Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎంతగా బుర్ర చించుకున్నా- ఈ హోదా ఏమిటో అర్థం కాలేదు !!

September 5, 2026 by M S R

.

అప్పుడప్పుడూ రవాణా, పోలీసు శాఖలు భారీగా రంగంలోకి దిగిపోయి… వాహనాల మీద ఉన్న స్టిక్కర్లన్నీ పీకేయిస్తారు లేదా జరిమానాలు వేస్తారు… ప్రధానంగా PRESS అని కనిపిస్తే చాలు మరింత పర్టిక్యులర్‌గా… మరి ప్రభుత్వ వాహనం అని ఏకంగా నేమ్ ప్లేటు మీదే రాసి ఉంటే… రకరకాల పార్టీల హోదాలు, చిన్నాచితకా అధికార పదవుల్ని ఎర్ర అక్షరాలతో అతికించి ఉంటే..? వీళ్లకు నెంబర్ ప్లేట్ రూల్స్ ఎందుకు గుర్తుకురావు?

ఆమధ్య హైదరాబాదులో ఓ ఆటో డ్రైవర్‌ దేవుడి మీద, మతం మీద అభిమానాన్ని చాటుకునే ఏదో స్టిక్కర్ అతికించుకుంటే, పోలీసులు బెదిరించి, కేసు పెడతామని చెప్పి, స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించి నానా కథలూ పడ్డారు, ఆ వార్త తెలుసు కదా… వాహనాల మీద తమకిష్టమైన దేవుళ్ల స్టిక్కర్లు, బొమ్మలు అతికించుకోవడం పరిపాటే…

Ads

కానీ ఒక ఫార్చూనర్ కారు కనిపించింది… ఇదయితే అరాచకం… కాసేపు తేరిపార చూసినా ఏమీ సమజ్ కాలేదు… పోలీసులకు ఇవెందుకు కనిపించవు..? ఈ ఫోటో చూడండి…

నంబర్ ప్లేట్

National crime investigation commission అట… ఎర్రటి బ్యాక్ గ్రౌండ్‌లో… నేషనల్ కదా, హిందీలో కూడా రాయించారు… పరికించి చూడండి, తెలంగాణ స్టేట్ అట… మినిస్ట్రీ ఆఫ్ MSME అట… పక్కనే దీనికి మరింత వాల్యూ వచ్చేలా రెండు ఎంబ్లమ్స్… మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫయిర్స్ అట, కుడి పక్కన ఈ కమిషన్ లోగో… ఈ సంస్థకు వైస్ చైర్మన్ అట…

ఓహో, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఏకంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కమిషన్ ఉంటుందట… అదేదో సీబీఐ, ఈడీ, ఇంటర్ పోల్ తరహాలో… పైగా మినిస్ట్రీ ఆప్ MSME అట… అంటే Micro, Small and Medium Enterprises… ఆ లోగోలకు, ఆ పేర్లకూ ఏమైనా లింకుందా అసలు..? 

నిజానికి వెహికల్ నంబర్ ప్లేట్లు, హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల (HSRP) నిబంధనలు ఇలా ఉంటాయి…  సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం అన్ని వాహనాలకు అల్యూమినియంతో తయారు చేసిన హెచ్‌ఎస్‌ఆర్పీ నంబర్ ప్లేట్లు ఉండటం తప్పనిసరి. నంబర్ ప్లేట్ ఎడమ వైపున నీలం రంగులో ‘IND’ కోడ్ మరియు క్రోమియం-బేస్డ్ అశోక చక్ర హోలోగ్రామ్ ఉండాలి.

ప్రతి నంబర్ ప్లేట్‌పై ప్రత్యేకమైన 7- అంకెల లేజర్- ఎచ్డ్ సీరియల్ నంబర్ ఉంటుంది, ఇది వాహన డేటాబేస్‌తో అనుసంధానించబడి ఉంటుంది. నంబర్ ప్లేట్‌లను తొలగించడానికి వీలులేని విధంగా వన్-టైమ్ స్నాప్-లాక్‌లతో బిగించాలి. (ఇంధన రకాన్ని బట్టి) పెట్రోల్/సీఎన్‌జీ వాహనాలకు: నీలం రంగు స్టిక్కర్ , డీజిల్ వాహనాలకు: ఆరెంజ్ రంగు స్టిక్కర్, ఎలక్ట్రిక్ వాహనాలకు: ఆకుపచ్చ రంగు స్టిక్కర్…

ఇష్టానుసారంగా ఫ్యాన్సీ ఫాంట్లు, కులాల పేర్లు, రాజకీయ పార్టీల లోగోలు, ప్రభుత్వ పదవులు లేదా అనధికారిక సంస్థల పేర్లతో కూడిన బోర్డులను నంబర్ ప్లేట్ పైన లేదా కింద అమర్చడం నిబంధనలకు విరుద్ధం. ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల యవ్వారం ఓ పెద్ద దందా… అది ఇక్కడ అప్రస్తుతం…

ఎడాపెడా చలాన్లు బాదే ట్రాఫిక్ పోలీసులకు ఇలాంటివి ఎందుకు కనిపించవు..? ఆమధ్య ఓ నెంబర్ ప్లేటు మీద ‘MLA contested’ అని కనిపించింది… చెప్పుకోవాలంటే ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు కోకొల్లలు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కీలకాంశాల్లోనూ కేసీయార్ వాయిస్‌లో లోపించిన విజ్ఞత!
  • ఎంతగా బుర్ర చించుకున్నా- ఈ హోదా ఏమిటో అర్థం కాలేదు !!
  • ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది
  • గుండు గీకే ప్రోగ్రామ్ వద్దులే అమ్మాయ్… సినిమా సోసో, నువ్వు పాస్…
  • నింగి నుంచి నిశిత పరిశీలన- నిఘా… మన స్పై శాటిలైట్ విశేషాలివిగో…
  • అబ్బా… ఏం రీసెర్చ్‌రా బాబూ! 2026 ఇగ్ నోబెల్ విచిత్రాలు!!
  • ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!
  • SLT – మనకు పనికిరాని ఉద్యోగిని ప్రత్యర్థికి అంటగట్టడం !!
  • ఈ ‘స్వతంత్ర హస్తం’ కొత్తదేమీ కాదు… ఎనిమిదేళ్ల క్రితమే ‘సవ్యసాచి’!!
  • రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions