.
అనగనగా ఓ దట్టమైన అడవి… ఆరుగురు ఫ్రెండ్స్ సాహసయాత్రకు వెళ్లి, దారితప్పారు… నడిచీ నడిచీ, అలసిపోయి ఓ చెట్టు కిందకు చేరారు..? వాట్ టు డు..?
మథనం స్టార్టయింది… ఆకలి, దప్పిక, నీరసం, ఇక చాలాసేపు ఆపుకోవడం కష్టం… కాసేపైతే చీకటి పడుతుంది… క్రూరమృగాల భయం సరేసరి…
మొదటివాడు :: ఎడమ వైపు వెళ్తే బెటరని నా కాన్షియస్ చెబుతోంది…
రెండోవాడు :: లేదు, ఎందుకో రైట్ సైడ్ వెళ్లడం బెటరనిపిస్తోంది… నా మనస్సు అదే బలంగా చెబుతోంది…
మూడోవాడు :: కరెక్టు కాదేమో, వెనక్కి వెళ్తేనే స్టార్టింగ్ పాయింట్ చేరుకుంటామని బలంగా అనిపిస్తోంది…
నాలుగోవాడు :: ఏది జరిగితే అది జరగనీ, స్ట్రెయిట్‌గా ముందుకే వెళ్దాం…
అయిదోవాడు :: ఆ దేవుడే దిక్కు… తెల్లారేదాకా ఇక్కడే కూర్చుందాం, ఆ దేవుడే దారి చూపిస్తాడు…
ఆరోవాడు :: నేను ఈ చెట్టు ఎక్కి ఓసారి చుట్టూ చూస్తాను, దిగేదాకా వెయిట్ చేయండి… నేనసలే ప్రాక్టికల్…
ఆరోవాడు చెట్టు ఎక్కడం ఇంకా స్టార్ట్ చేయనేలేదు… నలుగురు నాలుగు బాటల్లోకి వెళ్లిపోయారు… దేవుడిని నమ్ముకుని అక్కడే కూర్చున్న ఆ అయిదోవాడి మీద సింహం దాడి చేసి తుప్పల్లోకి లాక్కుపోయింది… చెట్టెక్కిన వాడు ఆ సమయానికి బతికిపోయాడు…
Ads
– ఎడమ వైపు వెళ్లినవాడికి నలుగురూ నడిచే ఓ దారి దొరికింది… హమ్మయ్య అనుకున్నాడు… ఏదో ఓ ఊరు దొరక్కపోదు ఇక…
– కుడివైపు వెళ్లినవాడికి ఓ వాగు అడ్డం వచ్చింది… ఎలా దాటాలో తెలియడం లేదు… ఈలోపు హైనాలు మీదపడ్డాయి… కథ ముగిసింది…
– వెనక్కి వెళ్లినవాడికి తనలాగే దారితప్పిన మరో నలుగురు కనిపించారు… దురదృష్టజీవులన్నీ ఒకేచోట చేరినట్టయింది… వాళ్ల కథ మొదటికొచ్చింది…
– అలాగే ముందుకు వెళ్లినవాడికి అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వచ్చిన నలుగురు కూలీలు దొరికారు, కాస్త తిండి, నీళ్లు కూడా ఇచ్చారు… వాళ్లతోపాటు ఎంచక్కా ఓ పట్టణంలోకి వెళ్లిపోయాడు…
చెట్టు ఎక్కినవాడికి సమీపంలోని కొన్ని గుడిసెలు కనిపించాయి… బతుకుజీవుడా అనుకుని, చెట్టు దిగి నేరుగా అక్కడికి వెళ్లాడు… నాగరికుడు కనిపిస్తే చాలు రగిలిపోయే ఆటవికులు వాడిని అక్కడే అమ్మవారికి బలి ఇచ్చేశారు…
కథలో నీతి :: ఎవడి ఖర్మకు వాడే బాధ్యుడు… ఒకరి దురదృష్టాన్ని ఎవడూ తుడిపేయలేడు… ఒకరి అదృష్టాన్ని ఎవడూ కాజేయలేరు…
Share this Article