నిజానికి ఆ ఇద్దరు వ్యాపారులను తిట్టాలో మెచ్చుకోవాలో అర్థం కాదు… అదే… స్పేస్ ట్రావెల్ అని కొత్త దుకాణాలు స్టార్ట్ చేశారు కదా… వారం కింద వర్జిన్ గ్రూపు ఓనర్ బ్రాన్సన్ స్పేస్‌లోకి తన టూరిస్ట్ క్యాప్సూల్‌లో వెళ్లొచ్చాడు… ఇప్పుడు అమెజాన్ బాస్, బ్లూ ఆరిజన్ ఓనర్ జెఫ్ బెజోస్ కూడా తన న్యూషెపర్డ్ క్యాప్సూల్‌లో స్పేస్‌లోకి వెళ్లొచ్చాడు… 1) వాళ్లే సొంతంగా, భయపడకుండా వెళ్లొచ్చారు కాబట్టి, రాబోయే పర్యాటకులకు ధైర్యం, సో, మార్కెటింగ్ కోణంలో వాళ్లు చేసింది సూపర్… 2) ఈ రెండూ తూతూ మంత్రం టూరిస్ట్ ప్రయాణాలు… ఎందుకంటే, 80 కిలోమీటర్ల వలయాన్ని, కర్మన్ లైన్ అనే ఊహాత్మక ప్రాంతాన్ని అంతరిక్ష పరిశోధన సమాజం పెద్దగా పట్టించుకోదు… అది దాటితే ఇక రోదసిలోకి వచ్చినట్టే అనే వాదననూ అంగీకరించదు… అది దాటాలి, కాసేపు స్పేసులో నిలవాలి, అప్పుడే రోదసిని టచ్ చేసినట్టు… కానీ వర్జిన్ బ్రాన్సన్ ఆ కర్మన్ లైన్ దాటి 4 నిమిషాలు కూడా లేడు… పైగా అది రోదసే కాదు అనేది విమర్శ… ఇక జెఫ్ బెజోస్ ప్రయాణం కేవలం పది నిమిషాలు… 100 కిలోమీటర్ల దాకా పోయాడు అంటున్నారు గానీ కన్ఫరమ్ కావాలి… జస్ట్, అలా వెళ్లి ఇలా వచ్చేశారు… అంతే…
Ads
రోదసిలో కనీసం ఒకరోజైనా ఉండకుండా… ఇలా రాకెట్ వేగంతో… అక్షరాలా… రాకెట్ వేగంతో వెళ్లి, అదే వేగంతో కిందకు వచ్చేయడం స్పేస్ టూరిజమా..? ఇదేం మోసం అనేది ఒక కోణం……. కానీ ఎన్నో పైలట్ టెస్టుల తరువాత, ఏళ్ల తరువాత… ప్రైవేటురంగం సొంతంగా స్పేస్ షటిల్స్ తయారు చేసుకుని, క్షేమంగా రోదసిని టచ్ చేసి రావడం ఓ సాహసం, ఓ విజయం… ఇది మరో కోణం… రాబోయే రోజుల్లో ఇంకా పర్ఫెక్షన్ వస్తే ఇంకా దూసుకుపోయే చాన్స్ ఉంది… సో, ఈ రెండు ప్రైవేటు స్పేస్ టూరిజం క్యాప్సూల్స్ ప్రయాణానికి మంచీ ఉంది, నెగెటివ్ కోణమూ ఉంది… అందుకని ఆ చర్చను మనం వదిలేద్దాం… ఇక్కడే… వర్జిన్ క్యాప్సూల్‌లో మన బండ్ల శిరీష వెళ్లొచ్చింది… మరి ఈ అమెజాన్ వాళ్ల క్యాప్సూల్ గొప్పతనం ఏముంది..?
ఇదుగో వీళ్లే న్యూషెపర్డ్లో స్పేసులోకి వెళ్లొచ్చింది… దీనికి కమాండర్, కెప్టెన్ 82 ఏళ్ల ఫంక్ వాలీ… ఆమె గురించి కూడా ‘ముచ్చట’ ఇంతకుముందే ఓ కథనంలో చెప్పింది… గ్రేట్ ఇన్స్పిరేషన్ ఆమె… ఆమెకు చప్పట్లు కొట్టాలి మనం… అలాగే అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్, ఆయన తమ్ముడు మార్క్ కూడా స్పేస్ క్రాఫ్ట్‌లో వెళ్లొచ్చారు… వాళ్ల ధైర్యానికి, కమిట్మెంటుకు కూడా ప్రశంసలు అందిద్దాం… మరి నాలుగో వ్యక్తి ఎవరు..? ఒలివర్ డేమెన్… 18 ఏళ్ల పిల్లాడు… గత డిసెంబరులోనే గ్రాడ్యుయేషన్ పూర్తయింది… తనది నెదర్లాండ్స్… తండ్రి జోయెస్… పెద్ద వ్యాపార సంస్థ హెడ్జ్‌ఫండ్ సోమర్సెట్ కేపిటల్ పార్టనర్స్‌కు ఫౌండర్, సీఈవో తను… అమెజాన్ అడిగినంత డబ్బు చెల్లించి, ఈ క్యాప్సూల్‌లో ఎక్కించాడు… ఈ ప్రపంచపు మొట్టమొదటి పెయిడ్ ఆస్ట్రో టూరిస్ట్ ఈ పిల్లాడే… అదీ విశేషం… 2.8 కోట్ల డాలర్లు చెల్లించినట్టు వార్తలు… 159 దేశాలకు చెందిన 7600 మంది ఈ ఫస్ట్ టికెట్ కోసం వేలంపాటలో పాల్గొన్నారు… ఈ ప్రపంచంలోకెల్లా ఇప్పటికి అత్యంత ఖరీదైన టికెట్టు ఇది… అదీ మనం చెప్పుకునేది… అంతే… డబ్బులున్నోడు అంటార్కిటికా మాత్రమే కాదు బాసూ… అంతరిక్షమూ వెళ్లగలడు, అంగారక గ్రహమూ వెళ్లగలడు… డబ్బు పవర్ అది… అది రాకెట్‌ను మండించే ఇంధనంకన్నా శక్తివంతమైంది…!! (స్టోరీ మీకు నచ్చితే దిగువన డొనేట్ బటన్ నొక్కి ముచ్చటకు అండగా నిలవండి…)
Share this Article