Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తోపులు ఫెయిలైనా… అక్షర్ పటేల్ గెలిపించి, పరువు నిలిపాడు !

July 15, 2026 by M S R

.

నిజానికి నిన్నటి ఇండియా- ఇంగ్లండ్ క్రికెట్ వన్డే మ్యాచుకు పెద్ద ప్రాధాన్యం ఉండకపోయేది… మూడు మ్యాచులు సీరీస్‌లో మొదటి మ్యాచే కాబట్టి… కానీ అంతకుముందు ఐర్లండ్ వంటి ఓ అనామక జట్టు చేతిలో టీ20 మ్యాచులు ఓడిపోవడం, ఇంగ్లండ్ టీ20 జట్టుతో వైట్‌వాష్ చేయించుకోవడంతో… కనీసం ఇదైనా గెలుస్తారా, దీన్నీ ఓటమి ఖాతాలోకి నెట్టేస్తారా అని సగటు ఇండియన్ క్రికెట్ ప్రేమికుడికి సందేహం ఉండేది…

నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ రావడం… చాన్నాళ్ల తరువాత జస్పీత్ బుమ్రా రావడం… కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్ ఉండటంతో బ్యాటింగ్, బౌలింగు సమతూకం ఉందిలే అనిపించింది…

Ads

ఇంగ్లండ్ జట్టు కూడా బలంగా ఉన్నదే… బౌలింగులో ఆర్చర్, రషీద్, సామ్ కరణ్… బ్యాటింగులో బెతెల్, బ్రూక్, రూట్, బట్లర్, డకెట్… ఏమాత్రం తీసిపారేయదగిన జట్టు కాదు, పైగా హోమ్ గ్రౌండ్…

రోకో రోకో అని మస్తు హైప్ క్రియేట్ చేశారు… కానీ రోహిత్ 11 రన్స్, కోహ్లీ 5 రన్స్ మాత్రమే చేసి, నవ్వే గౌతమ్ గంభీర్ ఎదుట జారిపడ్డారు… (కోహ్లీకి గౌతమ్‌ గంభీర్ నడుమ అసలు మాటలే లేవట…) బుమ్రా రన్స్ తక్కువ ఇచ్చినా ఒక వికెటే తీయగలిగాడు… గిల్ బాగా ఆడాడు, రిటైర్డ్ హర్ట్ కాకపోయి ఉంటే తనే ఒంటి చేత్తో గెలిపించేవాడు…

తను వెళ్లిపోవడం, శ్రేయస్ సిల్లీ రనవుట్ కావడం, రాహుల్ కూడా కేవలం ఒక రన్‌కే పెవిలియన్ మొహం పట్టడంతో ఇంగ్లండ్ పట్టు బిగిస్తున్నట్టు అనిపించింది… దానికితోడు వాషింగ్టన్ సుందర్ స్లో బ్యాటింగు కూడా… కానీ ఈ దశలో అక్షర్ పటేల్ నిజంగా బాగా ఆడాడు… వాషింగ్టన్‌తో మంచి పార్టనర్‌షిప్ బిల్డ్ చేసి ఇండియాను గెలిపించాడు… అంతకుముందు నాలుగు వికెట్లు కూడా తీశాడు… ఈ మ్యాచుకు సంబంధించి హీరో అక్షర్ పటేల్ ఓన్లీ!

ఒకవేళ వచ్చే రెండు మ్యాచుల్లో గనుక రోహిత్, కోహ్లీ సరిగ్గా రన్స్ చేయకపోతే… వచ్చే వరల్డ్ కప్‌లో ఆడటం ఖచ్చితంగా సందేహాస్పదమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రాణాలు తీస్తున్న ఈ కలుపు మందుపై జాతీయ నిషేధం !!
  • తస్లీమా! మమత తరిమేసింది- సువేందు రమ్మంటున్నాడు !!
  • కాంగ్రెస్‌పై ప్రవాస భారతీయుల రుసరుస! పవన్ ఖేరా నిర్వాకం !!
  • తోపులు ఫెయిలైనా… అక్షర్ పటేల్ గెలిపించి, పరువు నిలిపాడు !
  • ఆ భాషల్లోని గొప్ప గాయకులనూ మరిపించిన ఈమె ఉచ్చారణ !!
  • రిటైర్డ్ ఇంజినీర్లు – BRS కవర్ సంఘాలు! మేడిగడ్డపై క్షుద్ర పన్నాగాలు!!
  • IKKA – దర్శకుడు పర్లేదు… ఎటొచ్చీ ఆ నలుగురి నటనే నాసిరకం !!
  • కుటుంబం విచ్ఛిన్నమవుతోంది ! పసి మనస్సులపై దారుణ ప్రభావం !!
  • పక్క సీటులో ప్రఖ్యాత అందగత్తె – సో వాట్, నా బాధల్లో నేను…
  • ఆ నిత్యహారతి ప్రోటోకాల్ ఎప్పుడో రద్దు చేసి ఉండాల్సింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions