.
( అజ్ఞాతి ) … ఈ మధ్యకాలంలో దర్శకులు 80 లు, 90 ల కథలను తీస్తున్నారు ఎందుకని …?! ఎందుకంటే, ఆ కాలంలో కొన్ని లాజిక్కులు పొసగవు, అదే క్రైమ్ కథలు అయితే ఎంచక్కా CCTV లు ఉండవు కాబట్టి, అలా ఎలా పారిపోయారు అలా ఎలా ఎవిడెన్సులు లేవు అని తొక్కలో ప్రశ్నలు మనం అడగం అడగలేము కనుక …!
ఈ డైరెక్టర్ మాత్రం చాలా తెలివైనవాడు…. మనం శిల్పకళా వేదికలోనో , కళాభారతిలోనో, సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలోనో ఒక నాటకాన్ని చూస్తున్నాం అనుకోండి … ఎలా వుంటుంది … అచ్చం అలా వుంటుంది ఇది … సినిమా బిగిన్ అయిన దగ్గర నుండి 32 నిముషాలు … అవును బ్రో, టోటల్ 32 నిముషాలు ఒక నాటకం చూస్తున్నట్లు … ఒకే ఫ్రేమ్! only wide frame… no mid, no close, no trolly shot, no crane shot… only wide shot .. అది కూడా ఒకే ఒక నటుడి నటవిశ్వరూపం …
Ads
నటుడికి periodical getup వేశారు, కథా కాలం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయిన కాలం…. అంత స్కీమ్ పెట్టావు బాసూ డైరెక్టర్ … నువ్వు తోపు … అంత పెట్టీ, అంత మహా నటుడిని పెట్టీ, ఆ మహా నటుడు కమలాసన్ కంటే గొప్ప గా నటించాడు అని చెప్పావు … కానీ ఒక్కటంటే ఒక్క tight close తియ్యలేదు, ఒక్క expression కూడా audience దగ్గరగా చూసే అవకాశం ఎందుకు ఇవ్వలేదు …?!
నాటకం నుండి సినిమా evolve అయింది అని ఎంత చక్కగా చూపించావ్ boss….!
ఈ 32 minutes చూసి తేరుకుంటే, అప్పుడు మీకు మిగతా సినిమా చూసే అర్హత వస్తుంది….
సినిమా కథ మూడు ముక్కల్లో – రావు బహదూర్ అనేవాడికి బుర్రలో అనుమానపు పురుగు దూరి తొలిచేస్తూ వుంటుంది … ఏమని ….?! వాడికి పుట్టిన ఇద్దరు కొడుకుల్లో రెండోవాడు రావు బహదూర్ పోలికలతో లేకపోవడం వల్ల వానికి పుట్టలేదు అనే పేద్ద డౌటనుమానం ….
ఇక్కడి నుండి మొదలై అదే బంగ్లాలో తిరిగి తిరిగి చివరికి కథ ఇక్కడికే వచ్చి చేరుతుంది….
ఈ మధ్యలో ఏమవుతుంది అని అడుగుతారా …
ఏమవుతుంది అంటే ఒక డాక్టర్, ఒక నర్సు, ఒక వంటావి,డ ఒక పోలీసు, ఒక ఫోరెన్సిక్ టీమ్, ఇద్దరు మగపిల్లలు వచ్చి పోతుంటారు ….
ఎక్కడికి వచ్చిపోతారు అని అడుగుతారా …?!
కథలోకి కాదు, రావుబహదూర్ బంగ్లాలోకి….
అన్నట్లు మధ్య మధ్యలో మన డైరెక్టర్ కూడా రావు బహదూర్ తాత గెటప్ లో వచ్చి పోకుండా, డాన్స్ కూడా చేస్తుంటాడు ….
డైరెక్టర్ ఒక రావు బహదూర్ బుర్రలో పురుగు దూరి తన కొడుకు అనుకునే పిల్లవాడు తనకి పుట్టలేదు అనుకున్నప్పుడు కథ ఎటువెళుతుంది …?!
సాధారణంగా తన భార్య వైపు వెళుతుంది. భార్యను నిలదీయ్యడం, ఆమెకు ప్రియులు ఎవరు అని ఆరా తియ్యడం, వెతికి పట్టుకోడం వంటివి ఉంటాయి. కానీ ఈ మహా మూవీలో అలాంటిది ఏం వుండదు. భార్య ఆవిడ మానాన ఆవిడ room లోకి పోయి self house arrest చేసుకుంటుంది.
రావు బహదూర్ కూడా రకరకాలుగా ఆలోచించి, ఆ కొడుకు తనవాడా కాదా అని నిరూపించుకోడానికి చేసిన చిత్రవిచిత్ర చేష్టలతో నిండిపోయింది మొత్తం సినిమా …!
‘వారసుడు’ తన అంశ కాకున్నా వంశాభివృద్ధి జరిగింది అని సంతోషించి ‘వంశం వంశం’ అని చంకలు గుద్దుకుంటాడు అని satirical గా చెప్పాడు. indirect గా మన పూర్వీకులెవరూ legitimate పిల్లలు కారు, మీరు గొప్ప వంశీకులు అని చొక్కాలు చించుకోకండి, వంశం ఎప్పుడో సంకరీకరింపబడింది అని నొక్కి వక్కాణించాడు….!
ఇంక మిగతా విషయాలు …. production values అస్సలు లేవు … మొత్తం సినిమా ఒక పాడుబడ్డ బంగళాలో ఒక రూమ్ లో తీసేశారు. మధ్యలో ఒక park, ఒక pond, ఒక boat లాంటివి వచ్చిపోతాయి…
రావుబహాదూర్ గా నటించించిన సత్య దేవ్, పోలీస్ గా నటించిన ఆనంద్ తప్ప మనకి ఒక్కరంటే ఒక్క actor తెలియదు, మనం గుర్తుపట్టము. పాత్రలు మాట్లాడే భాష కూడా ఎవరు ఎలాంటి మాండలికం/ యాస మాట్లాడుతారో వాళ్ళకే కాదు director కి కూడా తెలియదు. ఒక ప్రాంతపు కథ, ఒక మాండలికం అని fix అవ్వకుండా ఏరోజుకు ఆరోజు తోచినట్లు dialogues రాసుకున్నారు.
music గానీ background score గానీ పాటలు గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బాగాలేవు… కథాపరంగా 1950- 60 times అయినప్పుడు అలాంటి music వుండటంలో తప్పు లేదు … కానీ సురభి నాటకాల వారి music ఎత్తుకొచ్చి పెట్టుకున్నట్లు వుంది… మరి దర్శకుని ఉద్దేశం ఏంటో, అసలు ఆ ప్రొడ్యూసర్ల ఉద్దేశం ఏంటో….?!
ఇక కొన్నిచోట్ల వాడిన VFX గానీ special effects గురించి మాత్రం మాట్లాడుకోకుండా వుండటం మంచిది.
అనేకానేక press meets లో cinema team, హీరో సత్య దేవ్ ఊదరగొట్టినట్లు ఇది ఒక కళాఖండమా అంటే …ఏమో మరి …ఇంతోటి visual feast, movie experiance కి superstar GMB సపోర్ట్ చెయ్యడం వెనక భావం ఏంటో ఆయన్నే అడగాలి….
చూడబోతే ఈ దర్శకునికి ‘వంశాల’ మీద చాలా కసి వున్నట్లుంది …
కథ ఎలాగున్నా మిగతా విషయాలకు వస్తే దర్శకుడు plot, sub-plot, method acting, mime acting, surrealism, psychological drama లాంటి గొప్పగొప్ప మాటలు ప్రెస్ మీట్స్ లో చెప్పాడు గానీ … తెర మీద చూపించింది మాత్రం మనకు మూడున్నర గంటల psychological trauma …!!
Share this Article