Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆరుగురూ ఆరుగురే! అసలు జాతీయ ఉత్తమ అవార్డు విజేత ఎవరో!!

July 6, 2026 by M S R

.

నిజమే, ఆసక్తికరమైన చర్చ… ఈసారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎవరిని వరిస్తుంది..? నిజానికి చాలా లెక్కలుంటాయి, అవి నటనను దాటేసి ఉంటాయి… కేంద్ర పెద్దల రాగద్వేషాలు పనిచేస్తాయి ప్రధానంగా… పైరవీలు, సిఫారసులు గట్రా బోలెడు… ఐనా ఎన్ని నెగెటివ్  కోణాలున్నా సరే జాతీయ అవార్డుకున్న విలువ గొప్పదే…

ఈసారి చర్చ దేనికంటే..? ఈసారి పోటీలో చాలామంది ఉన్నారు… తమ నటను ప్రూవ్ చేసుకునేే సినిమాలు దక్కాయి వాళ్లకు… ఎవరికివారే ఇరగదీశారు… త్వరలో జాతీయ అవార్డుల ప్రకటన రాబోతోంది 2024 సినిమాలకు సంబంధించి… ఛావా,విక్కీ కౌశల్, దురంధర్ రణబీర్ సింగ్ 2025 జాబితాలోకి వస్తారేమో, లేకపోతే పోటీ ఇంకా తీవ్రంగా ఉండేది…

Ads

పుష్ప -2 నుండి అల్లు అర్జున్… రాయన్ నుండి ధనుష్… ఆడు జీవితం నుండి పృథ్వి రాజ్ సుకుమారన్ … సత్యం సుందరం నుండి కార్తి… మహారాజా నుండి విజయ్ సేతుపతి… లక్కీ భాస్కర్ నుండి దుల్కర్…

national award
2022 కు గాను పుష్ప సినిమాలో నటనకి అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చింది… పుష్ప 2 లో కూడా బాగా చేశాడు… ముఖ్యంగా అమ్మవారి గెటప్‌లో చీరతో చేసిన ఎపిసోడ్‌లో పీక్‌లో ఉంటుంది యాక్టింగ్.. కానీ రెండోసారి కష్టం, సో, అల్లు అర్జున్‌కి అవకాశం ఉండకపోవచ్చునేమో… ఐనా చెప్పలేం, అల్లు అరవింద్ ప్రభావం మామూలుది కాదు మరి…

ధనుష్ గొప్ప నటుడే… రాయన్ సినిమా తన దర్శకత్వంలోనే తీశాడు… కానీ ఈ పోటీలో నెగ్గుకొస్తాడనేది సందేహమే… నటన బాగుంది, పోటీలో నిలబడే రేంజ్ అయితే కాదు… సత్యం సుందరంలో కార్తి బాగానే చేసాడు… పాత్ర కూడా గొప్పది…

మహారాజా కూడా దర్శకుడి సినిమా… విజయ్ సేతుపతి కూడా తన నటనతో అదరగొట్టాడు… లక్కీ భాస్కర్‌లో దుల్కర్ బాగానే చేసినా మరీ ఈ పోటీలో నిలబడే రేంజ్ అయితే కాదనిపిస్తుంది… ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం ఓ రేంజ్ నటన… ఒక నటుడు ఓ పాత్రలోకి దూరిపోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు…

ఆ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్.. తెలుగులో ఎందుకో జనం చూడలేదు… తెలుగు ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు… ఓటీటీలో చూసినవారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చదివి వాళ్లు కూడా ఓటీటీలోనే చూశారు… అంతేతప్ప థియేటరికల్ ఫ్లాప్…

పదేళ్లు కష్టపడి ఓ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా నిజానికి ప్రభావశీలమైంది… కేరళ జీవితాలు ప్రధానంగా విదేశాల్లో పొట్టపోసుకునేవారితో, ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్‌తో ముడిపడి ఉంటాయి… సో, వాళ్లను ఇలాంటి పాత్రలు కనెక్ట్ అవుతాయి… పాత్రకు తగినట్టు హీరో పూర్తిగా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు… అది అంత సులభం కాదు, కానీ పృథ్వీరాజ్ దాన్ని సాధించాడు…

డిక్షన్ నుంచి బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ దాకా బాగా చేశాడు… నిష్పాక్షికంగా చెప్పాలంటే ఈసారి జాతీయ ఉత్తమ నటుడి పోటీలో అందరికన్నా బలమైన పోటీదారు పృథ్వీరాజే… ఈసారి పోటీలో నార్త్ హీరోలు ఎవరూ లేకపోవడం మన సౌత్ హీరోలకు ఓ పెద్ద రిలీఫ్ కూడా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆరుగురూ ఆరుగురే! అసలు జాతీయ ఉత్తమ అవార్డు విజేత ఎవరో!!
  • రావణ్‌పై రాజద్రోహం సెక్షన్? ప్రకాశ్‌రాజ్‌నూ బుక్ చేస్తారా?
  • ఆ రోడ్డు పక్కన… ఆ కారును కేసీఆర్ ఎందుకు ఆపినట్టు ఆ అర్థరాత్రి వేళ!?
  • ప్రజాస్వామ్యం ఎప్పుడైనా ఆపదలో పడితే మళ్లీ వస్తా :: చిరంజీవి
  • అశ్విని! వెండితెర వెలుగు తార- విధి నాటకంలో రాలిపోయింది!!
  • తవ్వేకొద్దీ వందల కోట్ల అవినీతి అనకొండలు! ఈ పాపం ఎవరిది ‘బాపూ’?!
  • నిరుద్యోగులు పొలిటికల్ పార్టీల ట్రాపుల్లో చిక్కితే- వాళ్లకే నష్టం!!
  • దేశమంతా కదిలింది – బంగారం పోగేసింది – జాతి రుణవిముక్తి !!
  • ఈమె గుర్తుందా? అందరూ బాగున్నారు- కానీ ఈమె ఏమైపోయింది?
  • నమ్మలేని ‘న్యాయం’ – ఎంత మంచివాడవురా, ఎన్నినోళ్ల పొగుడుదురా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions