Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!

August 20, 2026 by M S R

.

Srini Journalist … విమానంలోనే లోపం.. పైలట్లపై నెపం! … అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా (AI171) విమానానికి జరిగిన ఘోర ప్రమాదం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే జరిగిన ఈ ప్రమాదంలో విమానం కూలిపోగా, దురదృష్టవశాత్తు అందులో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారు.

ఆ సమయంలో అంతర్జాతీయంగా జరిగిన విచారణలో, బోయింగ్ కంపెనీ వాదనలో ఒకటే మాట వినిపించింది.. అదే “పైలట్ల తప్పిదం”... తమ విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేదని, పూర్తిగా పైలట్ల వైఫల్యం వల్లే ఇది జరిగిందని బోయింగ్ సంస్థ ఆరోపించింది. విమానంలోని కీలక ఆధారాలు కాలిపోవడం, పైలట్లు ప్రాణాలు కోల్పోవడంతో ఆ వాదనను తిప్పికొట్టడం భారత్‌కు కష్టతరమైంది.

Ads

తాజాగా జర్మనీలో బయటపడిన నిజాలు … అయితే, ఇప్పుడు సరిగ్గా అలాంటి ఘటనే జర్మనీలోని మ్యూనిచ్ విమానాశ్రయంలో వియత్నాం ఎయిర్‌లైన్స్ (VN34)కు చెందిన బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానానికి ఎదురైంది. ఈ ఘటనతో బోయింగ్ విమానాల టెక్నాలజీలో ఉన్న అసలు లోపం ప్రపంచం ముందు బట్టబయలైంది.

రెండు ప్రమాదాల మధ్య పోలికలు:

  • ఒకే కంపెనీ, ఒకే మోడల్…: రెండు ఘటనల్లోనూ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారు చేసిన ప్రతిష్టాత్మక ‘డ్రీమ్‌లైనర్’ విమానాలే ఉన్నాయి.

  • ఒకే రకమైన సాంకేతిక వైఫల్యం…: టేకాఫ్ అయ్యే అత్యంత కీలకమైన సమయంలో రెండు విమానాల్లోనూ వేగం అకస్మాత్తుగా పడిపోవడం లేదా ఇంజన్/ కంప్యూటర్ సిస్టమ్స్ చేతులెత్తేయడం జరిగింది.

  • అనుభవజ్ఞులైన పైలట్లు…: రెండు విమానాల్లోనూ వేల గంటల అనుభవం ఉన్న అత్యంత సీనియర్ పైలట్లే విధులు నిర్వర్తించారు.

తేడా ఎక్కడొచ్చింది? అహ్మదాబాద్ ఘటనలో పైలట్లు ప్రాణాలు కోల్పోవడంతో విమాన తయారీ సంస్థ తన తప్పును కప్పిపుచ్చుకోగలిగింది. కానీ, మ్యూనిచ్ ఘటనలో విమానం రన్‌వే చివరకు వెళ్లినా, పైలట్లు తమ అప్రమత్తతతో, చాకచక్యంతో విమానాన్ని ఎలాగోలా గాల్లోకి లేపగలిగారు. ఆ తర్వాత సురక్షితంగా తిరిగి మ్యూనిచ్‌లోనే ల్యాండ్ చేయడంతో నలుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు.

పైలట్లు సజీవంగా ఉండటంతో.. టేకాఫ్ సమయంలో విమాన వేగం దానంతట అదే రెండుసార్లు తగ్గిపోయిందని (Speed drops), కంప్యూటర్ నెట్‌వర్క్‌లోనే లోపం ఉందని వియత్నాం విమానయాన అధికారులు ప్రాథమిక నివేదికలో స్పష్టం చేశారు.

దీంతో, నాడూ నేడూ ప్రమాదాలకు కారణం పైలట్లు కాదనీ, బోయింగ్ విమానాల కంప్యూటర్/టెక్నికల్ సిస్టమ్స్‌లో ఉన్న లోపమేనని తేలిపోయింది… బోయింగ్ కుట్ర ప్రచారం స్పష్టమైపోయింది… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !
  • జలధికన్నా లోతైన ప్రేమ ! ఓ పట్టాన నమ్మలేని వాస్తవ కథ !!
  • ‘నాన్నా… ఈసారి బామ్మ దగ్గరికి నేనొక్కడినే వెళ్తాను ప్లీజ్…’
  • చివరికి ఆ ఇంటిపేరుతోనూ తెగతెంపులే ! జాతకం అదే చెబుతోందట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions