Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బా… ఏం రీసెర్చ్‌రా బాబూ! 2026 ఇగ్ నోబెల్ విచిత్రాలు!!

September 5, 2026 by M S R

.

నోబెల్ ప్రైజులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలువ తెలుసు కదా… కానీ వాటికీ పేరడీలు ఉంటాయి… అవీ ఆసక్తికరంగా చదువుతారు జనం… సరదాగా… ఎవరికీ వెక్కిరింపులు కాదు… పైగా ఆలోచనాత్మకం కూడా… రెండు మూడు ఉదాహరణలు మొదట చెప్పుకుందాం… ఇవి తాజా 2026 ఇగ్ నోబెల్ అవార్డులు…

ముక్కు ఎలా చీదాలి? (మెడిసిన్ ప్రైజ్): దివంగత డాక్టర్ టోకుజి ఉన్నో ఏకంగా ముక్కును ఎలా చీదాలి అనేదానిపై ఓ పెద్ద ఏరోడైనమిక్ అధ్యయనాన్నే చేశాడు…

Ads

గోరు పెరుగుదల (సాహిత్య బహుమతి): విలియం బి. బీన్ అనే శాస్త్రవేత్త తన చేతి గోరు ఎలా పెరుగుతుందో ఏకంగా 35 ఏళ్ల పాటు రికార్డ్ చేసి విశ్లేషించాడు!

బూట్ల వాసన (ఇంజనీరింగ్ డిజైన్): దుర్వాసన వచ్చే బూట్లు షూ-రాక్ అనుభూతిని ఎలా పాడుచేస్తాయో ఇంజనీరింగ్ కోణంలో విశ్లేషించాడు…

ఇవన్నీ ఫేక్ పరిశోధనలు కావు, జరిగినవే… కానీ ఈ అవార్డులు ఇవ్వడానికి కారణం ఉత్త అబ్సర్డ్ పరిశోధనలు అని తేల్చేయడం, అదే సమయంలో వాటికి మరోరకం గుర్తింపు తీసుకురావడం…

ప్రపంచంలో ఎవరికైనా మెదడుకి పదును పెట్టే పరిశోధనలు చేయాలని ఉంటుంది. కానీ, కొంతమంది మాత్రం ఏకంగా “ఎవరికీ రాని, పనిెకిరాని సందేహాలు” తెచ్చి శాస్త్రలోకానికి వడ్డించుకుంటారు. అలా జనాలను కడుపుబ్బా నవ్విస్తూనే, ఆశ్చర్యపరిచే పరిశోధనలకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇగ్ నోబెల్’ (Ig Nobel) అవార్డుల వేడుక 2026 సెప్టెంబర్ 3న స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో అట్టహాసంగా జరిగింది!

35 ఏళ్లుగా అమెరికాలోనే జరుగుతూ వచ్చిన ఈ తంతు, ఈసా రికాస్త వీసా సమస్యల వల్ల ఐరోపా గడ్డపైకి షిఫ్ట్ అయింది. మరి ఈ ఏడాది ఎవరెవరు ఎలాంటి వెరైటీ పరిశోధనలతో ఈ అవార్డులను దక్కించుకున్నారో ఒక లుక్కేద్దాం రండి…


Ig awards


1. ముద్దుల ముచ్చట (జీవమెకానిక్స్ ప్రైజ్): మాటిల్డా బ్రిండిల్, స్టువర్ట్ వెస్ట్ నేతృత్వంలోని రీసెర్చర్లు కలిసి ఏకంగా “ముద్దు” (Kissing) మీదే ఓ రీసెర్చ్ పేపర్ వదిలారు. చీమలు, పక్షులు, ధ్రువ ఎలుగుబంట్లు మొదలుకొని మనుషుల వరకు అన్ని జాతులు పెట్టుకునే ముద్దులకు ఒక పక్కా శాస్త్రీయ నిర్వచనం ఇచ్చేశారు. అదేంటంటే—”ఆహార మార్పిడి లేకుండా, పెదవులు లేదా నోటి భాగాల కదలికలతో ఒకే జాతి జీవుల మధ్య జరిగే ఓరల్-ఓరల్ కాంటాక్ట్”. బాబోయ్, ముద్దుకు కూడా ఇన్ని అర్ధాలున్నాయా అని ఎవరైనా తలపట్టుకోవాల్సిందే!

2. బొద్దింకల పాలు (కెమిస్ట్రీ ప్రైజ్): కొన్ని రకాల బొద్దింకలు (Viviparous cockroaches) పిల్లలకు పాలు ఇస్తాయని, ఆ బొద్దింకల పాలలో ఆవు పాಲ కన్నా ఏకంగా మూడు రెట్లు ఎక్కువ శక్తినిచ్చే ప్రొటీన్లు ఉంటాయని మన సైంటిస్టులు నిరూపించారు. రేపు పొద్దున జిమ్‌కు వెళ్లే కుర్రాళ్ళు బాడీ బిల్డింగ్ కోసం ‘కాక్రోచ్ మిల్క్ షేక్’ అడిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు!

3. అండర్‌వేర్‌లతో మట్టి పరీక్ష (సాయిల్ సైన్స్ ప్రైజ్): ఫ్రాంజ్ బెండర్, మార్సెల్ వాన్ డెరెన్ తదితరులు కలిసి సరికొత్త ప్రయోగం చేశారు. మట్టి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఏకంగా 25 దేశాల్లో 1,000 జతల సరికొత్త అండర్‌వేర్‌లను భూమిలో పాతిపెట్టారు. రెండు నెలల తర్వాత వాటిని తవ్వి చూసి మట్టి క్వాలిటీని బేరీజు వేసేశారు!

4. ముక్కు ఎలా చీదాలి? (మెడిసిన్ ప్రైజ్): దివంగత డాక్టర్ టోకుజి ఉన్నో గతంలోనే “ముక్కును ఎలా చీదాలి?” అనే దానిపై ఏకంగా నాసా రాకెట్ సైన్స్‌లా ఒక ఏరోడైనమిక్ అధ్యయనం చేశారు. ఈ ఏడాది ఆయనకు మరణానంతరం ఈ పురస్కారం దక్కగా, ఆయన సహచరులు దీన్ని స్వీకరించారు.

5. దోమలతో 3D ప్రింటింగ్ (టెక్నాలజీ ప్రైజ్): జస్టిన్ పూమ, ఆయన బృందం దోమల తొండాలను (Proboscises) ఉపయోగించి హై-సొల్యూషన్ 3D ప్రింటింగ్ నాజిల్స్‌గా వాడొచ్చని నిరూపించి ‘నెక్రో ప్రింటింగ్’ (Necroprinting) అనే కొత్త టెక్నాలజీని తెరపైకి తెచ్చారు.

…. అర్థమైంది కదా… అసలు ఈ అవార్డులిచ్చేది ఎవరు? ఈ విచిత్రమైన అవార్డులను ‘అనల్స్ ఆఫ్ ఇంప్రాబబుల్ రీసెర్చ్’ (AIR) అనే డిజిటల్ మ్యాగజైన్ నిర్వహిస్తుంది. ఈ వేడుకలో బహుమతి గెలుచుకున్న వారికి ఇచ్చే ట్రోఫీ కూడా చాలా వెరైటీగా ఒక పుట్టగొడుగు, మనిషి కాలు కలిసి ఉన్నట్లు ఉంటుంది! అసలు నిజమైన నోబెల్ గ్రహీతలే స్వయంగా వచ్చి ఈ నవ్వుల పురస్కారాలను విజేతలకు అందజేయడం విశేషం.

మొత్తానికి, సైన్స్ అంటే కేవలం పెద్ద పెద్ద ప్రయోగాలే కాదనీ, ఇలాంటి పిచ్చి పిచ్చి సందేహాలకు శాస్త్రీయ రూపం ఇవ్వడంలో కూడా ఎంత మజా ఉందో ఈ ‘ఇగ్ నోబెల్స్’ ప్రతిసారీ నిరూపిస్తుంటాయి.

సరదాగా గత ఏడాది ఒకటీరెండు ముఖ్యమైన ఇగ్ నోబెల్స్ గురించి చెప్పాలంటే…

పోషణ బహుమతి (Nutrition Prize): టోగో దేశంలోని ఒక సముద్రతీర రిసార్ట్‌లో రంగురంగుల బల్లులు (Rainbow Lizards) ఏ రకమైన పిజ్జాలను తినడానికి ఇష్టపడతాయో పరిశోధించారు.

పీడియాట్రిక్స్ బహుమతి (Pediatrics Prize): పాలు తాగే పసిపిల్లల తల్లులు వెల్లుల్లి తిన్నప్పుడు, ఆ పాలు తాగే పిల్లలకు ఆ రుచి ఎలా అనుభవంలోకి వస్తుందనే దానిపై అధ్యయనం చేశారు.

జీవశాస్త్ర బహుమతి (Biology Prize): ఆవులకు జీబ్రాలలాగా చారలు పెయింట్ వేస్తే ఈగలు కుట్టకుండా తప్పించుకోవచ్చా అని ప్రయోగాలు చేసి నిరూపించారు.

కెమిస్ట్రీ బహుమతి (Chemistry): కేలరీలు పెరగకుండా కడుపు నిండిన అనుభూతి కలగాలంటే ప్లాస్టిక్ జాతికి చెందిన ‘టెఫ్లాన్’ (Teflon) తినడం మంచిదా కాదా అని పరిశోధనలు జరిపారు.

శాంతి బహుమతి (Peace Prize): మద్యం సేవించడం వల్ల కొన్నిసార్లు విదేశీ భాషల్లో మాట్లాడే నైపుణ్యం మెరుగవుతుందని నిరూపించారు!

ఇంజనీరింగ్ డిజైన్ బహుమతి (Engineering Design): దుర్వాసన వచ్చే బూట్లు షూ-రాక్ అందాన్ని, అనుభూతిని ఎలా పాడుచేస్తాయో ఇంజనీరింగ్ కోణంలో విశ్లేషించారు.

ఏవియేషన్ బహుమతి (Aviation Prize): గబ్బిలాలు ఆల్కహాల్ సేవిస్తే వాటి ఎగిరే సామర్థ్యం, దారులను గుర్తించే ఎకోలోకేషన్ శక్తి ఎలా దెబ్బతింటాయో అధ్యయనం చేశారు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అబ్బా… ఏం రీసెర్చ్‌రా బాబూ! 2026 ఇగ్ నోబెల్ విచిత్రాలు!!
  • ప్రతిపక్ష నేతగానూ పనికిరావ్… కేసీయార్‌‌పై ఇదోరకం అభిశంసన!
  • SLT – మనకు పనికిరాని ఉద్యోగిని ప్రత్యర్థికి అంటగట్టడం !!
  • ఈ ‘స్వతంత్ర హస్తం’ కొత్తదేమీ కాదు… ఎనిమిదేళ్ల క్రితమే ‘సవ్యసాచి’!!
  • రంభ ఊర్వశి మేనక..! కామెడీ అంటే వీళ్లకు మరీ కామెడీ అయిపోయింది!
  • ఇటు రేవంత్ – అటు ఒవైసీ… ఇద్దరివీ తెలివైన ప్రసంగాలు
  • మహిళా జడ్జిలకు కూడా తప్పని లైంగిక వివక్ష – వేధింపులు !
  • వేణు ఊడుగుల – మరో కొత్త ఆలోచనాత్మక సినిమాకు శ్రీకారం !
  • ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!
  • మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions