Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఇడుపు కాయితం’ ఇచ్చి పన్నెండేళ్లయినా… అదే వెక్కిరింపులు!

June 26, 2026 by M S R

.

తెలంగాణను తరాలుగా అన్నిరకాలుగా దోచుకోవడమే కాదు, ఈరోజుకూ ఇంకా ఇంకా పెత్తనాల కోసం పవన్ కల్యాణ్‌లు, చంద్రబాబులు మళ్లీ మళ్లీ ఏదోరకంగా వస్తున్నారు… ప్రత్యేకించి తెలంగాణ భాష మీద, సంస్కృ‌తి మీద, తిండి మీద, బట్ట మీద, పండుగల మీద… వాట్ నాట్, ఈ మట్టి మీద బతుకుతూనే ఎన్ని వెక్కిరింపులు? ఎన్ని అవమానాలు?

ఒకడు పొద్దున లేవడం నేర్పించానంటాడు, మరొకడు అన్నం తినడం రుచిచూపించానంటాడు… తెలంగాణలో దమ్ బిర్యానీ ఘుమఘుమలు వ్యాపించినప్పుడు, సరిగ్గా అంగీలాగు కూడా గతిలేని వాళ్లు వెక్కిరించడమే… ఎన్ని, ఎన్నని… సాహిత్యం అంటే ఆ రెండున్నర జిల్లాలే, సంస్కృతి అంటే అవే… సినిమాలు, నవలలు, అధికారిక భాష, ఉన్నత కొలువులు, రాజకీయాలు, అధికారం, దోపిడీ… అన్నింటా…

Ads

ఈరోజుకూ అదే… ఇప్పటికీ ఈ గడ్డ మీద బతుకుతున్నా సరే అదే పెడపోకడ… బతికే మట్టిని అవమానించడం అలవాటే కదా… ఇక్కడేనా, అమెరికా వెళ్లినా అంతే కదా… అదే బలుపు, అదే ఏడుపు అనే పదాలు వాడటం ఎందుకులే గానీ…  మరీ పరుషంగా అనిపిస్తాయేమో… (నెట్‌లో బాగా చర్చ జరుగుతోంది)…

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి, రోమన్లకే చిర్రెక్కించి, తరిమేసేలా ఉండకూడదనే సోయి ఏమాత్రం లేని కేరక్టర్లు కొన్ని తగులుతూనే ఉంటాయి… వీడెవడో ‘సర్వ మతాభిమాని’ పోస్టు చూడండి…

తెలుగు

నిన్న యూట్యూబ్ స్టార్ నాగదుర్గ, హీరో ప్రియదర్శి నటించే ఓ సినిమాకు పూజ జరిగింది… సుకుమార్, బన్నీవాసు నిర్మాతలు. సహజంగానే మంచి వైబ్ క్రియేటైంది… అసలు ‘ఇడుపు కాయితం’ అనే టైటిలే అదిరిపోయింది… అంటే విడాకులు… అచ్చ తెలంగాణ పదం… ఇదుగో వాడెవడికో మండింది…

తెలంగాణ భాషలోనే చూడాలా, తెలుగులోకి డబ్ చేస్తారా అంటున్నాడు. సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హేపీ ఆంధ్రోళ్లం అంటున్నాడు. అందరూ ఇలాంటి మాడాలే అని సూత్రీకరించలేం గానీ… మరి ఏళ్లకేళ్లు మీ తెలుగు సినిమాల్ని చూస్తున్నాం, పోషిస్తున్నాం, తెలంగాణ భాషలోకి ఎన్ని డబ్ చేశారురా అంటూ ఇప్పుడు తెలంగాణ నెటిజనం నెట్ చర్చల్లో ఎక్కి దిగుతున్నారు…

ఇడుపు కాయితం

వీళ్లు మారరు, అస్సలు మారరు, మీ కాలిలో ముల్లు దిగితే నా పళ్లతో పీకుతా వంటి కేసీయార్ ఉదాసీనత, పొలిటికల్ బలహీనత, అవకాశవాదం ఇలాంటోళ్లకు మరింత అలుసిచ్చింది… అంతేనా..? ఆంధ్రావాలా భాగో అన్నవాడే వాళ్లను అలుముకున్నాడు. సెటిలర్ల వోట్ల కోసం… ఆ వోట్ల కోసం ఆంధ్రా నేతల విగ్రహాలు కూడా పెట్టుకుంటున్నాం…

అందుకే ఇదుగో… ఇలా తెలంగాణ భాష నుంచి తెలుగులోకి డబ్ చేయాలట… సబ్ టైటిళ్లు వేయాలట… వాడిది తెలుగు, తెలంగాణవాడిది తెలుగు కాదు.

ఈవీవీ అనే ప్యూర్ ఆంధ్రా దర్శకుడు అప్పట్లో ఇదే ఇడుపు కాయితం అనే అర్థమొచ్చే పక్కా ఆంధ్రా పదం మావిడాకులు అనే సినిమా తీస్తే… అదెందుకు తెలంగాణ భాషలోకి డబ్ చేయలేదురా అయ్యా, సరే, అప్పట్లో సబ్ ‌టైటిల్స్ సిస్టం లేదులే గానీ…

సినిమాల సంగతికే వద్దాం… తెలంగాణ పాట ఉండదు, భాష ఉండదు, కల్చర్ ఉండదు, తెలంగాణ పల్లె కథ ఉండదు ఈరోజుకూ… అయితే విలన్, లేదంటే కమెడియన్… అదే అదే ఆ రెండు ప్లస్ ఆ రెండున్నర జిల్లాల భాషను, కల్చర్‌ను, పెత్తనాల్ని ఈరోజుకూ రుద్దుతున్నారు… (అమెరికాలో కొన్నిచోట్ల అమెరికన్లు ఆగ్రహంతో ఉన్నారంటే అర్థమవుతోంది కదా)…

తెలంగాణను కాసేపు వదిలేద్దాం, ఉత్తరాంధ్ర భాషలో ఎంత సొగసు? రాయలసీమ యాసలో ఎంత విరుపు? మరి మీలో భాగమే కదా, వాటి మీద కూడా ఇదే వివక్ష కదా ఇన్నేళ్లు..! ఇప్పటికీ..! ఏళ్ల పోరాటం తరువాత కూడా ఆంధ్రోడితో అసలు ఇడుపు కాయితం కాలేదు అని ఓ నెటిజనుడి తీవ్ర వ్యాఖ్య… అక్షరసత్యం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఇడుపు కాయితం’ ఇచ్చి పన్నెండేళ్లయినా… అదే వెక్కిరింపులు!
  • సింగరాయ కొండకాడా… ఐటమ్ సాంగ్‌లో అర్చనా పూరన్‌సింగ్!
  • ఊహించిందే! మళ్లీ బీఆర్ఎస్ గాయిగత్తర! విషం తప్ప విజ్ఞత లేదు!
  • పేపర్ బాయ్ తలుపు తట్టిన చప్పుడు – నేనింకా బతికే ఉన్నాను…
  • మన్యం గర్భంలో మైనింగ్ మాఫియా – అల్లూరి చారిత్రక గుహలకే ఎసరు!
  • ‘ఉప్పొంగెలే గోదావరి- ఊగిందిలే చేలో వరి’ – వేటూరి మరో శబ్దగారడీ!
  • దయానాయక్ బయోపిక్! – వేలు పెట్టి వారం చెడగొట్టే రాంగోపాల్‌వర్మ!
  • Michael Jackson – రోజురోజుకీ నా పాలిటి ఓల్డ్ వైన్‌లా తయారయ్యాడు!
  • కొత్త FCRA రూల్స్ చూసి కొన్ని ఎన్జీఓలకు వణుకు- కేంద్రం కొరడా!
  • పెద్దరికానికి గౌరవం- అనుభవానికి గుర్తింపు- కావాలి, కానీ ఎలా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions