Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తొండలు కాదు, ఆగిన గుండెకు అండగా ! రేవంత్ ‘పెద్ది’ పరిణతి !

July 27, 2026 by M S R

.

అవును.., లాగూల్లో తొండలు జొరగొట్టి కొట్టిస్తానని గట్టిగా ఉరిమే రేవంత్ రెడ్డి అవసరమైన సందర్భాల్లో రాజకీయాలు, రోజువారీ ఘర్షణలు, ప్రత్యర్థిత్వాలు వదిలేసి మానవతా ధోరణిని, విజ్ఞతను, పరిణతిని కనబరచడంలో ముందుంటానని చాటుకున్నాడు నిన్న… బాగుంది… తొండలు కాదు, ఆగిన గుండెకు అండగా నిలబడ్డాడు… వివరాల్లోకి వెళ్దాం…

పెద్ది సుదర్శన్ రెడ్డి… పాత వరంగల్ జిల్లా, నర్సంపేటకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమైన నాయకుడు, ఫస్ట్ నుంచీ కేసీయార్‌నే అంటిపెట్టుకున్నవాడు… తనకు హఠాత్తుగా స్ట్రోక్… ఉండేది హన్మకొండలో… వెంటనే రోహిణి (చాలా ఏళ్లుగా ఉన్న పాత హాస్పిటలే)కి తరలించారు.., అప్పటికే గుండె ఆగిపోయింది…

Ads

అక్కడి వైద్యురాలు మమతారెడ్డి ప్రయత్నాన్ని నిజంగా అభినందించాలి… పదే పదే తొమ్మదిసార్లు సీపీఆర్ చేసింది… ఆమె ప్రయత్నం ఫలించింది… గుండె మళ్లీ లయ అందుకుంది… ఆమే నమ్మలేకపోయింది… నిజంగా ఇదొక మిరకిల్ అని వ్యాఖ్యానించింది… అందరూ ఆమెను అభినందించారు, చప్పట్లకు అర్హురాలు…

మరింత మెరుగైన వైద్యం కోసం పెద్దిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌కు తరలించాలనుకున్నారు… ప్రభుత్వం వేగంగా తనను తరలించడానికి వీలుగా గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసింది… అంటే అంబులెన్స్ ఎక్కడ ఒక్క క్షణం కూడా ఆగకుండా, ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి ఉంచుతారు… గుడ్ ఎఫర్ట్… తనను తరలించారు, వెంటిలేటర్ మీద తనకు చికిత్స జరుగుతోంది…

https://www.facebook.com/reel/1059303176645050

(మెయిన్ స్ట్రీమ్ సహా మన తెలుగు చానెళ్లు ఎప్పటిలాగే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం అంటూ స్క్రోలింగులు మన్నూమశానం స్టార్ట్ చేశారు… ఈ దరిద్రం మరీ ఎక్కువైపోతోంది ఈమధ్య)… ఈ వార్త రాసే సమయానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, కోలుకుంటున్నాడు… స్పీడ్‌గా రికవరీ అయిపోవాలని ఆశిద్దాం… ఇక్కడ రేవంత్ రెడ్డి తనను కాపాడటానికి సహకరించిన తీరునూ అభినందిద్దాం… ఇక్కడ మరో మాట…

పెద్ది

కేడర్‌ను, లీడర్‌ను ప్రొటెక్ట్ చేసుకోవడంలో (వ్యక్తిగత అవసరాలు) బీఆర్ఎస్ ధోరణిని మెచ్చుకోవచ్చు… ఓ మామూలు కార్యకర్తకు ఇలా అండగా ఉంటుందానే ప్రశ్న అక్కర్లేదు ఇక్కడ… పెద్ది పరిస్థితి తెలియగానే హరీష్ రావు, కేటీయార్ హన్మకొండకు హుటాహుటిన చేరుకున్నారు, అవసరమైనవన్నీ దగ్గరుండి చూసుకున్నారు… ఇలాంటి వైఖరి పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు పెద్ద భరోసానిస్తుంది మానసికంగా…

ఇలాంటి విషయాల్లో టీడీపీని కూడా మెచ్చుకోవచ్చు… కార్యకర్తలకు బీమా విషయంలోనే కాదు, తమ క్యాంపుకి సంబంధించిన వారిని జాగ్రత్తగా చూసుకుంటుంది పార్టీ… ఈ కోణంలో తెలంగాణ కాంగ్రెస్ కూడా ఏదైనా ఉపయుక్త నిర్ణయం, అమలు ఆలోచించడం బెటర్…

మరొకటీ చెప్పుకోవాలి… పెద్ది ఆరోగ్యస్థితిపై కేసీయార్ ఆరాతీశాడు, ఆయన ఆదేశాల మేరకే హరీష్, కేటీయార్ పరుగులు తీశారు వంటి రొటీన్ స్టీరియో ఫోనిక్ స్టేట్‌మెంట్లు కాదు… కేసీయార్ ఇలాంటి సందర్భాల్లోనైనా బయటికి వచ్చి, హాస్పిటల్‌కు వెళ్లి చూడాలి… అది వాంఛనీయం… జీవన్‌రెడ్డిల చేరిక కోసం రావడం కాదు, పెద్ది సుదర్శన్‌రెడ్డిల కోసం కూడా రావాలి… రాకపోతే మరింతగా జనానికి దూరమవుతాడు..!!

peddi

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అత్తింటి అపోలో, కామినేని ఉండగా… కోయంబత్తూరు ఎందుకు రాజా..!!
  • తొండలు కాదు, ఆగిన గుండెకు అండగా ! రేవంత్ ‘పెద్ది’ పరిణతి !
  • మగ హోస్టులకే ఈటీవీ ప్రాధాన్యం! రష్మి- ఇంద్రజలకు కత్తెర !!
  • కాదు, నేనిప్పుడు బిచ్చగాడిని కానే కాదు – ఆ రోజులకు ఏనాడో స్వస్తి !
  • కాకినాడ ప్రజా వైద్యుని పరిశోధనకు మరో అంతర్జాతీయ గుర్తింపు
  • నిజమే… మీడియా ఆత్మసమీక్ష తప్పదు- జ్యోతి నుంచే ఆరంభం కావాలి !!
  • … డాన్ పాత్రల్ని సూపర్ స్టార్ అప్పుడెప్పుడో టచ్ చేసేశాడు !!
  • సరిగ్గా తీయగలిగితే… ఈమె జీవితమూ ఓ మహానటి బయోపిక్ !!
  • 5 ఏవీఎఫ్ ప్రయోగాలు – 1000 ఇంజక్షన్లు – చివరకు ‘అమ్మా’ అనే పిలుపు…
  • సడక్ సే సంసద్ ! రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన ఆలోచనాత్మకమే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions