Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వెలుగు వివేక్‌కు అభినందనలు – హరీష్ రావుకు ప్రత్యేక ప్రశంసలు

June 30, 2026 by M S R

.

ఆ ఎడిట్ పేజీ వ్యాసం చూడగానే ముందు సందేహం కలిగింది, తరువాత ఆశ్చర్యం… అది తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు రాసిన వ్యాసం… సింగరేణి దురవస్థ మీద రాసిన వ్యాసం… అందులో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వ పోకడలపైనా విమర్శలున్నాయి…

రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వివేక్ వెంకటస్వామి ఒక మంత్రి… అదే సింగరేణి ఏరియాలో తన రాజకీయం… తన కొడుకు వంశీక‌ృష్ణ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే చెందిన ఒక ఎంపీ… వాళ్ల సొంత పత్రిక వెలుగు… ఆ వెలుగులో ఈ వ్యాసం రావడంతో అవునూ, ఇది వెలుగేనా లేక మరో పత్రికా అని కాసేపు సందిగ్ధం, తరువాత పరిశీలిస్తే వెలుగు పత్రికే, డౌట్ లేదు… ఈరోజు వ్యాసమే…

Ads

ఇప్పుడు ఆశ్చర్యం… వివేక్ తండ్రి వెంకటస్వామి జీవితాంతం కాంగ్రెస్ జెండా మోసినవాడే… వివేక్ అటూఇటూ మారినా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే, పైగా ప్రభుత్వంలో మంత్రి, అదే సింగరేణిపై అదే హరీష్ రావు చేసే విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత, అవసరం ఉన్న నాయకుడే… తన కొడుకు కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధే… అందుకే వాళ్ల పత్రికలో వచ్చిన వ్యాసం మీద ఆశ్చర్యం…

సరే, పాత్రికేయ నిజనిష్పాక్షికతకు ఇది తార్కాణం అనుకుందాం… అలా అనుకోవాలనే ఆ వ్యాసం పబ్లిష్ చేశారనీ అనుకుందాం… ఆ నిష్పాక్షికతను గౌరవించే వివేక్‌నూ అభినందిద్దాం… తనను మించి ప్రత్యర్థుల మైకుల్లోనూ తన వాయిస్ వినిపించగల హరీష్ రావును మరింత అభినందిద్దాం… ప్రశంసిద్దాం…

velugu

ఎస్, ఇప్పుడు కావల్సింది ఇదే… తనకు మాలిన ధర్మం అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదిక…! వైసీపీ ఓనర్ జగన్ సొంత పత్రికలో, టీవీలో అప్పుడప్పుడైనా చంద్రబాబు వాయిస్ వినిపించాలి… తను ఏమైనా ఆర్టికల్స్ పంపిస్తే సరైన ప్రాధాన్యంతో ఎడిట్ పేజీల్లోనైనా ప్రచురించాలి… పాత పగలకు ఇక స్వస్తి, కనీసం సాక్షికి సంబంధించి…!

అంతేకాదు, తెల్లారిలేస్తే జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న యాంటీ-జగన్ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో ప్లస్ యెల్లో టీవీల్లో కూడా జగన్ వాయిస్ కూడా వినిపించాలి, చదివిచాలి .. తను పంపించే ఆర్టికల్స్ కూడా గౌరవంగా పబ్లిష్ చేయాలి… వెంకటకృష్ణ, సాంబ, మూర్తి, వంశీ తదితరుల టోన్ మారాలి… వైస్ వర్సా..!

అన్నింటికీ మించి రేవంత్ రెడ్డి క్యాంపు పంపించే ఆర్టికల్స్‌ను నమస్తే తెలంగాణ పబ్లిష్ చేయాలి, మరి తెలుగు మీడియా పాత్రికేయ నిష్పక్షపాతానికి ప్రతీక కదా… ‘వెలుగు- వివేక్- హరీష్’ సహృదయంతో ఆరంభించిన ఈ నిష్పాక్షిక పాత్రికేయ యజ్ఞం కొనసాగడానికి అందరూ తోడ్పడాలి… శుభం!!

https://www.v6velugu.com/harish-rao-alleges-massive-scams-in-singareni-under-congress-rule-demands-central-probe

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వెలుగు వివేక్‌కు అభినందనలు – హరీష్ రావుకు ప్రత్యేక ప్రశంసలు
  • SIR, భిక్షగాళ్లకు ఓట్లున్నాయా..? వారు ఓటు హక్కు‘అడుక్కోవడం’ ఎలా..?
  • 20 ఏళ్ల స్పీడ్- సక్సెస్‌ఫుల్ జర్నీ – మిడ్జిల్ జెడ్పీటీసీ నుంచి సీఎం కుర్చీ దాకా!!
  • సౌందర్య ఆ పాట ఒప్పడమే గొప్ప – ఈ దర్శకుడు పెద్ద ‘మాయలోడు!!
  • చెత్తా హీరోయిజం! ఆ డెలివరీ బాయ్ చెప్పు తీసి ఉంటే..?!
  • సెషెల్స్! అనంతసాగరంలో ఓ చుక్క! కానీ మనకు ఎందుకు కీలకం?
  • KCR పాలన మార్క్ అక్షర దుర్గతి – అక్షరాస్యతలో 31వ స్థానం !!
  • అడ్డగోలు రిజర్వేషన్ల కుదింపు- మమత మార్క్ మరో తప్పిదం దిద్దుబాటు?
  • సినిమా సెకండాఫ్ మొదలైంది – కథ ఇప్పుడే ఇక ఊపందుకుంది
  • అయోధ్య అసలు దొంగల గుట్టురట్టయింది ఎలాగంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions