద ఈ ముసలి తారలు ఏడుస్తుంటే, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి వాళ్ళు ఎందుకు కొత్తగా వస్తున్నారు?
వీళ్ళు ఇలా అవాకులు చవాకులు పేలుతుంటే, మన కౌన్సిళ్ళు, సంఘాలు నోరు మూసుకుంటాయి. ‘పెద్ది’ సినిమాలో జాన్వీ గురించి ఉత్తరాది వృద్ధ నటీమణులు డైరెక్టరును విమర్శిస్తే, మన వాళ్ళు ఒక్కరూ నోరు మెదపలేదు. బాలీవుడ్ సినిమాల్లో నటీమణులు చేసే ఎక్స్పోజింగ్ లో, ఇక్కడ జరిగింది పదోవంతు కూడా కాదు.
మన దగ్గర కులాల కంపు వల్ల, రామ్ చరణ్ కాపు కులస్థుడు కాబట్టి కమ్మ లాబీ నోరు విప్పలేదు. రేపు మరో కమ్మ హీరో సినిమా గురించి విమర్శలు వస్తే కాపు లాబీ మౌనంగా ఉంటుంది. దానికి తోడు రాజకీయ పార్టీల పరంగా కూడా ఇండస్ట్రీలో తగినంత ఐకమత్యం లేదు.
స్పందించవలసిన సంస్థలు స్పందించవు. సామాన్య ప్రజలమైన మనకున్న పౌరుషం కూడా టాలీవుడ్ పెద్దలకు లేదు. నేషనల్ క్రష్ అని పిలవబడుతున్న రష్మికను, కన్నడ సినిమా నటుణ్ణి పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందనే నెపంతో, కన్నడ సినిమా రంగం (శాండల్ వుడ్) – దాదాపు బ్యాన్ చేసింది. మన ఇండస్ట్రీ వాళ్ళకు మాత్రం, చీమ కుట్టినట్టు లేదు.
ఇంత జరిగినా, మళ్ళీ దీపికా పడుకోన్ తోనే సినిమా తీసే వాళ్ళు, మొత్తానికి ముంబయికే తమ మకాం మార్చారు. మనవాళ్ళకు తెల్లతోలు వ్యామోహం, పాన్ ఇండియా పిచ్చి తగ్గనంత వరకు టాలీవుడ్ కి ఈ అవమానాలు తప్పవు.
కళకు భాషాబేధాలూ, ప్రాంతీయ భావాలూ లేవని సొల్లు కబుర్లు చెప్పకండి. సినిమా కళామతల్లి అన్నది, కృష్ణానగర్ ఇరుకు సందుల్లో, కడుపు కాలి, తిండికి లేక మూలిగే కార్మికులుండే మురికి వాడల్లో కనిపించదు. అది సినిమా ప్రీ రిలీజ్ వేదికల మీద, విదేశాల్లో జరిగే సైమా అవార్డు ఫంక్షన్లలో మాత్రమే వినిపించే, అత్యంత బూతు పదం…. ప్రభాకర్ జైనీ, ‘నంది’; ‘గద్దర్’ అవార్డ్స్ విన్నర్
Share this Article