Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ భాషల్లోని గొప్ప గాయకులనూ మరిపించిన ఈమె ఉచ్చారణ !!

July 15, 2026 by M S R

.

1977 లో వచ్చిన ‘అఙ్‌గీకారమ్’ అన్న సినిమాలో జానకి పాడిన పాట “నీల జలాశయత్తిల్ హంసఙ్‌గళ్…” ఎ.టీ. ఉమర్ సంగీతం చేసిన పాట. చాల మంచి సంగీతం చేశారు ఉమర్.

మలయాళం పాటల flavour మన తెలుగు పాటలకు బాగా భిన్నమైంది. నిజం చెబితే నిష్ఠూరమే కదా? అందుకనే ఈసారికి చెప్పవచ్చిన ఆ నిజాన్ని అదేనండి,  70వ దశాబ్ది తెలుగు పాట గురించి చెప్పకుండా దాటవేస్తున్నాను. రసజ్ఞులైన తెలుగు వాళ్లు (తెలుగులో రసజ్ఞులైన వారూ ఉన్నారని నాకు బాగా తెలుసు) ప్రస్తుతానికి నన్ను క్షమించండి.

Ads

  • మలయాళం పాట అంటే జానకికి ఎందుకో అంత అభినివేశం? జానకి మలయాళం భాషను, పాటను అత్యుదాత్తతతో పాడతారు. ఆమె మలయాళం డిక్షన్ మలయాళీయులకే అందని సౌందర్యం.

ఈ పాటను ఏసుదాస్ కూడా పాడారు. ఆయన కూడా బాగా పాడారు. కానీ ఆయన జానకి పాడినంత గొప్పగా పాడలేకపోయారు. భాష దగ్గర నుంచీ అన్ని అంశాల పరంగానూ జానకి గొప్పగా నిలిచారు. ఎన్నో గొప్ప మలయాళం పాటలు పాడారు జానకి వాటిల్లో ఒకటి ఈ “నీల జలాశయత్తిల్ హంసఙ్‌గళ్…”

తెలుగు వారు ఒక్క ఐదు నిమిషాలసేపైనా తమ తెలుగు తనాన్ని పక్కన పెట్టి ఈ పాటను వినాల్సి ఉంటుందేమో? ఎందుకంటే … నిజం చెబితే నిష్ఠూరంగానే ఉంటుంది… ఈసారికి నిజం చెప్పకూడదనుకున్నాను కాబట్టి ఎందుకంటేకు వివరణ ఇవ్వడం లేదు. నన్ను పూర్తిగా మినహాయించుకుని ఇదిగో ఈ జానకి గొప్ప గానాన్ని ఆస్వాదించండి.


జానకి గానం ముందు విద్వత్ నిలబడలేదు…
——————–
అదేమిటో జానకి తెలుగులోకన్నా మలయాళం, కన్నడం, తమిళ్ష్‌లో గొప్పగా పాడారు; గొప్ప పాటలు పాడారు. జానకి మలయాళం ఉచ్చారణ చాల గొప్పగా ఉంటుంది. మలయాళం ఉచ్చారణ మామూలు విషయం కాదు. అలాంటి మలయాళంను జానకి మలయాళం గాయకులన్నా గొప్పగా పాడారు.

జానకి హిందీలో కూడా దేశమంతా ధ్వనించిన హిట్స్ పాడారు. బప్పీలహరీ, ఆర్.డీ. బర్మన్, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీతంలో జానకి హిందీ హిట్స్ ఉన్నాయి. బాలాజీ! ఓ బాలాజీ! పేరుతో స్వీయ సంగీతంలో ఒక భజన్స్ ఆల్బమ్ విడుదల చేశారు జానకి.

జానకి హిందీ ఉచ్చారణ, హిందీ గానం చాల గొప్పగా ఉంటాయి. జానకితో ఒక తమిళ్ష్‌ సినిమాలో ఇళైయరాజా  రెండు హిందీ పాటలు పాడించారు.

1981లో విడుదలైన ‘నణ్డు’ తమిళ్ష్ సినిమా కోసం ఒక హిందీ ‘ముజ్‌రా’ను చేశారు ఇళైయరాజా.
ముజ్‌రా అన్నది రాజుల ఆస్థానాల్లో, మెహ్‌ఫిళ్లలో సాయంత్రాలలో అతిథులకు నమస్కరిస్తూ, అతిథులను అభినందిస్తూ, ఆకర్షిస్తూ స్త్రీలు పాడే పాట. ముస్లీమ్ రాజుల కాలంలో మన దేశంలో ఈ ధోరణి (genre) మొదలైంది.

సంగీతపరంగా హిందూస్థానీ ఛాయలతో ఉంటుంది ముజ్‌రా. ముఖ్యంగా తబలా వాద్య ప్రయోగం విశేషంగానూ, ప్రధానంగానూ ఉంటుంది. Semi Qawwali లాగానూ ఉంటుంది ముజ్‌రా. ఉత్తరాదికి, హిందీ సినిమాకు ముజ్‌రా బాగా అలవాటైన విధానం. హిందీ సినిమాలో ముజ్‌రాలు చెప్పుకోతగ్గ స్థాయిలో ఉన్నాయి.

నణ్డు సినిమా కోసం ఇళైయరాజా ఒక మంచి ముజ్‌రా చేశారు. తబలా వాద్య నిర్మాణం, బాణి, phrase progression పరంగా హిందూస్థానీ సంగీతం ఛాయతో ప్రతిభావంతంగా ఇళైయరాజా ఈ ముజ్‌రా చేశారు. ఎస్. జానకి పాడారు. ఈ హిందీ ముజ్‌రాను పీ.బీ. శ్రీనివాస్ రాశారు. వినండి…


ఈ నణ్డు సినిమాలో ఇళైయరాజా మఱొక హిందీ పాట “కైసే కహూన్ కుచ్ కెహ్ నా సకున్…” ను చేశారు. భూపీందర్, ఎస్. జానకి పాడారు. పీ.బీ. శ్రీనివాస్ ఆ హిందీ పాటను కూడా రాశారు. చాల మంచి పాట. ఇళైయరాజా గొప్ప సంగీతజ్ఞతతో, గొప్ప సృజనాత్మకతతో, గొప్ప flavour and flairతో ఈ పాటను చేశారు.

భూపీందర్ ఒక గజల్ గాయకుడిగా దేశ ప్రసిద్ధం. గొప్ప విద్వత్ ఉన్న వారు భూపీందర్. ఆ భూపీందర్ ఈ పాటలో జానకి గానం ముందు తేలిపోయారు! చాల గొప్ప విషయం ఇది. ఈ “కైసే కహూన్ కుచ్ కెహ్ నా సకున్…” పాటలో జానకి rounded even singing, balance, expression, mood, స్వరసమం ముందు భూపీందర్ విద్వత్ నిలబడలేదు. జానకి ‘పలుకు’ చాల గొప్పగా ఉంటుంది ఈ పాటలో….
విందాం రండి…
రోచిష్మాన్
9444012279

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ భాషల్లోని గొప్ప గాయకులనూ మరిపించిన ఈమె ఉచ్చారణ !!
  • రిటైర్డ్ ఇంజినీర్లు – BRS కవర్ సంఘాలు! మేడిగడ్డపై క్షుద్ర పన్నాగాలు!!
  • IKKA – దర్శకుడు పర్లేదు… ఎటొచ్చీ ఆ నలుగురి నటనే నాసిరకం !!
  • కుటుంబం విచ్ఛిన్నమవుతోంది ! పసి మనస్సులపై దారుణ ప్రభావం !!
  • పక్క సీటులో ప్రఖ్యాత అందగత్తె – సో వాట్, నా బాధల్లో నేను…
  • ఆ నిత్యహారతి ప్రోటోకాల్ ఎప్పుడో రద్దు చేసి ఉండాల్సింది !!
  • తీయాల్సిన సినిమాయే ! కానీ అప్పుడే రిలీజును అడ్డుకుంటున్నారు !!
  • జూనియర్ ఊగిసలాట ! – ఏపీ సీఎం లక్ష్మిప్రణతి ? రెండూ వేర్వేరు !!
  • ఇప్పుడంటే జబర్దస్త్ టేస్ట్ గానీ… అప్పట్లో మల్లెమాల అంటే ఓ చరిత్ర !!
  • అర్జెంటీనా Vs ఇంగ్లండ్ … Ind -Pak క్రికెట్‌ను మించి ఎన్నో రెట్ల వైరం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions