.
ఎస్, ఇగోలకు పోయి, ఆఫ్టరాల్ పదిహేనేళ్ల పోరడిని మాతో దీటుగా ఆడించుకోవాలా అనుకున్నారేమో మన ఇండియన టీ20 జట్టు క్రికెటర్లు… తోపులు… కానీ కాగితాలపైనే… అలా అనుకుని చివరకు చివరకు ఆ ఐర్లాండ్ జట్టు మీద అవమానకరంగా ఓడిపోయింది…
ఇజ్జత్ కచరా అంటారు దీన్నే… ఒక్క అభిషేక్ శర్మను వదిలేస్తే, అందరూ టపటపా ఏదో పనున్నట్టుగా వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ దారి పట్టారు, ఒక్కడూ ఒక మంచి షాట్ కొట్టింది లేదు… సరైన భాగస్వామ్యం లేదు, బాధ్యతాయుత బ్యాటింగు లేదు…
పేరుకు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే … ఒక్కడు కూడా కుదురుగా కుదురుకోలేదు క్రీజులో… వైభవ్ కోసమే జనం వచ్చారు స్టేడియానికి… సోనీ లివ్ వాడు కూడా మొదటి నుంచీ తన ఫోటో పెట్టి ప్రోమోస్ వదిలాడు…
Ads
తీరా చూస్తే తను లేడు జట్టులో… (జియో స్టార్ జియో స్టారే, ప్రత్యక్ష ప్రసారంలో సోనీ లివ్ అట్టర్ ఫ్లాప్)… నిజానికి ఐర్లాండ్ 51 పరుగులకు 4 వికెట్లు… ఆ స్థితి నుంచి 185 రన్స్ దాకా తీసుకుపోయారు… కారణం ఏమిటో తెలుసా..?
లూజ్ బాల్స్, పూర్ ఫీల్డింగ్, క్యాచ్ మిస్సులు… బాధ్యతారాహిత్యం… పేరుకే సర్పంచ్ సాబ్ (శ్రేయాస్ పేరు కెప్టెన్సీలో తోపు) పేలవమైన నాయకత్వం… అసలు ఇది ఓ అంతర్జాతీయ జట్టేనా అనిపించేలా ఉంది మన జట్టు ఆటతీరు…
బ్యాటింగుకు వచ్చాక మరీ దారుణం… ఏతావాతా తేలిందేమిటయ్యా అంటే, కాస్త జింబాబ్వే, వెస్టిండీస్ కాస్త దృష్టి పెట్టి, కాన్సంట్రేట్ చేస్తే ప్రస్తుత ఇండియా టీ20 జట్టును ఓడించొచ్చు… అత్యంత పరాభవకరంగా… ప్రస్తుతం ఐర్లాండ్‌తో అనుభవం ఇదే…
నిజానికి వైభవ్ లేడు అనేసరికి 60- 70 శాతం మంది మ్యాచ్ చూడటమే మానేశారు… తీరా చూసిన వాళ్లు భంగపడ్డారు… ఎస్, ఇది టీ20 క్రికెట్, ఎప్పుడు ఏమైనా జరగొచ్చు, కానీ మరీ ఇలాంటి మ్యాచ్ మాత్రం జరగొద్దు..!! మరీ 148 పరుగులకు, అదీ ఐర్లాండ్ మీద ఆలౌట్… అత్యంత సిగ్గుచేటు ఓటమి..!!
Share this Article