ఇంకా మనవాళ్ల నుంచి అంత టేస్టు, ఆ ప్రయోగాలు ఆశించలేం గానీ… తమిళ, మళయాళ నటీనటులు, దర్శకులు, వృత్తినిపుణులు… ఓటీటీ ప్లాట్‌ఫారాల ప్రోత్సాహంతో మంచి ప్రయోగాలు చేస్తున్నారు… థియేటర్ నుంచి సినిమా చాలా దూరం వచ్చేస్తోంది… ఇప్పుడు అరచేతిలోనే సినిమా చూపించాలి ప్రజలకు… అదీ కొత్తకొత్తగా చూపించాలి… అంటే స్మార్ట్ ఫోనే థియేటర్… షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ అలాంటివే… నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఓటీటీలు అనేక ప్రయోగాలకు రెడీ అంటున్నాయ్, ఎంకరేజ్ చేస్తున్నయ్… అందుకే చేతులు కాల్చుకోనవసరం లేకుండానే ఆసక్తిపరులైన, అభిరుచి కలిగినవాళ్లు ప్రయోగాల బరిలోకి దిగుతున్నారు… మొన్న ‘ముచ్చట’ హీరో సూర్య గురించి రాసిన కథనం తెలుసు కదా… ఒక అంతాలజీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు తను… అవును, ఇప్పుడు అంతాలజీ టాపిక్ కాస్త ఇంట్రస్టింగు సినిమా ఫీల్డులో….
Ads
ఈ ఫోటోలో ఉన్నది మన సాయిపల్లవే… ఒకవైపు పెద్ద బ్యానర్లలో హీరోయిన్గా చేస్తూనే… నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న ఓ తమిళ అంతాలజీ ఫిలిమ్‌లో నటిస్తోంది తను… పేరు పావ కదైగల్… ఆ ట్రెయిలర్ విడుదలైంది తాజాగా… ఈ అంతాలజీ ఏమిటంటే… రకరకాల దర్శకులు, తారలు, సంగీత దర్శకులు గట్రా వేర్వేరు ఉద్వేగాల్ని ఎంచుకుని, ఆయా రసాలే ప్రధానంగా వేర్వేరుగా కథల్ని చిత్రిస్తారు… అన్నీ కలిపి కుట్టేస్తారు… ఈ పావ కదైగల్ కూడా అదే… నాలుగు షార్ట్ సినిమాల కలయిక… ఇందులో గౌతమ్ మీనన్, సుధ కొంగర, వెట్రి మారన్, విఘ్నేష్ శివన్ వేర్వేరు కథలకు దర్శకత్వం వహిస్తారు… గౌరవం, ప్రేమ, తప్పు, గర్వం… ఈ నాలుగు అంశాల చుట్టూ ఆ నాలుగు కథలూ తిరుగుతాయి…
ఒక దాంట్లో సాయిపల్లవి గర్భిణి… ప్రకాష్ రాజ్ తన తండ్రి… మరో దాంట్లో గౌతమ్ మీనన్ ఓ తాత… తన మనమరాలితో ఆడుకునే కథ… ఇంకో దాంట్లో అంజలి, కల్కి లవర్స్… ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు… నటి సిమ్రాన్ ఓ పిల్లను ఓ కొండపై నుంచి కిందకు నెట్టేస్తూ ట్రెయిలర్ ఎండ్ అవుతుంది… సస్పెన్స్… అది మరో కథ… నెట్‌ఫ్లిక్స్ ఇదే కాదు… మరో రెండు ఇలాంటి ప్రాజెక్టులే చేస్తోంది… ఒకటి ది విక్టిమ్… రెండు నవరస… వీటిలో నవరస ప్రాజెక్టు గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం… (పైన లింకులో)… తొమ్మిది రకాల ఉద్వేగాలు, తొమ్మిది కథలు… ప్రఖ్యాత సినిమా పర్సనాలిటీస్… అది ఖచ్చితంగా ఓ విశేష ప్రయోగమే… మరి మన అల్లువారు తన ఆహా ఓటీటీ కోసం ఇలాంటిది ఏమైనా ఆలోచిస్తున్నాడంటారా..? భలేవారే… ఆశకు హద్దుండాలి…!!
Share this Article