.
ఒక వార్త విస్మయపరిచింది… అది ఏపీ డిప్యూటీ పవన్ కల్యాణ్ వార్త… సర్జరీ చేయించుకున్నావు, రెస్ట్ తీసుకో, కొన్నాళ్లాగి పనిలోకి వద్దువుగానీ అని తన బాస్ చంద్రబాబు చెప్పాడనే వార్త గురించి కాదు… పాపం, బాబు ప్రేమతో, మంచి మనసుతోనే చెప్పి ఉంటాడు… కానీ పవన్ కల్యాణ్‌లోని ప్రజాసేవ బాపతు తీవ్రమైన, అరివీర భీకరమైన తపన తనను అస్సలు ఊరుకోనివ్వదు కదా…!
- ఏపీ కొలువు ఇప్పుడే వద్దు అన్నాడు కదాని, తెలంగాణ వైపు దృష్టి పెట్టాడు… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశాడు… అదేనండీ, హాస్పిటల్‌లో పడుకునీ, పడుకునీ నిద్రపట్టక !! నిద్రపట్టకపోతే ఏవో నాలుగు సనాతన ధర్మగ్రంథాలు చదవొచ్చు కదా… ఊహూఁ… అలా చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు అవుతాడు… తన గోచీబట్ట సర్దుకోవడం తెలియదు గానీ పక్కింట్లోకి తొంగిచూసే బుద్ది..!!
- ఆల్రెడీ మొన్నటి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ఏదో గోకబోయాడు పవన్ కల్యాణ్… ఎవడబ్బ జాగీరు వంటి దుర్భాషలకు దిగితే తెలంగాణ సమాజం యావత్తూ థూత్కరించింది… ఇప్పుడు ఏకంగా సర్కారుకు గోకే పనిలో పడ్డాడు…
- ఎందుకు..? తను బీజేపీ కూటమి మనిషి, తెలంగాణలో బీజేపీ- బీఆర్ఎస్ రహస్య సంసారం… సో, బీఆర్ఎస్ కోసమా ఇప్పుడు తన గోళ్లకు మళ్లీ గోకుడు రంది..?!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన బాధ్యతలు, కర్తవ్యాలు, నీతులు బోధించే పనిలో పడ్డాడు… ఇలా రాశాడు లేఖ… ‘‘తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలి… పోక్సో కేసుల దర్యాప్తు 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేయాలి…
Ads
బాధితులకు పూర్తి రక్షణ కల్పించే వ్యవస్థ ఏర్పాటు చేయాలి… ఈ కేసుల్లో బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించాలి… బాధితులను బెదిరించే నిందితులపై కఠిన నిఘా అవసరం… బాధితులకు వైద్య పరీక్షలు 24 గంటల్లో పూర్తి చేయాలి… ఫోరెన్సిక్, డీఎన్‌ఏ ఆధారాలను త్వరితగతిన సేకరించాలి…
ప్రతి జిల్లాలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలి… పోక్సో కేసులపై జిల్లా, రాష్ట్ర స్థాయిలో నెల వారీ సమీక్షలు నిర్వహించాలి… ఈ కేసుల్లో ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి… పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాల్లో తప్పనిసరి రిపోర్టింగ్ విధానం ఉండాలి..’’
… ఇదీ తన లేఖ సారాంశం… అయ్యా, తెలంగాణలో ఓ ప్రభుత్వం ఉంది, హోమ్ శాఖ ఉంది, విధివిధానాలు తెలిసిన, కాకలు తీరిన పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు… ఈ సీనియర్ ఐపీఎస్‌లు మరీ పొరుగు రాష్ట్రపు మంత్రులతో చెప్పించుకునే స్థితిలో అస్సలు లేరు… ఎవరి రాష్ట్ర పాలన వాళ్లు చూసుకుంటే బెటర్ కదా… అంతటి మీ బాస్ చంద్రబాబే తెలంగాణలో పాలన మీద కిమ్మనడు, తనకు పొలిటికల్ ప్రోటోకాల్స్ తెలుసు కాబట్టి… తను దుందుడుకు కేరక్టర్ కాదు కాబట్టి..!!
- అన్నట్టు… అన్నా, బండి సంజయన్నా… ఈయన మీ బీజేపీ కూటమి సభ్యుడే కదా… మీ అబ్బాయి భగీరథకు బెయిల్ రావడాన్ని ఆక్షేపిస్తున్నాడా తను..? తెలంగాణ పోలీసులు మీవోడి బెయిల్‌ను గట్టిగా వ్యతిరేకించలేదనేదా తన ఉద్దేశం..? మీ ఇద్దరికీ ఎక్కడ చెడిందన్నా… మరీ తను కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లాగే మాట్లాడుతున్నాడు..!! (పేరుకు పవన్ కల్యాణ్ లేఖ మొన్నటి షాబాద్ పోక్సో కేసు, ఆ హంతకుడి గురించే, కానీ ఇదేదో తేడా కొడుతోంది)…
అన్నట్టు… రేవంత్ రెడ్డితో గోక్కుంటే ఎలా ఉంటుందో పవన్ కల్యాణ్‌కు ఇంకా తెలిసినట్టు లేదు… లేదా రేవంత్ రెడ్డే ఇంకా సీరియస్‌గా తీసుకోవడం లేదేమో..!! తను తెలంగాణలో వేళ్లు పెడితే, రేవంత్ ఏపీలో కాళ్లు పెడతాడు, పెట్టగలడు… నీతులు చెప్పే ఆ బుడ్డ గోచీ కూడా విప్పేస్తాడు… అప్పుడిక చంద్రబాబు మొహం కూడా చూడడు తను..!! మరెందుకు గోక్కుంటున్నట్టు డిప్యూటీ పవన్ సారూ..!?
Share this Article