Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసంతృప్తి ఉండొచ్చుగాక – కానీ శరీరమే తన మాట వినడం లేదు !!

August 21, 2026 by M S R

.

అనేక ఊహాగానాలు… పవన్ కల్యాణ్ జనసేనకూ లోకేష్ తెలుగుదేశానికీ నడుమ అగాధం… పడటం లేదు… కూటమిలో లుకలుకలు తీవ్రతరం… కూటమిలో జనసేన ఉంటే ఉండనీ, పోతేపోనీ అన్నట్టుగా టీడీపీ పోకడ… అందుకే పవన్ కల్యాణ్ అలక పాన్ను ఎక్కాడు… అందుకే తన అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తపరుస్తున్నాడు…

ఇది ఇంకా ముదరబోతోంది… దూరం పెరగబోతోంది… తను కేబినెట్ మీటింగులకే కాదు, అధికారిక కార్యక్రమాలకు కూడా వెళ్లడం లేదు… ఏకంగా నాలుగు కేబినెట్ భేటీలకు గైర్హాజరు అంటే మామూలు విషయం కాదు… అసెంబ్లీకి కూడా వెళ్లడం లేదు…

Ads

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ కార్యక్రమానికి వెళ్లలేదు గానీ, వైజాగ్‌లో కుంకి ఏనుగుల కార్యక్రమానికి వెళ్లాడు, అంటే తను ఇక సొంత దారిలో నడవటానికి నిశ్చయించుకున్నాడా..? ఇదుగో, ఇలాంటి బోలెడు విశ్లేషణలు, ప్రశ్నలు, కథనాలు కనిపిస్తున్నాయి…

పవన్ కల్యాణ్

డౌట్ లేదు, పవన్ కల్యాణ్ రాజకీయ ధోరణి, వ్యవహార శైలి ఎప్పుడూ స్థిరంగా ఉండదు, చంచలం… అటు రెడ్డి, ఇటు కమ్మ, నడుమ ఈ కాపు… ప్రస్తుత ఏపీ రాజకీయ ముఖచిత్రం ఇదే… కానీ కీలకమైన భేటీలకు తన గైర్హాజరు వెనుక అసంతృప్తి ఉండవచ్చుగాక, సంకేతాలను పంపిస్తూ ఉండవచ్చుగాక… బీజేపీ, టీడీపీ దీన్ని ఎలా స్వీకరించి, దిద్దుబాటుకు దిగుతాయా, వదిలేస్తాయా అనే ప్రశ్నకు తక్షణం జవాబు దొరక్కపోవచ్చుగాక…

కానీ… మరో ప్రధాన కారణాన్ని మాత్రం ఇగ్నోర్ చేయలేం… అది తన అనారోగ్యం… ఇది సాకు కాదు, చాలా సీరియస్ ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నాడు తను… స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు… స్పష్టంగా ఇదీ తన వ్యాధి అని ఎవరూ చెప్పరు, చెప్పడం లేదు గానీ… తను సఫర్ అవుతున్నాడు బాగా… మునుపటి పవన్ కల్యాణ్ కనిపించడానికి చాలా ప్రయాస, చాలా ప్రయత్నం, చాలా కాలం పడుతుంది… అది నిజం…

ఇప్పుడు తను కేరళకు వెళ్తున్నాడు… 20 రోజుల పాటు ఏదో ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రంలో చికిత్స చేయించుకోనున్నాడు… అందుబాటులో ఉన్న వైద్య సమాచారాన్ని కలిపి చూస్తే ప్రధాన సమస్య చాలాకాలంగా ఉన్న రెండు భుజాల Rotator Cuff గాయాలు, ముఖ్యంగా కుడి భుజం సమస్యగానే కనిపిస్తోంది…

జూన్‌లో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నప్పుడు రెండు భుజాల్లోనూ తీవ్రమైన rotator-cuff గాయాలు ఉన్నట్లు సమాచారం… జూలైలో కుడి భుజానికి సుమారు 3.5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది… కానీ పూర్తిగా సెట్ అయినట్టు లేదు… ఇది కొత్తగా బయటపడిన ఏదో పెద్ద వ్యాధి చికిత్స కంటే సర్జరీ అనంతర దీర్ఘకాలిక రిహాబిలిటేషన్ అయ్యే అవకాశం ఎక్కువ…

సర్జరీ అంటే పని అయిపోయినట్టేమీ కాదు. Rotator-cuff surgery తర్వాత భుజానికి కదలిక, కండరాల బలం తిరిగి రావడానికి నెలల తరబడి physiotherapy అవసరం కావచ్చు. పవన్‌కు కూడా విశ్రాంతి, physiotherapy, వైద్య పర్యవేక్షణ అవసరమని అప్పట్లో వైద్యులు సూచించినట్లు వార్తలు వచ్చాయి…

ప్రస్తుతం వస్తున్న కథనాల ప్రకారం 20 రోజుల కేరళ పర్యటనలో ప్రకృతి వైద్యం, physiotherapy, ఆయుర్వేద పంచకర్మ, recovery/ detox విధానాలు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి అధికారిక మెడికల్ బులెటిన్‌గా కాదు, మీడియా రిపోర్టు… సో, రాజకీయ అసంతృప్తి కోణంకన్నా తన దేహం తన మాట వినడం లేదు అనే మరో ప్రధాన కారణాన్ని కూడా ఇగ్నోర్ చేయలేం…

తనకు ఇంకా రెండో భుజానికి కూడా ఆపరేషన్ అవసరం కావచ్చని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి… అదే కాదు, “శరీరానికి పూర్తిస్థాయి రికవరీ టైమ్ అవసరం” అనేదే బలమైన సంకేతం… పవన్ కల్యాణ్‌కు asthma, back pain వంటి పాత ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టున్నాయి… తనకు స్పైన్ సమస్య తిరగబడుతోందా..?

అసలు స్పష్టత ఆ క్యాంపు నుంచే రానప్పుడు… ఈ అసంతృప్తి సంకేతాలు, రాజకీయంగా సొంత దారి, కూటమిలో లుకలుకలు వంటి కథనాలు రావడానికి సహజంగానే అవకాశం ఉంటుంది కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Irumudi – ఆ పాత రవితేజ కమ్ బ్యాక్ ! వరుస ఫెయిల్యూర్లకు బ్రేక్ !!
  • అసంతృప్తి ఉండొచ్చుగాక – కానీ శరీరమే తన మాట వినడం లేదు !!
  • సీఎం ఆత్మగౌరవం మీద దెబ్బ ! ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం !!
  • RIP… చీకట్లు తొలగి… రామోజీ ఆత్మ నిజంగా శాంతించుగాక!
  • జై గురువాయూరప్ప ! పదేళ్ల తరువాత ‘ఖండాంతర పెళ్లి’ జరిపించాడు !!
  • ఒకే హిందీ గీతం – తెలుగులోకి రెండు విధాలుగా – రాసింది ఒక్కడే !!
  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions