.
కొండంత రాగం తీసి… చివరకు ఏదో చేసినట్టుగా… ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఈ సెషన్‌కు సస్పెండ్ చేశారు, అంతేనా..? ఇక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా..? ఒక దళిత స్పీకర్‌ను అంత ఘోరంగా అవమానించినా చర్యల్లేవా..? అనేకానేక అవినీతి, అక్రమాలపై కేసీయార్, కేటీయార్, హరీష్‌రావులను క్షమించేస్తున్నట్టుగానే ఇందులోనూ రేవంత్ రెడ్డి క్షమాభిక్ష పెట్టినట్టేనా..?
స్పీకర్ కంటతడి పెట్టాడు, హరీష్ ఏదో మాట్లాడబోతుంటే తిట్టింది నా తల్లిని, నీ తల్లిని కాదు అని స్పీకర్ ఉరిమాడు… అందులో ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది… ఆగ్రహ ప్రకటన కూడా ఉంది… తాతా మధు, నవీన్ రెడ్డి ధోరణిని ఖండించింది… కేసీయార్ క్షమాపణను డిమాండ్ చేసింది… మండలిలోనూ ఇదే వేడి… తీరా చూస్తే…
Ads
ఈ సెషన్‌కు సస్పెన్షన్… కేసులు పెట్టి అరెస్టు చేస్తే రిమాండ్‌కు కోర్టు విముఖత… దొరవారి గడీ దగ్గర మోగిన చావుడప్పులు… అది సోకాల్డ్ జాతిపితకు ఓరకంగా సామాజిక అభిశంసన – జాతి అభిశంసన !! సో, మొత్తం ఎపిసోడ్‌లో స్పీకర్‌ను న్యాయం జరిగిందా..? దొరతనం అవశేషాలు మధు, నవీన్‌లను శిక్షించినట్టేనా..? ఇవీ తెలంగాణ సమాజం సంధిస్తున్న ప్రశ్నలు…
లేదు… ఎవరూ ఎవరినీ క్షమించలేదు… ఈ ఇద్దరు ప్లస్ మరో దళితనేత కడియం శ్రీహరిని అవమానించిన కౌశిక్ రెడ్డి భర్తరఫ్ తప్పదు… స్పీకర్ ప్రసాద్‌కుమార్ నేరుగా చర్య తీసుకోవచ్చు, కానీ ఓ ప్రొసీజర్ వైపే మొగ్గు చూపాడు… ఓవర్ టు మండలి అని బాల్‌ను మండలి ఛైర్మన్ గుత్తా కోర్టులోకి పంపించాడు… వాళ్లిద్దరూ మండలి సభ్యులే కాబట్టి…
గతంలో ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డిల సస్పెన్షన్ విషయంలో సరైన ప్రొసీజర్ ఫాలో కాకపోవడంతో సుప్రీంకోర్టు అభ్యంతరపెట్టింది… ప్రొసీజర్ ల్యాప్స్ ప్రస్తావించింది… అందుకని ఈసారి పునాది, బేస్ గట్టిగా ప్రిపేర్ చేస్తున్నారు… ఆల్రెడీ కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ విచారణ నడుస్తోంది… ఈ ఇద్దరు ఎమ్మెల్సీల వ్యవహారాన్ని కూడా ఎథిక్స్ కమిటీకి పంపించబడుతుంది…
సభ స్పీకర్, మండలి చైర్మన్లకు సొంత విచక్షణతో చర్యలు తీసుకునే అధికారం ఉన్నా సరే… ఓ పద్దతి ప్రకారమే, తరువాత లీగల్ చిక్కులు, అడ్డుంకులతో ఆ సభ్యులు తప్పించుకునే అవకాశం లేకుండా… విహితమైన ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు…
వీడియోలున్నాయి, ఆధారాలున్నాయి, బర్తరఫ్ కోరుతూ సభల తీర్మానాలున్నాయి… అన్నింటికీ మించి తెలంగాణ సమాజం నిరసన కనిపిస్తోంది… ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ క్యాంపు నుంచి సదరు సభ్యులకు మద్దతే తప్ప… చింతిస్తున్న జాడలేదు… పైగా దీన్ని పోలీసుల దమనకాండ అంటూ డైవర్ట్ చేసే ప్రయత్నం సాగుతోంది…
అందుకే లేటయినా సరే, గట్టిగానే కొట్టాలని చట్టసభల అధిపతులు, ముఖ్యమంత్రి, మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ ఫిక్సయ్యారు… ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది… ఇంత జరుగుతున్నా కేసీయార్ నుంచి చిన్నమాట లేదు… స్పందన లేదు… తను ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అధినేత…!!
Share this Article