Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాక్షి రాసింది… సగం అబద్ధం – సగం నిజం … దేని గురించంటే..?

July 18, 2026 by M S R

.

Satish Chaganti… ఈయన గతంలో చంద్రబాబు వీర ఫాలోయర్ అని గుర్తు… కానీ ఏమైందో తెలియదు… న్యూట్రల్ అయిపోయారు… లోకేష్ జమానా వచ్చాక పాపం చంద్రబాబు బ్యాచ్ కూడా గందరగోళానికి గురవుతున్నట్టుంది… సరే, తన పోస్టులు ఫాలో అవుతుంటాను… తను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన పోస్టు ఒకటి ఇంట్రస్టింగుగా అనిపించింది… అది ఇలా…



.

Ads

సాక్షి

సాక్షి వార్తలో ఒక నిజం ఉంది… ఒక తప్పుదారి పట్టించే పోలిక కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలోకి వెళ్లింది నిజమే. కానీ అది Ease of Doing Businessలో కాదు, Investment Friendliness Indexలో.

రెండూ ఒకటి కాదు. Ease of Doing Business అంటే వ్యాపారం పెట్టిన తర్వాత దాన్ని నడపడం ఎంత సులభం అన్నది. Investment Friendliness Index అంటే అసలు ఒక ఇన్వెస్టర్ “ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలా? వద్దా?” అని నిర్ణయం తీసుకునే ముందు చూసే మొత్తం వాతావరణం.

అందుకే ఇందులో Infrastructure, Business Climate, Government Policy, Financial Health, Institutional Environment, Regulatory Ease వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు.

ఈరోజు ఏపీలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్ అడిగే ప్రశ్న ఒక్కటే… “2029లో ప్రభుత్వం మారితే? మళ్లీ పాలసీలు మారతాయా?” ఈ ప్రశ్నను బిజినెస్ కాన్‌క్లేవ్‌లలో సీఎం చంద్రబాబునే బహిరంగంగా అడుగుతున్నారు.

ఇన్వెస్టర్‌కు ఎర్ర తివాచీ కంటే Policy Continuity ముఖ్యం. ఒక ప్రభుత్వం ఆహ్వానించి, ఇంకో ప్రభుత్వం వచ్చాక ఒప్పందాలను మార్చినా, పునఃసమీక్షలు చేసినా, అది Business Climateను దెబ్బతీస్తుంది. 2019 తర్వాత సౌర, పవన విద్యుత్ ఒప్పందాల చుట్టూ జరిగిన పరిణామాలు ఇందుకు ఉదాహరణ.

అలాగే Financial Health కూడా ముఖ్యం. విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలహీనపరిస్తే, పెట్టుబడిదారుల విశ్వాసం కూడా తగ్గుతుంది.

మరో విషయం… ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం. రాజధాని ఇంకా పూర్తికాలేదు. పరిపాలనా వ్యవస్థ కూడా ఇంకా పూర్తిగా స్థిరపడలేదు. అందుకే NITI Aayog ఈ ఏడాది మొదటిసారిగా, పాత Ease of Doing Business కంటే మరింత సమగ్రంగా Investment Friendliness Index విడుదల చేసింది. ఇందులో ఏపీకి 8వ స్థానం వచ్చింది.

ఇప్పుడు చేయాల్సింది 8వ స్థానం ఎందుకు వచ్చిందో విశ్లేషించి, 1వ స్థానానికి ఎలా వెళ్లాలనేది ఆలోచించడం. వేరే సిలబస్‌తో జరిగిన కొత్త పరీక్ష మార్కులను, పాత పరీక్ష మార్కులతో పోల్చి రాజకీయాలు చేయడం కాదు.



ఈ పోస్టు చదువుతుంటే ఓ వార్త కనిపించింది… టీడీపీ నేత గల్లా జయదేవ్ ఏపీని కాదని, తెలంగాణలో అమరరాజా కంపెనీ చేపట్టిన మొత్తం 9500 కోట్ల గిగా కారిడార్ ప్రాజెక్టులో ఓ యూనిట్ స్టార్ట్ చేసింది… అమరరాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ (Amara Raja Advanced Cell Technologies)  జూలై 15, 2026న తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా, దివిటిపల్లిలో ‘కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్’ (Customer Qualification Plant – CQP) ను ప్రారంభించింది…. ఇదీ వార్త…

లోకేష్ జయదేవ్‌కు క్షమాపణ చెబుతున్న వార్త కూడా కనిపించింది… కులం, ధనం పేరిట ఏపీ పాలిటిక్స్ ఎంతకైనా దిగజారగలవు… ఇంకా లోతుల్లోకి ఇక్కడ వెళ్లడం లేదు   — ముచ్చట



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాక్షి రాసింది… సగం అబద్ధం – సగం నిజం … దేని గురించంటే..?
  • పాపం తెలుగు దినపత్రికలు – నానాటికీ దిగదుడుపు… సాక్షి సహా !!
  • ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయాన్ని ఇలా అర్థం చేసుకుందాం!!
  • సోనమ్ దీక్ష భగ్నం సరైన చర్య! ఇప్పటికే ఆలస్యమైంది కూడా!!
  • ఐశ్వర్య ఫ్లాప్ – లయ డబుల్ ఫ్లాప్ – నాగదుర్గ డిజాస్టర్ – ఏమిటీ దురవస్థ..!!
  • TRS … ఈ పేరుపై BRS ప్రేమ ఏమీ లేదు… భయం, కలవరం..!!
  • అదే పాత కథ- అదే పాత తారాగణం- అదే పాత కథనం… చీప్ కామెడీ అదనం !!
  • … దాంతోనే మొదలైంది యండమూరి సుదీర్ఘ రచన ప్రస్థానం !
  • అనగనగా ఓ దట్టమైన అడవి… దారితప్పిన ఆరుగురు ఫ్రెండ్స్
  • ఓ పాకిస్థానీ గూఢచారి (స్పై) దొరికాడు… కానీ ఒప్పుకోవడం లేదు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions