Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం తెలుగు దినపత్రికలు – నానాటికీ దిగదుడుపు… సాక్షి సహా !!

July 18, 2026 by M S R

.

ఫాఫం, జగన్‌మోహన్‌‌రెడ్డిని అప్పట్లో లక్ష కోట్ల అవినీతి అని విమర్శించారు… తన ఐదేళ్ల కాలంలో అవినీతి తప్ప మరొకటి లేదనీ వెక్కిరించారు… లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టాడని ఆరోపించారు… నో, నో, అదంతా అబద్ధం… అంతగా ఆస్తులు గుట్టలుగా పోగుపడితే పాపం సోదరికిచ్చిన ఆస్తులపైనా కన్నేస్తాడా అంటారా..? సరే, అది కాదు, వేరే చెప్పుకుందాం… (అంటే జగన్ రాజకీయ ప్రత్యర్థులు ఏమాత్రం శుద్ధపూసలు కాదు, నాలుగాకులు ఎక్కువే చదివారని గమనించ మనవి)…

మొన్నొకాయన చెమటలు కక్కుతూ కాలింగ్ బెల్ కొట్టాడు… సాక్షి వేసుకొండి సార్, ప్లీజ్ సార్, ఈ ఏరియా రిపోర్టర్‌ను సార్ అంటున్నాడు… చిన్న విషయం బ్రదర్, నీ పేపర్ వేసుకోకపోతే ఇదుగో ఈ ఫలానా స్టోరీ నేను మిస్సవుతాను అని చెప్పగలిగే  ఒక్క స్టోరీ చూపించు బ్రదర్ అనడిగాను… మళ్లీ పత్తా లేడు, తను రిపోర్టర్ కూడా కాదు… ఎవరో సర్క్యులేషన్ ప్రమోషన్ ఏజెంట్…

Ads

తనే కాదు, తరువాత ఆంధ్రజ్యోతి… సేమ్ సేమ్… నమస్తే తెలంగాణ గురించి అడక్కండి, కొనమని అడిగేవాడు లేడు, కొనేవాడూ లేడు… కొని కొనసాగించేవాడు అస్సలు ఉండడు, లేడు… అప్పుడెప్పుడో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవితచందాలు రాయించారు కదా, అలా కొనసాగిస్తున్నారు పాపం, కేటీయార్ సార్, కొత్త పత్రికలు పెట్టడం, కొనడం కాదు, ఉన్న నమస్తేను కాస్త ఉద్దరించొచ్చు కదా…

ఎహె, ఈనాడు ఏమైనా సొక్కమా? అనడక్కండి… అది తలుపుచాటున నిలబడి, పద్దతిగా కన్నుగీటి పిలిచేరకం… మిగతావి బజారులో నిలబడి రారమ్మని బరితెగించే బాపతు… ఇదంతా ఎందుకంటే..? హైదరాబాదులో ఆంధ్రజ్యోతి, సాక్షి సర్క్యులేషన్ దారుణంగా పడిపోయింది… వరుసగా మీటింగులు పెట్టి చొక్కాలు చించుకుని, తలలు బద్దలు కొట్టుకుంటూ మేధో మథనం చేస్తున్నారు…

హైదరాబాద్ సర్క్యులేషన్ బాగాలేకపోతే కమర్షియల్ యాడ్స్ లేవు, డబ్బుల్లేవు, అందుకని ఈ పాట్లు… సరే, జగన్ ఆస్తుల సంగతి చెప్పుకుంటున్నాం కదా… ఒకప్పుడు ఈనాడుకు దీటు, పోటీ అన్నారు, ఓ పే-ద్ద కులం గుప్పిట్లోకి చేర్చారు… తరువాత ప్రొఫెషనలిజం లేక, నిజం లేక కునారిల్లిపోయింది… హైదరాబాదులో ఎలాగైనా కాపీలు పెంచాలని అనుకుని ముందుగా తమ ఉద్యోగులపై పడ్డారు…

ఉద్యోగి తప్పనిసరిగా సాక్షి సంవత్సర చందా కట్టి, ఇంటికి పేపర్ వేయించుకోవాలట… 1200 రూపాయలు దాదాపు… జీతంలో కట్ చేస్తారట… ఈనాడుతో పోటీ అంటే, ఈనాడుతో నిజంగా పోటీపడాలి ప్రమాణాల్లోనూ… ఇలాంటి అంశాల్లోనూ… నిజానికి ఉద్యోగికి కాంప్లిమెంటరీ కాపీ ఇవ్వాలి… అది చేతకాలేదు, పైగా అరకొర జీతాలు, అందులోనూ ఇదుగో ఈ వార్షిక చందాల కత్తిరింపులు…

ఇప్పుడు ఉందో లేదో తెలియదు గానీ ఆంధ్రజ్యోతిలో ఏదైనా పేపర్ వేయించుకో, జీతంతోపాటు ఆ బిల్లు కలిపి ఇస్తాం అనేది… అది మరీ లిబరల్… ఇక్కడ అసలు సంగతి… పేపర్ నడపడం తెలివి కాదు, కాలర్ ఎత్తి, ఓ ఉద్యోగి సగర్వంగా తలెత్తుకునేలా నడపడం వేరు… పాపం, సాక్షి ఆ ఉద్యోగి తల మీద మొట్టి మరీ నడుపుతోంది…

ఏదో జగన్ 2.0 అని యాప్ ఉందట… అది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలకు కొత్త దశను, దిశను నిర్దేశిస్తుందట, ముందుగా అందరు ఉద్యోగులు అర్జెంటుగా ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలట, సరే, ఫ్రీ కాబట్టి వోకే… కానీ మరీ ఈ వార్షిక చందాలేమిటి మహాశయా..? నీకు ఏం తక్కువైంది జగనూ… నీ ఉద్యోగే నిన్ను తిట్టుకునే దుర్గతి దేనికి..?! చివరకు నీ ఉద్యోగే వందా రెండొందలకు కూడా నిన్ను తిట్టుకోవాలా..? ఫాఫం !!

నీ పత్రికలో రాజ్యమేలుతున్న రాక్షసగణాన్ని అదుపు చేయలేవు, వదిలించుకోలేవు, తరిమేయలేవు, ఒక్క కథనమూ జనాన్ని నీ పత్రిక కొనేలా ఉండదు… అదుగో అది మారినప్పుడు, అది నీ చేతనైనప్పుడు ఇలా నీ ఉద్యోగులనే నువ్వు వేధించే దుర్దినాలు ఉండవు..!

చివరగా… నిజంగా అపారంగా జగన్ ఆస్తులు సంపాదించి ఉంటే, మరీ తన సొంత ఉద్యోగులను అలా వేధించేవాడా..? నాలుగు కాపీలు ఇలా పెరుగుతాయని ప్రయత్నించేవాడా..?

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాక్షి రాసింది… సగం అబద్ధం – సగం నిజం … దేని గురించంటే..?
  • పాపం తెలుగు దినపత్రికలు – నానాటికీ దిగదుడుపు… సాక్షి సహా !!
  • ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ఇలా అర్థం చేసుకుందాం!!
  • సోనమ్ దీక్ష భగ్నం సరైన చర్య! ఇప్పటికే ఆలస్యమైంది కూడా!!
  • ఐశ్వర్య ఫ్లాప్ – లయ డబుల్ ఫ్లాప్ – నాగదుర్గ డిజాస్టర్ – ఏమిటీ దురవస్థ..!!
  • TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!
  • అదే పాత కథ- అదే పాత తారాగణం- అదే పాత కథనం… చీప్ కామెడీ అదనం !!
  • … దాంతోనే మొదలైంది యండమూరి సుదీర్ఘ రచన ప్రస్థానం !
  • అనగనగా ఓ దట్టమైన అడవి… దారితప్పిన ఆరుగురు ఫ్రెండ్స్
  • ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions