.
మనం నిన్న ఓ సినిమా గురించి చెప్పుకున్నాం… మన వ్యవసాయరంగంలో విచ్చలవిడిగా వాడుతున్న ప్రమాదకరమైన రసాయనాల మన జీవితాల్ని ఎలా కల్లోలితం చేస్తున్నాయో చెప్పే సినిమా అది… రావల్సి ఉంది… దాని పేరు The India Story, slow poison in progress … ఇదీ ఆ లింకు…
దాన్ని అడ్డుకోవడానికి అగ్రి కెమికల్స్ మాఫియా ఆల్రెడీ రంగంలోకి దిగిన సంగతీ చెప్పుకున్నాం, అంతేకాదు, పారాక్వాట్ డైక్లోరైడ్ అనే కలుపుమందు మీద ఆందోళనను కూడా చెప్పుకున్నాం… కేరళ, ఒడిశా, ఏపీ, తెలంగాణ దాని అమ్మకాలపై నిషేధం పెట్టాయి కూడా… కానీ మన ఇన్సెక్టిసైడ్ యాక్ట్ ప్రకారం 60 రోజులకు మించి రాష్ట్రాలు ఆంక్షలు విధించలేవు, అందుకని కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి…
Ads
70 దేశాలు ఆ రసాయన వాడకాన్ని నిషేధించినా, ఆల్రెడీ నాలుగు రాష్ట్రాలు నిషేధం విధించినా… మేధావులు, పర్యావరణవేత్తల నుంచి ఎంత బలమైన డిమాండ్లు వస్తున్నా సరే, మోదీ ప్రభుత్వంలో కదలిక లేదనీ చెప్పుకున్నాం కదా…
కానీ, ఆ దిశలో ఇప్పుడు ఒక అడుగు పడింది… పారాక్వాట్ నిషేధంపై కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది… ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఎంపీ డాక్టర్ కడియం కావ్య … ‘‘రైతుల ప్రాణాలను కాపాడడంతో పాటు భూసారం, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నిర్ణయం కీలక మలుపుగా నిలుస్తుందని’’ హర్షం వ్యక్తం చేసింది…
ఈ కలుపు మందు నిషేధంపై ఆమె కొన్నాళ్లుగా ఒత్తిడి తీసుకొస్తోంది కూడా..! గత పార్లమెంట్ సమావేశాల్లో మార్చి 27, 2026న లోక్సభలో ఈ అంశాన్ని లేవనెత్తింది… కేంద్ర ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పించింది…

ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పారాక్వాట్ డైక్లోరైడ్పై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పారాక్వాట్ డైక్లోరైడ్ దిగుమతి, తయారీ, విక్రయం, రవాణా, పంపిణీ, వినియోగంపై నిషేధం అమలుకు ఉద్దేశించిన నోటిఫికేషన్ ఇది…
జూలై 13, 2026 నుంచి 30 రోజులపాటు ఈ ముసాయిదా నోటిఫికేషన్ మీద అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం తుది నోటిఫికేషన్ జారీ కానుంది…!!
Share this Article