.
ముందుగా ఒక వార్త… ‘‘ఏమన్నా ఙ్ఞానముందా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఎంపీ ఈటల రాజేందర్..! కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అంటూ చేస్తున్న విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల..! కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదు..!
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయి… ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారు అనడానికి కొద్దిగానైనా జ్ఞానం ఉండాలి..!
Ads
కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నెల్స్, మోటార్లు ఇలా అనేకం ఉన్నాయని ఈటల అన్నారు..!’’
….. కావచ్చు, కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఈయన గారు ఆర్థిక మంత్రి (2014 నుంచి 2018)… కేసీయార్ ఆదేశించడం, ఈయన ఎడాపెడా నిధులు ఇచ్చేయడం..! కేబినెట్ ఆమోదాలు, నిశిత పరిశీలనలు, ప్రజాప్రయోజనాల సమీక్షలు గట్రా ఏమీ ఉండేవి కాదు కదా… పెద్ద దొర శాటిలైట్ ఫోటోల మీద అడ్డంగా గీతలు గీస్తే అవే బరాజులు…
నాటి కేబినెట్ కీలక సభ్యుడిగా ఈటల కూడా జిమ్మేదార్… అందుకే కాళేశ్వరం కమిషన్ విచారణలోనూ అటూఇటూ కాని జవాబులు… సరే, ఇవన్నీ వోకే, అప్పుడంటే దొరవారి గుమస్తా… కానీ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కదా… మరెందుకు అచ్చంగా హరీష్ రావులాగా మాట్లాడటం… కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు అనడం!!
ఆ ప్రాజెక్టు సిట్యుయేషన్ ఏమీ తెలియకుండానే కన్నెపల్లి పంపుల్ని నడిపి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేయడం… ఎక్కడికి ఎత్తిపోయాలో, ఎత్తిపోయాలన్నా సరే, ఏ బరాజులో ఎంత మినిమం డ్రాలెవల్ ఉండాలో కూడా తెలియకపోవడం… అయ్యా, ఈటల గారూ… తమరు కూడా సబ్జెక్టు తెలియకుండా మాట్లాడటం ఏమిటి..? పాత ప్రోగ్రెసివ్‌నెస్ ఎక్కడో దెబ్బతినిపోయినట్టుంది!!
అయ్యా, సారూ, మీ కేంద్ర జలశాఖ మంత్రి సాక్షాత్తూ పార్లమెంటులో చెప్పాడు, లక్ష కోట్లు గోదాట్లో పోశారని! నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఆ పార్టీ హెడ్, ప్రధాని మోదీ చెప్పాడు, కాళేశ్వరం ఓ ఏటీఎం అని… నంబర్ టూ అమిత్ షా చెప్పాడు… మీ రాష్ట్ర సహచరులు కూడా చెప్పారు… సీబీఐ కావాలన్నారు, సరే, అది దిక్కూదివాణం లేకుండా పోయింది, అది వేరే సంగతి…
అంటే, లక్ష కోట్ల అవినీతి కాదు, ఏమైనా జ్ఞానముందా, ఏమిటీ ఆరోపణలు అని ఎవరిని ఆక్షేపిస్తున్నావు మాజీ కామ్రేడ్..? మీ కాషాయం క్యాంపుకే జ్ఞానం లేదని తిడుతున్నట్టా..? లేక కాషాయం మళ్లీ గులాబీ రంగులోకి రంగు మార్చుకుంటోందా..? ఏదో తేడా కొడుతోంది… దొర క్రూర చూపుల నుంచి తప్పించుకోవడానికి, బీజేపీలోకి రక్షణ కోసం వస్తే… అసలు బీజేపీలో అనుకున్నట్టు సాగక, ఊపిరాడటం లేదనే ఫ్రస్ట్రేషనా ఇది..?
అన్నట్టు… రేప్పొద్దున బీజేపీ, బీఆర్ఎస్ విలీనమో, పొత్తో, అవగాహనో కుదిరితే ఈటల పరిస్థితి ఏమిటి..?
Share this Article