Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యాంటీ దళిత్ ! ఒకరినే కాదు- ఆ ఇద్దరినీ బర్తరఫ్ చేస్తారా.?

September 7, 2026 by M S R

.

ఈరోజు తెలంగాణ శాసనసభ వ్యవహారాలపై ఓ సీనియర్ పొలిటికల్ జర్నలిస్టుగా, అనలిస్టుగా నీ నిష్పాక్షిక అభిప్రాయం చెప్పు అనడిగాను ఓ మిత్రుడిని… తన అభిప్రాయాన్ని ఓసారి పరిశీలించి, మనం మిగతాది చెప్పుకుందాం…

‘‘అసెంబ్లీ స్పీకర్ పట్ల ఎమ్మెల్సీ తాతా మధు వాడిన భాష, తిట్టు అత్యంత అనాగరికం, అభ్యంతరకరం… క్షమార్హం కాదు… బర్తరఫ్ చేయడం కరెక్టు… కానీ దాన్ని ఖండించని కేసీయార్ వైఖరి- ఎడమ, కుడి భుజాల వైఖరి మరింత దారుణం… అంటే, సమర్థిస్తున్నట్టు అనుకోవాలా..? అది తన ఇమేజ్‌కు తగిందేనా..? దీన్నే మనం జాతిపిత లక్షణంగా తీసుకోవాలా..?

Ads

నేను ఒక్క స్పీకర్ పట్ల అవమానం ఒక్కటే చూడటం లేదు, స్పీకర్ అయినా సరే, ఎవరినైనా సరే ఓ చట్టసభ సభ్యుడు అలా దూషించడం ఆమోదనీయం కాదు… కానీ కడియం శ్రీహరి పట్ల ఓ తిట్టులాగా ధ్వనించే ఓ సైగను ప్రదర్శించాడు పాడి కౌశిక్ రెడ్డి… అది ఆల్రెడీ సభ ఎథిక్స్ కమిటీ విచారణలో ఉంది…

అంటే బీఆర్ఎస్ తన దళిత వ్యతిరేక పోకడల పట్ల చింతిస్తున్నట్టు కూడా లేదు… సో, మండలిలో ఒకరిని, శాసనసభలో ఒకరిని బర్తరఫ్ చేస్తే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది… ఎలాగూ సభాపక్ష నాయకుడు సీఎం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాడు కూడా…

నిన్న ఫామ్ హౌజులో మీటింగు పెట్టి కేసీయార్ కర్తవ్యబోధ చేశాడు అనగానే మేం ఊహించాం, ప్రచారం కోసం, మైలేజ్ కోసం ఏదో కథ నడిపిస్తారని… ఎవరి పాత్ర వాళ్లు రక్తికట్టించారు, నల్ల టీషర్టు విప్పి పోలీసులపైకి హరీష్ రావు విసరడం కూడా అందులో భాగమే… కానీ స్పీకర్ మీద మధు దూషణలతో అదంతా కొట్టుకుపోయి, దళిత వ్యతిరేకులు అనే నెగెటివ్ ఫలితాన్ని పొందారు…

harish

గతంలో కోమటిరెడ్డి, సంపత్‌లను కూడా సస్పెండ్ చేయటానికి, అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓ హంగామా క్రియేట్ చేసిన తీరు మేం చూశాం… సో, ఇప్పుడు ఓ ఎమ్మెల్సీని, ఓ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేసినా అదేమీ కొత్త నెగెటివ్ ఆనవాయితీని కాంగ్రెస్ స్టార్ట్ చేసినట్టు కూడా ఉండదు, బీఆర్ఎస్‌కు కూడా ఖండించే నైతికత లేదు..’’

… ఇదీ తన విశ్లేషణ… నల్ల దుస్తులతో అసెంబ్లీలోకి వెళ్లి, దాన్ని ఓ ధర్నాచౌక్‌గా మార్చాలనుకున్న బీఆర్ఎస్ పద్దతి కూడా ఏమాత్రం స్వాగతించదగింది కాదు, అలా ‘ఓవర్’ చేయకూడదనే విజ్ఞత ఆ పార్టీలో కనిపించదు కూడా…

speaker

ఇక్కడ రేవంత్ రెడ్డి తెలివిగా బీజేపీని కార్నర్ చేశాడు… ఎలాగూ బీఆర్ఎస్-  బీజేపీ ‘‘గుప్త స్నేహితులే’’ కదా… మీ వైఖరేంటి అనడిగేసరికి, ఇక తప్పనిసరై స్పీకర్ పట్ల దూషణల్ని బీజేపీ ఖండించాల్సి వచ్చింది… సో, దీంతో బీఆర్ఎస్ ఒంటరిదై పోయింది, డిఫెన్సులో పడిపోయింది… కేసీయార్ మౌనం మరింత డ్యామేజ్… ఇక చూడాలి, ఇటు మండలి ఛైర్మన్, అటు అసెంబ్లీ స్పీకర్ ఏ నిర్ణయాలు తీసుకుంటారో..?!



  • తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని నమ్మించి… దళితులకు మూడెకరాలు ఇస్తానని నమ్మించి, దళిత బంధు ఇస్తామని నమ్మించి దళిత ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు…నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులను లారీలతో తొక్కించి చంపారు… ఒక దళితుడిని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడిని చేస్తే పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి ప్రతిపక్ష హోదా నుంచి తొలగించారు…
  • బీఆరెస్‌ది దళిత వ్యతిరేక ఆలోచన, దళిత వ్యతిరేక వైఖరి….. ఇదీ రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశం… అంటే ఇవన్నీ ఈరోజు వ్యవహారాలతో సంబంధం లేనివే కావచ్చుగాక, కానీ బీఆర్ఎస్ దళిత వ్యతిరేక ధోరణిని ఎండగట్టడానికి చాన్స్ తీసుకున్నాడు… కాదు, చాన్స్ ఇచ్చాడు కేసీయార్ !!


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరీ తాతా మధు ? ఈ వికృత దూషణలు ఎక్కడ నేర్చాడు ?
  • యాంటీ దళిత్ ! ఒకరినే కాదు- ఆ ఇద్దరినీ బర్తరఫ్ చేస్తారా.?
  • ‘ తేరా సాయి’ వస్తున్నాడు ! ‘సనాతనం’ ఎలా స్పందించబోతోంది ?
  • ఈవీవీ వెగటు కామెడీ సినిమాలే కాదు – ‘ఆమె’నూ చక్కగా చూపగలడు !!
  • వాడిపై లాఠీలు విరుగుతుంటే జనం చప్పట్లు! ఎందుకంటే!
  • అనుప్రియ ! 21 ఏళ్ల ఈ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ కథ తెలుసా మీకు..?
  • రాజీనామా చేసి, జనంలోకి రావయ్యా — అదే గౌరవం- అదే మర్యాద !!
  • ఇదీ ఓ టాక్సిక్ – బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్ ఓ గ్రాండ్ ఫ్లాప్ షో !!
  • జనం ట్రాక్టర్లలో తరలివస్తున్నారు ! ఇరుముడి ఎందుకు కనెక్టయిందంటే..?!
  • మోదీ వెనుక నీడలా ఓ నాగా మహిళ – ఎవరీమె..? నేపథ్యం ఏమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions