.
ఎందుకోగానీ… బీజేపీ ఓల్డ్ సిటీ ఫైర్ బ్రాండ్ కొంపెల్ల మాధవీలత ఓ అరుదైన ఫీట్ సాధించడం మీడియాలో అంత ప్రముఖంగా ఎక్కడా కవర్ అయినట్టు కనిపించలేదు… ఆమె తెలుసు కదా, గత లోకసభ ఎన్నికల్లో మజ్లిస్ కోటలో బీజేపీ ఎంపీగా పోటీచేసింది ధైర్యంగా… ఒక మహిళ, అదీ కంప్లీట్ హిందూ భావజాలంతో… పైగా పలు వ్యాపారాలు ఉండి, ఓల్డ్ సిటీలోనే ఉంటూ!
అప్పుడప్పుడూ వార్తల్లోకి వస్తుంటుంది, ఇంటర్వ్యూల్లో కూడా పిచ్చి ప్రశ్నలు వేసి, ఆమె కౌంటర్లతో బిక్కమొహం వేసిన రిపోర్టర్లు, యూట్యూబర్లు ఎందరో! తాజాగా ఆమె 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది…
Ads
హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాట్స్ (SATS) షూటింగ్ రేంజ్లో నిర్వహించారు… 25 మీటర్ల పిస్టల్ (మాస్టర్స్ ఉమెన్) విభాగంలో బరిలోకి దిగిన మాధవీలత.. మొత్తం 300 పాయింట్లకు గాను 245 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది… స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది…
అబ్బే, ఇందులో విశేషం ఏముంది అంటారా..? ఆమె వయస్సు 51 ఏళ్లు… ఒక్కసారి ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాక, పలు వ్యాపారాల్లో నిమగ్నం అయ్యాక టైమ్ దొరకదు, అన్నింటికీ మించి తమ వ్యక్తిగత అభిరుచుల్ని వదిలేస్తుంటారు… కానీ ఆమె షూటింగు మీద తన ఆసక్తిని చంపుకోలేదు… పైగా పోటీపడి పతకం గెలిచింది… అదీ విశేషం…
మాధవీలతకు చిన్నతనం నుంచే షూటింగ్‌పై ఆసక్తి ఉంది. ఎన్సీసీ (NCC) కేడెట్‌గా ఉన్న రోజుల్లోనే ఆమెకు రైఫిల్ ప్రాక్టీస్‌పై అనుభవం ఉంది. తన కుడి భుజానికి లిగమెంట్ గాయం ఉన్నప్పటికీ, పట్టుదలతో సాధన చేసి ఈ పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం ఆమె రాబోయే ‘ప్రీ-నేషనల్ ఛాంపియన్షిప్స్’ కోసం సిద్ధమవుతోంది.
ఒక్కసారి ఆమె వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే… ఆమెకు షూటింగులోనే కాదు, శాస్త్రీయ నృత్యంలో ప్రవేశం ఉంది. గాయని, వైణికురాలు… సంతోష్‌నగర్‌లో పుట్టి,కోఠి మహిళా కళాశాల, నిజాం కాలేజీల్లో చదివిన ఆమె ముందుతరం ఆంధ్రా… పైగా చిరంజీవి, కృష్ణంరాజు, ప్రభాస్ స్వగ్రామం, పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరుతో ఆమెకు అనుబంధం… (వాళ్లు కాపులు, రాజులు, ఈమె బ్రాహ్మిణ్)…
తండ్రిది ఆ ఊరే… అంటే మాధవీలత పుట్టిల్లు… ఆమె భర్త కొంపెల్ల విశ్వనాథం కోనసీమకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రామక్రిష్ణ పరమహంస కుమారుడు… ఇంట్రస్టింగ్ బ్యాక్ గ్రౌండ్… పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ చేసిన ఆమె కంప్యూటర్ కోర్సులు కూడా చేసి ఆమె కొంతకాలం మధు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ పేరిట ఒక సంస్థను నడిపించింది…
భార్యాభర్తలిద్దరూ కలిసి విరించి హాస్పిటల్స్, వివో బయోటెక్, అమెరికాలో ‘క్యూ ఫండ్’ అనే ఫిన్ కార్ప్ సంస్థ… ఇలా వివిధ రంగాల్లో పలు సంస్థలు నిర్వహిస్తున్నారు… ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి… పేర్లు కూడా లోపాముద్ర, రామకృష్ణ పరమహంస, మోదిని… మాధవీలత సేవాట్రస్టు పేరు కూడా లోపాముద్ర ట్రస్టు…
లోపాముద్రను 9వ యేట వరకు బడికి పంపలేదు… మాధవీలత ఈమని ఇంటిపట్టునే చదివిపించేది… 14 ఏళ్ల ప్రాయంలోనే లోపాముద్ర ఏకంగా చెన్నై ప్రిస్టేజియస్ ఐఐటీలో సీటు సాధించింది… ఐఐటీలో ప్రవేశం పొందిన అతిపిన్న వయస్కురాలిగా నిలిచిపోయింది… కొడుకు రామకృష్ణ పరమహంస కూడా చెన్నై ఐఐటీలోనే సీటు సాధించాడు…
ఇన్ని బాధ్యతలు, యాక్టివ్, బిజీ లైఫ్ నడుమ కూడా ఆమె తన విద్యార్థి రోజులనాటి షూటింగుకు పదును పెట్టుకుని, ఏకంగా పతకం సాధించడం విశేషమే! అందుకే ఎప్పుడూ ఫైర్ అవుతూ ఉంటుంది తుపాకీ!!
Share this Article