Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాంగ్రెస్ కాదు – బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్‌పై బీజేపీ ‘ఎదురుదాడి’..!!

July 15, 2026 by M S R

.

కాగల కార్యం గువ్వల బాలరాజు తీర్చినట్టు! ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎదురుదాడి మొదలైంది… కానీ విచిత్రంగా బీఆర్ఎస్ వైపు నుంచి కాదు… బీజేపీ వైపు నుంచి..! బీఆర్ఎస్- బీజేపీ రహస్య సంసారం బహిరంగ రహస్యమే కదా, మరి బీఆర్ఎస్ నేతపై ఇలా బీజేపీ దాడి ఏమిటనేది ఆశ్చర్యం…

కేసీయార్ ఎలాగూ మాట్లాడడు, జనంలో లేడు, జనం ఆయనకు అక్కర్లేదు… వోట్లేసేటప్పుడు తప్ప! కేటీయార్, హరీష్‌రావుల్లో ఒకరు ఉపఅధినేత, మరొకరు ఉపోప అధినేత… వాళ్లను మించి ఒక దాసోజు, ఒక ఆర్ఎస్పీ… మిగతా అందరూ సైలెంట్, అధినేతకే లేని తీట మనకెందుకులే అని ముఖ్యనేతలందరూ మౌనం పాటిస్తున్నారు…

Ads

పదే పదే బండి భగీరథ్ కేసుపై… అది తప్ప మరే సమస్యా లేనట్టుగా ప్రవీణ్ మాట్లాడుతున్నాడు… ఇప్పుడు అదే బీజేపీ నుంచి తనపై కౌంటర్, ఎన్‌కౌంటర్ స్టార్ట్ కావడం అందుకే విశేషంగా కనిపిస్తోంది… నిజానికి ఆర్ఎస్పీ మీద కౌంటర్ నిజంగానే కాంగ్రెస్‌కు పెద్దగా చేతకావడం లేదు ఇన్నాళ్లూ… ఇప్పుడు బీజేపీ గువ్వల బాలరాజు ద్వారా ఎదురుదాడి స్టార్ట్ చేసింది… తను సీఎం రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశాడు…

అందులో ఏం కోరాడంటే..? ‘‘రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ TSWREIS/TTWREIS కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పదవీ కాలంలో జరిగిన ఆర్థిక అవకతవకలు, టెండర్– కొనుగోలు నిబంధనల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రైవేట్ నెట్‌వర్క్ జోక్యం, గురుకుల నియామకాల్లో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి…’’

ఆ లేఖలో  ముఖ్యాంశాలు ఇలా… 

– గురుకుల విద్యార్థుల సంక్షేమం కోసం కేటాయించిన ప్రజాధనం వినియోగం, ప్రైవేట్ సంస్థలకు పనుల అప్పగింత, టెండర్ విధానాలు, ముందస్తు చెల్లింపులు, నాణ్యత లేని వస్తువుల స్వీకరణ, డబ్బులు తీసుకుని గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను కట్టబెట్టడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ లోనూ అక్రమాలు…



rsp



– IIT/JEE కోచింగ్ పేరుతో దాదాపు రూ.20 కోట్ల దుర్వినియోగం… వీటికి సంబంధించిన పనులకు టెండర్ లేదు. ఆర్ధిక శాఖ అనుమతి లేదు. సమ్మర్ క్యాంపులు, యూనిఫాం, బ్లాంకెట్ల పంపిణీకి సంబంధించిన నిధుల విషయంలోనూ పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగిందని కాగ్ నివేదిక (2025)లో పేర్కొన్నారు.

– గురుకుల విద్యార్థులకు software coding శిక్షణ పేరుతో ఏటా సుమారు రూ.4 కోట్ల నుంచి రూ.4.5 కోట్ల వరకు వ్యయం చేశారు. ఇంత ఖర్చు చేసినా కేవలం సుమారు 240 మంది విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో సుమారు రూ.92 లక్షల నుంచి రూ.97.20 లక్షల వరకు అధిక చెల్లింపులు జరిగినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.

– 2021 జూలైలో రూ.3.07 కోట్ల చెల్లింపులు అందుకున్న ప్రైవేట్ సంస్థకు బ్యాంక్ గ్యారంటీ లేకుండానే 90 శాతం ముందస్తు చెల్లింపులు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఒప్పందం అనంతరం Secretary స్థాయిలో security depositను మాఫీ చేశారని, తద్వారా అసలు tender conditionsలో మార్పులు జరిగాయనే ఆరోపణ కూడా ఉంది. టెండర్ ఖరారైన తర్వాత నిబంధనలను మార్చే అధికారం ఎవరు ఇచ్చారు?

– Board of Governors లేదా competent authority prior approval ఉందా? దీనివల్ల ప్రైవేట్ సంస్థకు అనుచిత ఆర్థిక ప్రయోజనం కలిగిందా? అనే అంశాలపై విచారణ జరపాలి. coding projectకు సంబంధించిన original agreement, tender file, sanction proceedings, student attendance, training records, invoices, payment vouchers మరియు utilisation certificatesను స్వాధీనం చేసుకొని forensic audit నిర్వహించాలని కోరుతున్నాము.

– సాఫ్ట్ వేర్ లైసెన్స్ కు సంబంధించి లైసెన్స్ యుటిలైజేషన్ పూర్తి వివరాలు లేకుండానే రూ.2.03 కోట్లు ఏకపక్షంగా చెల్లించినట్లు తెలిసింది. అట్లాగే రూ.9.33 కోట్లు వెచ్చించి యూనిఫాం కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘించారని, తద్వారా రూ.76.89 లక్షలు రూపాయల అధిక చెల్లింపులు జరిగినట్లు కాగ్ పేర్కొంది. ఆ నిధులు ఏమయ్యాయి? ఎవరి జేబుల్లోకి వెళ్లాయో తేలాల్సి ఉంది.

– Electrical material procurementలో e-procurement విధానాన్ని పాటించలేదని, అవసరమైన ISI certificates/permissions లేని సంస్థకు contract ఇచ్చారనే ఆరోపణలున్నాయి. Warranty periodను delivery/ installation తేదీ నుంచి కాకుండా order date నుంచి లెక్కించడం వల్ల defective material replacement పొందలేక సుమారు రూ.1.38 కోట్ల విలువైన ప్రజాధనానికి నష్టం వాటిల్లినట్లు కాగ్ పేర్కొంది. దీనికి బాధ్యులెవరో గుర్తించాలి.

– ముఖ్యంగా Diet, cleaning, examination fees, ఇతర expenditure headsలో సరైన agreements లేకుండా payments జరిగాయి. కొన్ని bills అందుబాటులో లేవు. ledger entriesతో payment records సరిపోలకపోవడం వంటి అంశాలు కూడా కాగ్ ఆడిట్ పరిశీలనలో బయటపడ్డాయి. 2013 నుంచి 2021 వరకు TSWREIS,  TTWREISకు సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు నిధుల దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా సంవత్సరాల కాలంలో నిర్వహించిన అన్ని cash books, ledgers, payment vouchers, bank statements, PFMS/treasury recordsను forensic audit చేయించాల్సిన అవసరం ఉంది.

– నియామకాలు, కాంట్రాక్ట్–అవుట్‌సోర్సింగ్ పోస్టుల్లోనూ నిబంధనల ఉల్లంఘన… 2013–2021 మధ్య TSWREIS/ TTWREISలో జరిగిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, కోఆర్డినేటర్ సహా నాన్ రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ డబ్బులు తీసుకుని ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ఉద్యోగ నియమాకాల్లో నిబంధనలను ఉల్లంఘించి ఇష్టానుసారంగా తన అనుయాయులకు, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

– 2013–2021 మధ్య కాలంలో డైట్, యూనిఫామ్స్, షూస్, సాక్స్, బెడ్డింగ్, కాస్మోటిక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్ మెంట్ కు సంబంధించి నిబంధనలకు భిన్నంగా తన అనుయాయకులకే కట్టబెట్టినట్లు తెలిసింది. ఈ విషయంలో ఒకే vendor లేదా పరస్పరం సంబంధం ఉన్న sister concernsకు వరుసగా contracts ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో Common directors, partners, addresses, GST registrations, bank accounts లేదా beneficial ownership links ఉన్నాయా? అనే అంశాలపై forensic examination చేయాలి. Board approvals మరియు Secretary financial powersపై విచారణ జరపాలి.

– bye-laws, financial rules ప్రకారం Board of Governors/Standing Committee అనుమతి అవసరమైన contractsలో prior approvals తీసుకున్నారా అనే అంశాన్ని contract-wise పరిశీలించాలి. వీటితోపాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హయాంలో గురుకుల విద్యాలయాల్లో స్వచ్చంద సంస్థ పేరుతో ప్రైవేట్ నెట్‌వర్క్ జోక్యం ఎక్కువైందని, ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తూ హింసాయుత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి.

– ఐఏఎస్ నిర్వహించాల్సిన విధులను ఐపీఎస్ కు అప్పగించడాన్ని చూస్తుంటే గత కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన అవినీతికి సహకరించినట్లు అర్ధమవుతోంది. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోకపోవడం, కనీసం విచారణకు కూడా ఆదేశించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది…. (డా. గువ్వల బాలరాజు)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాంగ్రెస్ కాదు – బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్‌పై బీజేపీ ‘ఎదురుదాడి’..!!
  • పాత ఫోన్లకే రీబ్రాండింగ్ ! స్మార్ట్ ఫోన్ కంపెనీల మాయాజాలం !!
  • వితండ సర్వే! వాహనదారులనూ పార్టీలను బట్టి చీల్చితే ఎలా?!
  • హమ్మ జగనూ..! 18 ఏళ్ల పిల్లోడట – సర్కారుకే మానవత్వం లేదట..!!
  • బీఆర్ఎస్! పంపు హౌజులపై పొంతన లేని వితండ వాదనలు!!
  • ప్రాణాలు తీస్తున్న ఈ కలుపు మందుపై జాతీయ నిషేధం !!
  • తస్లీమా! మమత తరిమేసింది- సువేందు రమ్మంటున్నాడు !!
  • కాంగ్రెస్‌పై ప్రవాస భారతీయుల రుసరుస! పవన్ ఖేరా నిర్వాకం !!
  • తోపులు ఫెయిలైనా… అక్షర్ పటేల్ గెలిపించి, పరువు నిలిపాడు !
  • ఆ భాషల్లోని గొప్ప గాయకులనూ మరిపించిన ఈమె ఉచ్చారణ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions