.
బన్నీ వాసు, సుకుమార్ నేతృత్వంలో ప్రియదర్శి, నాగదుర్గ నటించే కొత్త సినిమా ‘ఇడుపు కాయితం’ టైటిల్ రచ్చ ఇప్పట్లో ఆగడం లేదు… రకరకాల రంగులు పూసుకుంటూ, మళ్లీ ఆంధ్రా – తెలంగాణ నడుమ కయ్యం రేపుతోంది… సోషల్ మీడియాలో ఒకరిద్దరు మూర్ఖులు మొదలుపెట్టిన పెంట ఇది… ఎటెటో దారితీస్తోంది…
నిజానికి ఇదే ఇడుపు కాయితం గురించి ఏదో సెర్చుతుంటే తెలిసింది… ఈ టైటిల్ ఇదే తొలిసారి కాదు, రెండేళ్ల క్రితమే ఓ వెబ్ సీరీస్ ఇదే టైటిల్‌తో వచ్చింది, యూట్యూబ్‌లో ఫస్ట్ పార్ట్ కూడా కనిపిస్తోంది… ఎవరో కొత్త నటీనటులు… విలేజ్ పటాస్ అనే బ్యానర్ కింద తీసినట్టుంది… తెలంగాణ బ్యాక్ గ్రౌండే… పల్లె కథ…
Ads
హిట్టయిందో లేదో తెలియదు గానీ… ఫస్ట్ పార్ట్‌కు మాత్రం 1.79 లక్షల వ్యూస్ ఉన్నాయి… ఏడాది తరువాత వచ్చిన సెకండ్ పార్ట్‌కు 1.45 లక్షల వ్యూస్ కనిపించాయి… మూడో పార్ట్ ఉంటుందా, ఉందా లేదా తెలియదు గానీ… ఈ టైటిల్ మాది అని సదరు వెబ్ సీరీస్ నిర్మాణ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందా కొత్త సినిమాకు..? అలాంటి వార్తలు ఏమీ కనిపించలేదు…
మొన్న సినిమా పూజ సందర్భంగా బన్నీ వాసు కూడా దీనిపై క్లారిటీ ఏమీ ఇచ్చినట్టు లేదు… తరువాత టైటిల్ రచ్చ మీద మాట్లాడుతూ ఎక్కడో ‘టైటిల్ మార్చేది లేదు’ అన్నట్టు కూడా వార్తలొచ్చాయి… అవునూ, ఒక యూట్యూబ్ వీడియో లేదా ఒక వెబ్ సీరీస్ లేదా ఓ టీవీ సీరియల్ లేదా ఓ షార్ట్ ఫిలిమ్‌కు ఒక టైటిల్ పెట్టుకుంటే, ఆ టైటిల్ మీద ఓనర్‌షిప్ హక్కులు వస్తాయా..?
దాన్ని సినిమాకు ఇంకెవరైనా స్వేచ్ఛగా వాడుకోవచ్చా..? అసలు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ తతంగాలు ఎలా ఉంటాయో..? మొత్తానికి ఈ రచ్చ ఏమిటో గానీ… రాబోయే నాగదుర్గ సినిమాకు పూజ రోజే మస్తు ప్రచారం వచ్చింది… అసలు ఈ హైప్‌కు తగినట్టు సినిమా నాణ్యతతో తీయడం ఇప్పుడు వాళ్లకు అసలు పరీక్ష..!!
ఒకవేళ టైటిల్ మాది అని వెబ్ సీరీస్ వాళ్లు పేటెంట్ రైట్స్ మావి అని పంచాయితీకి వస్తే… కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు తలెత్తుతాయి…
1) సినిమాలకు టైటిల్ రిజిస్ట్రేషన్‌కు ఓ విధానం ఉంది. కానీ గతంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద అవే టైటిల్స్ ప్రసారంలో ఉండి ఉంటే పరిస్థితి ఏమిటి..? వాటికి ఉండే విలువ ఏమిటి..? డిజిటల్ నిర్మాతలు తమ టైటిల్స్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి? దానికి ఉండే చట్టబద్ధత ఎంత..?
2) సృజనాత్మకత vs పబ్లిక్ డొమైన్…: “ఇడుపు కాయితం” అనేది ఒక ప్రాంత యాసలో ఉన్న పదం. ఇటువంటి పదాలను ఎవరైనా తమ స్వంత ఆస్తిగా (Trademark) క్లెయిమ్ చేయవచ్చా? లేక అది భాషలో భాగమైన సాధారణ పదమా? అనే దానిపై న్యాయపరంగా పెద్ద చర్చ జరుగుతుంది.
3) ‘ప్రియర్ యూజ్’ (Prior Use) సిద్ధాంతం…: చట్టం ప్రకారం, ఒక పేరును మొదటగా ఎవరు ప్రజల్లోకి తీసుకువెళ్లారు (Prior Use) అనే దానికి విలువ ఉంటుంది. వెబ్ సిరీస్ నిర్మాతలు తమ కంటెంట్ రిలీజ్ తేదీలు, ఆ టైటిల్‌తో పొందిన వ్యూస్, సోషల్ మీడియా ట్రాక్షన్‌ను ఆధారాలుగా చూపిస్తే, అది గట్టి వాదన అవుతుంది.
4) కన్ఫ్యూజన్ (Likelihood of Confusion)…: కోర్టులో ప్రధానంగా అడిగే ప్రశ్న: “ఈ టైటిల్ వాడటం వల్ల సామాన్య ప్రేక్షకుడికి అసలు సినిమా ఏది? వెబ్ సిరీస్ ఏది? అని గందరగోళం ఏర్పడుతుందా?” అనేది. ఒకవేళ కన్ఫ్యూజన్ జరిగే అవకాశం ఉందంటే, కోర్టు గట్టిగానే స్పందిస్తుంది.
5) ఇండస్ట్రీకి ఒక పాఠం…: ఇప్పట్లో పెద్ద సినిమాలకు టైటిల్స్ రిజిస్టర్ చేసేటప్పుడు, కేవలం ఫిల్మ్ ఛాంబర్ డేటాబేస్ మాత్రమే కాకుండా, యూట్యూబ్ మరియు ఓటిటి (OTT) ప్లాట్‌ఫామ్‌లలో కూడా ‘ట్రేడ్ సెర్చ్’ చేయాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం స్పష్టం చేసే అవకాశం ఉంటుందా (వ్యవహారం కోర్టు దాకా వెళ్తే…?
Share this Article