Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!

August 24, 2026 by M S R

.

అసహ్యం ! బళ్లు, కాలేజీలు దేవాలయాలు అని కూసిందెవడో కనిపిస్తే బాగుండు… పొట్టుపొట్టు కొట్టాలి ఓసారి… నిన్నటి వార్తలు చదివితే అనిపించింది ఇదే… లేకపోతే పూలమ్మి, పాలమ్మి కొన్ని వేల కోట్లు ఆర్జించిన మల్లారెడ్డి తన కాలేజీల్లో పక్కా ‘టాక్సిక్’ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్ చేయబూనడం ఏమిటి..?

తన కాలేజీల ప్రమాణాల గురించి వింటున్నదే… సదభిప్రాయం ఎప్పుడూ లేదు… మల్లారెడ్డే చెబుతుంటాడు కదా, వందల ఎకరాలున్నయ్ అని… ఎట్లొచ్చినయ్ అని సమాజం అడగదు… సీట్ల టికెట్లు చేతిలో పెట్టి మొక్కే ఏ పార్టీ వాడూ అడగడు…

Ads

అధికారం, హోదాతో మరింతగా ఆస్తి విస్తరణ, రక్షణ… సరే, చాలామంది నాయకులూ అంతే… కానీ మరీ ఓ వెగటు, రోత సినిమా ప్రిరిలీజుకు ఏకంగా కాలేజీల సముదాయాన్ని ఎంచుకోవడం, అదీ యాజమాన్యమే దగ్గరుంచి ఏర్పాట్లు చూసుకోవడం అసహ్యం అనిపించింది… ఆ సినిమా పేరే టాక్సిక్… అవును, ఇది ఓ కొత్త టాక్సిక్ ధోరణి…

సంధ్య తొక్కిసలాట తరువాత ఇక ఎవడికీ ప్రిరిలీజుల్లేవు, టికెట్ రేట్ల పెంపుల్లేవు, బెనిషిట్ షోలు లేవు అంటూ ఎన్నో చెప్పింది ప్రభుత్వం… మళ్లీ అన్నీ షురూ… చివరకు ఇప్పుడు ఏకంగా కాలేజీలే సినిమా ఫంక్షన్ల వేదికలు !! ఆ విద్యార్థులు చాలు, సభాప్రాంగణం కిటకిట… తోలుకొచ్చిన మంద కాదు, యవ్వనంలో ఉన్న ఆ పిల్లల కేరింతలు, స్టెప్పులు, నినాదాలు, జోష్… సినిమా నిర్మాతకు ఇంకేం కావాలి..?

చివరకు సినిమా ఫంక్షన్లు నిర్వహించి సంపాదించాలనుకునే ఆ పవిత్ర దేవాలయాల ఓనర్లకు ఎంత జోష్..? దానికి పర్మిషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వానిది ఎంత దార్శనికత? ఎంత ఆదర్శం? ఓ మలయాళీ మహిళా డైరెక్టర్, ఓ కన్నడ నెగెటివ్ హీరో కాంబోలో రూపొందిన ఆ  టాక్సిక్ సినిమా ట్రెయిలర్ చూస్తేనే అర్థమవుతుంది అదెలాంటి సినిమాయో… దాన్ని లోతుగా అర్థం చేసుకునే జ్ఞానం పిల్లలకు ఉండదు, సినిమాలోని పాత మలయాళీ మసాలా సీన్లు తప్ప !

టాక్సిక్

ఏం జరిగింది..? విద్యార్థులు అనుకున్నట్టుగానే పోటెత్తారు… కంట్రోల్ ఏముంటుంది..? యశ్ స్టేజ్ మీద మాట్లాతుండగా, వేదిక దగ్గర ఏర్పాటు చేసిన భారీ సౌండ్ బాక్స్ సిస్టమ్, మెటల్ ఫ్రేమ్ స్టాండ్‌లపైకి కొంతమంది యువకులు ఎక్కారు. ఒక్కసారిగా బరువు పెరగడంతో ఆ స్ట్రక్చర్ కుప్పకూలి కింద ఉన్న జనాలపై పడింది.

ఈ ప్రమాలంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక విద్యార్థికి కాలు విరగగా, మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి, ఒక యువతి స్పృహ కోల్పోయినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

toxic-pre-release-event

తగిన భద్రతా చర్యలు పాటించకపోవడం, అనుమతికి మించి జనాలను అనుమతించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణాలపై పేట్‌బషీరాబాద్ పోలీసులు యూనివర్సిటీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారట..,. కానీ అనుమతి ఇచ్చిందెవరు..? కాలేజీలను ఇలాంటి ఈవెంట్లకు వేదికల్ని చేసే నిర్ణయం తీసుకున్న ఆ మహానుభావుడెవరు..? కొత్తగా ఈ దందా మొదలెట్టిన వారిపై ఏం కేసులు పెట్టాలి..?

toxic

ఈ మొత్తం ఎపిసోడ్‌లో మరింత దారుణంగా అనిపించింది ఏమిటంటే..? మీరు సహకరించకపోతే ఇకపై మన కాలేజీల్లో ఇలాంటి ఫంక్షన్లను మళ్లీ నిర్వహించబోం అని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి విద్యార్థులపై ఆగ్రహం ప్రదర్శించడం… సో, వాళ్లు ఫిక్సయ్యారన్నమాట, ఇక ఇలాంటి ఫంక్షన్లు ఎడాపెడా జరిపేయడమే… రేవంత్ రెడ్డికి అంతా తెలిసే జరుగుతోందా ఇదంతా..? పైగా మల్లారెడ్డితో ఉప్పునిప్పు యవ్వారం అంటారు కదా, ఇదేమిటి మరి !!

సార్, మోదీషా సార్, మూడు అసెంబ్లీ టికెట్లు, ఒక ఎంపీ టికెట్ కావాలి, వచ్చేస్తాం, దేశవ్యాప్తంగా మా టాక్సిక్ యూనివర్శిటీ దందాను విస్తరిస్తాం, ప్లీజ్ కోఆపరేట్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions