Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీఆర్ఎస్! పంపు హౌజులపై పొంతన లేని వితండ వాదనలు!!

July 15, 2026 by M S R

.

ఈ గులాబీ క్యాంపు ధోరణే అది… ఒకే రోజు, ఒకే తీరు అంశాలపై, రెండు పరస్పర విరుద్ధ ధోరణులతో మాట్లాడగలదు… ఓ ఫిక్స్‌డ్ పొలిటికల్ లైన్ అంటూ ఏమీ ఉండదు… ఆ సమయానికి ఏది తోస్తే అది రచ్చ చేసే ప్రయత్నమే… పాపం, దొరవారు… దశ నిర్దేశం లేదు, దిశ నిర్ధారణా లేదు…

ఉదాహరణకు… ఈరోజు నమస్తే తెలంగాణ అలియాస్ కేసీయార్ మౌత్ పీస్ ఫస్ట్ పేజీ బ్యానర్ చూద్దాం… ‘సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్’ ఇదీ హెడింగ్… విషయం ఏమిటయ్యా అంటే…, ‘‘కేసీయార్ కట్టిన పాలమూరు ప్రాజెక్టు, నార్లాపూర్ పంప్ హౌజ్ మోటారు వెట్ రన్ ప్రారంభించాడు రేవంత్ రెడ్డి. మొన్ననే కదా, నీళ్లు ఎత్తి ఎక్కడ పోయాలె అన్నాడు, బీఆర్ఎస్ ఉద్యమంతో తలవంచి ఇక నార్లాపూర్ పంపులు ఆన్ చేశాడు… కేసీయార్ కట్టాడు కదాని రాజకీయ కక్షతో, భేషజంతో రెండున్నరేళ్లు పఢావు పెట్టాడు’’ అని స్థూలంగా ఆ కథనం సారాంశం…

Ads

1) కేసీయార్ కడితే ఇక ఆ ప్రాజెక్టును పఢావు పెట్టాలా..? అది కేసీయార్ సొంత డబ్బు కాదు, తెలంగాణ సమాజం సొమ్ము… 2) కాళేశ్వరం కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయాలనే గత్తరకు ముందే రేవంత్ రెడ్డి అధికారులన్ని ఆదేశించాడు, ఈ నార్లాపూర్ పంపుల్ని నడిపించాలి అని… 3) కాళేశ్వరం కనెపల్లి పంప్ హౌజ్ కథ వేరు- ఈ నార్లాపూర్ కథ వేరు… 4) నీళ్లు ఎత్తి ఎక్కడ పోయాలె అన్నది కన్నెపల్లి పంప్ హౌజ్ గురించి, అంతేగానీ ఈ నార్లాపూర్ గురించి కాదు… (అన్నీ కలగలిపి ఏదేదో గందరగోళాన్ని క్రియేట్ చేయడం ఇది)…

5) కన్నెపల్లి పంప్ హౌజ్ నీటిని ఎత్తిపోయకపోవడానికి రాజకీయ కక్ష కారణం, కేసీయార్ కట్టాడు కాబట్టి ఉపయోగించకూడదనే భేషజమే నిజమైతే… మరి అదే కేసీయార్ కట్టిన నార్లాపూర్ ఎందుకు స్టార్ట్ చేసినట్టు..? సో, ఈ రాజకీయ భేషజాలు, కక్షలు, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాలు అనే బీఆర్ఎస్ వాదన ఉత్తదే అని తేలిపోయినట్టే కదా… 6) ఇదే కాదు, ఏ సమస్యా లేదు కాబట్టే, అదే గోదావరి నుంచి దేవాదుల నీటిని ఎత్తిపోస్తున్నారు కదా… నార్లాపూర్‌లోని ఇతర మోటార్లను వారం రోజుల్లో రన్ చేయబోతున్నారు కూడా!

7) బీఆర్ఎస్ మేధావులు చెప్పినట్టు ప్రభుత్వం రాజకీయ కోణంలో నడవదు, ఇంజినీర్లు, కేంద్ర సంస్థల నిర్దేశాలను బట్టి, అనుకూలతలు- ప్రతికూలతల్ని లెక్కించి, ఆచితూచి వ్యవహరిస్తుంది… 8) రేప్పొద్దున మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల కూడా తస్కితే అప్పుడెవరు జవాబుదారీ..? 9) అడిగేవాడిది ఏం పోయింది..? జాగ్రత్తగా రన్ చేయలేదు, నిర్లక్ష్యం, రేవంత్ రెడ్డే కారకుడు అని మళ్లీ ప్రాపగాండా చేయొచ్చు అనేనా..? 10) కౌశిక్ రెడ్డి అంటున్నాడు, ఏమైనా జరిగితే 28 మందిమీ రాజీనామా చేస్తాం అని… తనే పార్టీ అధినేత కేసీయార్ అయినట్టు, ఉపఅధినేత కేటీయార్ అయినట్టు… ఉపోప అధినేత హరీష్ రావు అయినట్టు!!



నమస్తే



సింపుల్… ఈ పొలిటికల్ ఎజెండాతో నడిచే రిటైర్డ్ ఇంజినీర్ల సంఘాలు, కవర్ సంఘాలుగా పనిచేసే జర్నలిస్టు సంఘాలు ఎట్సెట్రా ఏమంటున్నాయనేది వదిలేస్తే… ఎల్లంపల్లిలోకి గోదావరి వరదనీరు చేరితే, ఆ నీటిని పంప్ చేసి, రిజర్వాయర్లు నింపితే… అన్ని బురద మాటలు, వరద మాటలు బంద్ అవుతాయి… దానికోసం వెయిట్ చేయడమే… అప్పటివరకు ‘కేసీయార్ కట్టాడు, రేవంత్ పఢావుపెట్టాడు’ వంటి విమర్శలు వస్తూనే ఉంటాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బీఆర్ఎస్! పంపు హౌజులపై పొంతన లేని వితండ వాదనలు!!
  • ప్రాణాలు తీస్తున్న ఈ కలుపు మందుపై జాతీయ నిషేధం !!
  • తస్లీమా! మమత తరిమేసింది- సువేందు రమ్మంటున్నాడు !!
  • కాంగ్రెస్‌పై ప్రవాస భారతీయుల రుసరుస! పవన్ ఖేరా నిర్వాకం !!
  • తోపులు ఫెయిలైనా… అక్షర్ పటేల్ గెలిపించి, పరువు నిలిపాడు !
  • ఆ భాషల్లోని గొప్ప గాయకులనూ మరిపించిన ఈమె ఉచ్చారణ !!
  • రిటైర్డ్ ఇంజినీర్లు – BRS కవర్ సంఘాలు! మేడిగడ్డపై క్షుద్ర పన్నాగాలు!!
  • IKKA – దర్శకుడు పర్లేదు… ఎటొచ్చీ ఆ నలుగురి నటనే నాసిరకం !!
  • కుటుంబం విచ్ఛిన్నమవుతోంది ! పసి మనస్సులపై దారుణ ప్రభావం !!
  • పక్క సీటులో ప్రఖ్యాత అందగత్తె – సో వాట్, నా బాధల్లో నేను…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions