Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కీలకాంశాల్లోనూ కేసీయార్ వాయిస్‌లో లోపించిన విజ్ఞత!

September 5, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనినీ కౌంటర్ చేయాల్సిందే అనే ఓ పిచ్చి సిద్ధాంతంతో… కేసీయార్ క్యాంపు యుక్తాయుక్త విచక్షణను కూడా కోల్పోతున్నది… సొసైటీకి ఏది అవసరం, దేన్ని సమర్థించాలి, దేన్ని వ్యతిరేకించాలి అనే సోయి కూడా లేకుండా పోతున్నది… నమస్తే తెలంగాణ ఓ పత్రిక కాదు, అది కేసీయార్ వాయిస్… దాంట్లో ప్రతి అక్షరానికీ కేసీయార్ బాధ్యత వహించాలి… ఆ అజ్ఞాన రాతలకు కూడా..!

వాళ్ల బాధేమిటంటే..? ట్రాన్స్‌కోలో 26 శాతం ప్రైవేటీకరిస్తున్నారు అని..! సో వాట్..? తప్పేముంది…? అడ్డికి పావుశేరు అమ్మేయడం లేదు… ఐపీఓ‌కు వెళ్లాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీ భావిస్తోంది… తరువాత ఆ షేర్లు లిస్టవుతాయి… ప్రభుత్వ ట్రాన్స్‌మిషన్ రంగంలో ప్రజల స్ట్రెయిట్ పెట్టుబడులు వస్తాయి…

Ads

కేంద్ర ప్రభుత్వ సంస్థలు బోలెడు స్టాక్‌మార్కెట్‌లో ఉన్నాయనీ, ఐపీఓలకు కూడా వెళ్లాయనీ, అవన్నీ స్టాక్ ఎక్స్‌చేంజీల్లో లిస్టయ్యాయనీ, రోజూ ట్రేడింగ్ ఉంటుందని తెలియకపోతే ఎలా..? పైగా ట్రాన్స్‌మిషన్ రంగంలో అదొక ప్రభుత్వ ఎంటిటీ… రెగ్యులేటరీ కమిషన్ పరిధిలోనే దాని నిర్ణయాలు ఉంటాయి… ఉండాలి…

transco

ప్రభుత్వ సబ్సిడీలకు దానికీ సంబంధం లేదు… దాని పని ట్రాన్స్‌మిషన్ మాత్రమే… 68 కోట్ల ఆస్తులు అంటారు, కానీ అప్పుల మాటేమిటి..? ప్రైస్‌వాటర్ కూపర్స్ సంస్థ ఓ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ… అది సిఫారసులు చేస్తుంది గానీ నిర్ణయాలు తీసుకోదు… నడుమ సెబీ ఉంటుంది…

కేంద్ర ప్రభుత్వం నవరత్న కంపెనీల నుంచే పెట్టుబడుల్ని క్రమేపీ కొంచెం కొంచెం ఉపసంహరించుకుంటూ ఉంది… తప్పదు… బాధ్యతారాహిత్యం నుంచి బయటపడి ప్రభుత్వ కంపెనీల్లో జవాబుదారీతనం పెరగాలంటే తప్పదు… ఇదే కాదు, ఏ సంస్కరణలకైనా మొదట్లో అడ్డంకులు, ప్రతిఘటన ఉంటాయి…

ఓసారి గుర్తు తెచ్చుకొండి… బ్యాంకుల్లో కంప్యూటర్లు పెడతానంటే కూడా అడ్డుకున్నాయి బ్యాంకుల్లోని ట్రేడ్ యూనియన్లు… ఈరోజుకూ ప్రభుత్వ బ్యాంకుల నుంచే లక్షల కోట్లను తీసుకున్న అక్రమార్కులు ఎగ్గొడుతున్నారు… అందులో బ్యాంకు ఉన్నతాధికారుల పాపమే ఎక్కువ… కంప్యూటర్లు లేని, ఆన్‌లైన్, ఏటీఎం, యూపీఐ లేని బ్యాంకు సేవల్ని ఓసారి ఊహించుకొండి… ఇదొక ఉదాహరణ మాత్రమే…

power

బీఎస్ఎన్‌ఎల్- ఇతర ప్రైవేటు సర్వీస్ ఆపరేటర్లు… ఒక టెలిఫోన్ కావాలంటే ఎంపీలు సిఫారసు చేయాల్సిన కాలం చూశాం… అసలు ఇన్ని రాస్తోంది కదా నమస్తే తెలంగాణ అనబడే కేసీయార్ కరపుత్రిక… ఇదే కేసీయార్ ‘నా పాలనలో ఇక ఔట్ సోర్సింగ్, కంట్రాక్టు కొలువులు ఉండవు’ అని ఉరిమాడు… తరువాత ఏమైంది..? లక్షల మందిని పెట్టారు, అందులోనూ అక్రమాలు, అసలు ఫేక్ పేర్లు రాసేసి కోట్లు కొల్లగొట్టాయి ఏజెన్సీలు..!!

సో, చెప్పేదానికీ, చేసేదానికీ తేడా ఇది… ఎస్, పవర్ ప్లాంట్లలో కొన్ని పనుల్ని ఔట్ సోర్సింగుకు ఇస్తున్నారని మరో రాద్దాంతం… సో వాట్..? తప్పేముంది..? నాణ్యత, జవాబుదారీతనం కోసం తప్పదు… పవర్ ప్లాంట్లను అమ్మేయడం లేదు… కేసీయార్‌లాగా కాలం చెల్లిన, దిక్కుమాలిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని తెచ్చి వేల కోట్ల ప్రజాధనాన్ని భ్రష్టుపట్టించడం కాదు కదా ఇది…

నిజానికి పవర్ సెక్టార్‌లో ప్రైవేటు రంగం లేకపోతే పవర్ లేదు, ఇళ్లల్లో గుడ్డిదీపం కూడా వెలగదు, ఇది రియాలిటీ… ప్రభుత్వ రంగ ఉత్పత్తి సంస్థలు నానా అవలక్షణాలతో కునారిల్లుతుంటే ప్రైవేటు, కార్పొరేట్ ప్లాంట్లు లాభాలు గడిస్తున్నాయి… అనేక ప్రైవేటు ప్లాంట్లు, ఎక్స్‌చేంజీలు… అన్నీ రెగ్యులేటరీ కమిషన్ల పరిధుల్లోకి వచ్చేవే… అందుకే రాజకీయం, పాత్రికేయంలో అత్యవసరం విజ్ఞత, వివేచన…!! సమాజం పట్ల బాధ్యత!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కీలకాంశాల్లోనూ కేసీయార్ వాయిస్‌లో లోపించిన విజ్ఞత!
  • ఎంతగా బుర్ర చించుకున్నా- ఈ హోదా ఏమిటో అర్థం కాలేదు !!
  • ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది
  • గుండు గీకే ప్రోగ్రామ్ వద్దులే అమ్మాయ్… సినిమా సోసో, నువ్వు పాస్…
  • నింగి నుంచి నిశిత పరిశీలన- నిఘా… మన స్పై శాటిలైట్ విశేషాలివిగో…
  • అబ్బా… ఏం రీసెర్చ్‌రా బాబూ! 2026 ఇగ్ నోబెల్ విచిత్రాలు!!
  • ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!
  • SLT – మనకు పనికిరాని ఉద్యోగిని ప్రత్యర్థికి అంటగట్టడం !!
  • ఈ ‘స్వతంత్ర హస్తం’ కొత్తదేమీ కాదు… ఎనిమిదేళ్ల క్రితమే ‘సవ్యసాచి’!!
  • రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions