Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రకుల్ ప్రీత్ పేరు సరే – ఈ రేణు ధరీవాల్ పేరెప్పుడైనా విన్నారా..?

August 2, 2026 by M S R

.

ఉంటుంది, ఎందుకు ఉండదు..? ఇప్పటి రామాయణ్ వివరాలకూ ఆదిపురుష్ విశేషాలకూ నడుమ… ఇప్పటి రామాయణ్ అంశాాలకూ అప్పటి రామానందసాగర్ టీవీ సీరియల్‌కూ నడుమ… బాలీవుడ్ ప్రజెంట్ మేకింగ్‌కూ నాటి టాలీవుడ్ అగ్రదర్శకుల టేకింగ్‌కూ నడుమ… పోలికలు, తేడాలు ప్రస్తావనకు వస్తాయి, చర్చిస్తారు…

4 వేల కోట్ల భారీ రామాయణ్ సినిమా ఏమో గానీ, నిర్మాతలు వదిలిన 4 నిమిషాల ట్రెయిలర్ మాత్రం మీడియాలో భారీ సంఖ్యలో విశ్లేషణలు, పోలికలు, తేడాలు, ప్రశంసలు, విమర్శలు, వెటకారాలు, వ్యంగ్యాలకు కారణమవుతోంది…

Ads

ఎస్, ప్రజెంట్ సీత సాయిపల్లవికీ, నాటి టీవీ సీత దీపికి చిఖిలియాకూ నడుమ పోలిక… అంతెందుకు, కంగనా రనౌత్‌ సీత అయితే ఎలా ఉంటుందనే మీమ్స్ దాకా… ఇప్పటి రాముడు రణబీర్‌కూ, టీవీ రాముడు అరుణ్ గోవిల్ (ప్రజెంట్ దశరథుడు)కూ… ఆదిపురుష్ ప్రభాస్‌కూ నడుమ కూడా తేడాలు, పోలికలు వస్తున్నాయి…

సరిగ్గా ఇలాంటిదే మొన్నటి నుంచీ ఓ పోలిక విస్తృతంగా సోషల్ మీడియాలో చర్చించబడుతోంది… నాడు టీవీ సీరియల్‌లో శూర్పణఖ వేషం వేసింది అప్పట్లో ఓ చిన్న నటి… పేరు రేణు ధరీవాల్ (Renu Dhariwal)… అప్పట్లో ఎక్కువగా టీవీ వేషాలు వేసేది… అందమైందే, అవును, రామాయణంలో శూర్పణఖ కూడా అందగత్తె… సినిమా రామాయణాల్లో తరచూ అశోకవాటికలో చూపించే అనాకార రాక్షసి వేషం కాదు…

ఇప్పుడు శూర్ఫణఖగా నిర్మాతలు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్‌ను తీసుకున్నారు… ఈ రామాయణంలో రావణుడి జీవితమే ప్రధానంగా చిత్రిస్తున్నారు కాబట్టి, రావణుడు తన చెల్లె భర్త విద్యుత్ జిహ్వుడినే చంపేస్తాడు కాబట్టి… ఆమె కథకూ ఈ సినిమాలో ప్రాధాన్యం ఇస్తున్నారు, అందుకే ప్రముఖ నటిని ఎంచుకున్నారు… ఈమే అందగత్తె…

పోలికకు వస్తే… నాటి టీవీ శూర్పణఖ, నేటి సినిమా శూర్పణఖ… ఇద్దరూ బాగున్నారు…

శూర్పణఖ

సరే, టీవీ శూర్పణఖ గురించి… (వర్తమాన రాజకీయాల్లో కూడా ఓ శూర్పణఖ ఉంది, ఇక్కడ అప్రస్తుతం, కానీ శూర్పణఖ అనేసరికి గుర్తొస్తుంది- ఖర్మ)… రేణు ధరీవాల్ టీవీల్లోనే గాకుండా సినిమాల్లోనూ చిన్నాచితకా సహాయనటి వేషాలు వేసేది… వాటిలో దిల్ ఆష్నా హై (Dil Aashna Hai), భ్రష్టాచార్ (Bhrashtachar), ఖిలాఫ్ (Khilaaf) వంటి సినిమాలు ఉన్నాయి…

ప్రస్తుత జీవితం…: నటనకు దూరంగా ఉంటున్న ఆమె, వివాహం తర్వాత రాజకీయాల్లో, వ్యాపార రంగంలో క్రియాశీలకంగా మారింది… ఆమె ముంబై ప్రదేశ్ మహిళా కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసింది… ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది… కొన్ని ఎన్జీవోలను (NGOs) కూడా నడుపుతోంది…

రామానంద్ సాగర్ ‘రామాయణం’ సీరియల్‌లో  శూర్పణఖ పాత్ర పోషించినప్పుడు (1985–1987 మధ్య) రేణు ధారీవాల్ వయసు సుమారు 22 సంవత్సరాలు… సో, ప్రస్తుతం ఆమె వయసు సుమారు 60 నుంచి 63 సంవత్సరాల మధ్య ఉండవచ్చు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హరాకిరీ ! తెలంగాణ కాంగ్రెస్‌లో పెత్తనాల కిరికిరి ! BRS- BJP ఖుషీ !!
  • రకుల్ ప్రీత్ పేరు సరే – ఈ రేణు ధరీవాల్ పేరెప్పుడైనా విన్నారా..?
  • ‘నూకరాజు ! గతం- మూలాలు మరిచిపోని స్వచ్ఛత ! కీపిటప్ !!
  • ఇంతకీ ప్రధాని తన సెలవు చీటి రాస్తే… ఎవరు సాంక్షన్ చేయాలి..?
  • మరీ ఈ దరిద్రుడికి కాషాయం – యావత్ సాధుగణానికే అవమానం !!
  • ఇప్పుడు పిక్చర్ క్లియర్ ! కాళేశ్వరం మూడు బరాజులూ ప్రమాద స్థితిలోనే !!
  • ఎవరికెవరు ఈలోకంలో ఎవరికి ఎరుక ! చప్పట్లు తిండి పెట్టవు !!
  • మీ పిల్లలు ప్రధానిని బూతులు తిడితే… మీరేం చేస్తారు?!
  • స్పెయిన్ చొరబాట్లు – భారతమా బహుపరాక్ – వలసల వెనుక కుట్ర !!
  • Sita – Warrior of Mithila – సీత అసూర్యంపశ్య కాదు – యోధురాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions